ఆయన కోసం ఆమె

Candidates Wifes Canvassing In Bhadrachalam - Sakshi

నియోజకవర్గాల్లో  సతుల ప్రచారం 

సాక్షి, భద్రాచలం/మధిర: త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తుండగా..వారికి తోడుగా సతీమణులు కూడా ఓట్లు అడుగుతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ, మహిళలను పలుకరిస్తూ, వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ ఆకట్టుకుంటున్నారు. అన్నా..అక్కా..బాబాయ్‌..పిన్ని అంటూ వరుసలు కలిపి ఆప్యాయంగా మాట్లాడుతూ..మా ఆయనకే ఓటేయండి..గెలిపించండి అంటూ అభ్యర్థిస్తున్నారు. అభివృద్ధి చేస్తారు, అండగా ఉంటారు..ఒక్కసారి అవకాశమిచ్చి విజయాన్నందించండి అంటూ కోరుతూ తమదైన శైలిలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు.   

భద్రాచలంలో డాక్టర్‌ వెంకట్రావు భార్య ప్రవీణ ప్రచారం  

కామేపల్లి: ఇల్లెందు మహాకూటమి కాంగ్రెస్‌ అభ్యర్థి బాణోతు హరిప్రియ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఊట్కూర్, కామేపల్లి, కెప్టెన్‌బంజర, బాసిత్‌నగర్, ముచ్చర్ల, జాస్తిపల్లి, సాతానిగూడెం, మద్దులపల్లి, లాల్యాతండా, పండితాపురం గ్రామాల్లో తిరిగి ఓట్లు అభ్యర్థించారు. పలుచోట్ల తండాల్లో గిరిజన మహిళలు ఆప్యాయంగా స్వాగతించారు. ఆమె ఆనందంతో వారితో సంప్రదాయ నృత్యం చేశారు. ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.  
  ఆనంద‘తాండ’వం 

నృత్యం చేస్తున్న హరిప్రియ


భద్రాచలంలో కూటమి అభ్యర్థి పొదెం వీరయ్య ,భార్య పద్మ ఇలా..  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top