
పట్నా: బీహార్‌లో నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం తొలిదశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ముస్లిం నేత అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే 25 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఆదివారం విడుదల చేసింది.
బీహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న లెక్కింపు ఉంటుంది. ఏఐఎంఐఎం పార్టీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో.. ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. బీహార్‌లో అత్యంత అణగారిన ప్రజల గొంతుకగా పార్టీ నిలుస్తుందని దానిలో పేర్కొంది. పార్టీ జాతీయ నాయకత్వం అభ్యర్థులను ఎంపికచేసింది. అమౌర్ నుండి అఖ్తరుల్ ఇమాన్(పార్టీ సీనియర్ నేత), గోపాల్‌గంజ్ నుండి అనస్ సలాం, కిషన్‌గంజ్ నుండి న్యాయవాది షమ్స్ ఆగాజ్, నర్కటియా నుండి షమీముల్ హక్, బహదూర్‌గంజ్ నుండి తౌసీఫ్ ఆలం, నవాడా నసీమా ఖాటూన్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
बिहार विधानसभा चुनाव के AIMIM प्रत्याशियों के नाम कुछ इस तरह हैं। इंशाअल्लाह उम्मीद है कि हम बिहार के सबसे मज़लूम लोगों की आवाज़ बनेंगे। यह सूची AIMIM बिहार यूनिट ने तैयार की है और इस सिलसिले में पार्टी की क़ौमी कियादत से भी मशविरा किया गया है।
We are happy to announce the list… pic.twitter.com/9ec1t4KpR2— AIMIM (@aimim_national) October 19, 2025
243 స్థానాలు కలిగిన బీహార్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్‌డీఏ భారీ స్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బీజేపీ,జేడీయూలతో కూడిన అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) ఇందుకు ముమ్మర కసరత్తు చేసింది. అక్టోబర్ 24 నుండి ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ అంతటా 12 ర్యాలీలు నిర్వహించనున్నారు. అలాగే ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు కీలక నియోజకవర్గాలలో ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఎన్‌డీఏలో సమన్వయం కనిపిస్తుండగా, ‘మహాఘట్ బంధన్’ (గ్రాండ్ అలయన్స్)లో సీట్ల పంపకాల వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. కాంగ్రెస్, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ), వామపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, సంకీర్ణ వ్యూహం ఇంకా అస్పష్టంగానే ఉంది. తాజాగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఆరు నియోజకవర్గాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ 18న తన రెండవ జాబితాను విడుదల చేసింది. దానిలో శాశ్వత్ పాండే (నర్కటియాగంజ్), జితేందర్ యాదవ్(పూర్నియా), మహమ్మద్ కమ్రుల్ హోడా(కిషన్‌గంజ్), మహమ్మద్ ఇర్ఫాన్ ఆలం (కస్బా), మోహన్ శ్రీవాస్తవ (గయా టౌన్) తదితరులు ఉన్నారు.