రూ.కోటి విలువ చేసే గంజాయి పంట ధ్వంసం | Cannabis crop spoiled in medak district | Sakshi
Sakshi News home page

రూ.కోటి విలువ చేసే గంజాయి పంట ధ్వంసం

Nov 5 2015 8:23 PM | Updated on Sep 3 2017 12:04 PM

మెదక్ జిల్లాలో గుట్టుగా సాగుతున్న గంజాయి సాగును గురువారం పోలీసులు రట్టు చేశారు.

మెదక్: మెదక్ జిల్లాలో గుట్టుగా సాగుతున్న గంజాయి సాగును గురువారం పోలీసులు రట్టు చేశారు. నారాయణఖేడ్ సీఐ సైదానాయక్ కథనం ప్రకారం.. రేగోడ్ మండలం సిందోల్లో ప్రభాకర్‌రెడ్డి అనే వ్యక్తి తన ఎకరన్నర చేనులో గంజాయి పంటను సాగు చేస్తున్నాడు.

పొలంలో ఐదువేల మొక్కల్లో కొంత పంటను కోసి ఆరబెట్టాడు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కోతకు వచ్చిన గంజాయి మొక్కలను ధ్వంసం చేసి ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పంట విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుంది. నిందితుడు ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement