మానసిక సమస్యలుంటే 108కి కాల్‌ చేయండి

Call 108 if you have mental problems - Sakshi

ఐపీఎం డైరెక్టర్‌ డా.శంకర్‌ సూచన 

హ్యాంగౌట్, బిర్యానీ మిస్‌ 

అవుతున్నామని ఫోన్లు: డా.నివేదిత

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో కుంగుబాటు, ఆందోళన, ఇతర మానసిక సమస్యలు ఎదురైతే 108 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయవచ్చని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటీవ్‌ మెడిసిన్‌(ఐపీఎం) డైరెక్టర్‌ డా.శంకర్‌ పేర్కొన్నారు. ఐ అండ్‌ పీఆర్‌ శాఖ బోర్డురూంలో సైక్రియాట్రిస్ట్‌ డా.నివేదితతో కలసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రోజుకు 3వేల కాల్స్‌కు జవాబిచ్చేలా 36 టెలిఫోన్‌ లైన్లు, 5 డెడికేటెడ్‌ లైన్లను, 53 మంది కౌన్సెలర్లు షిఫ్ట్‌ల వారీగా పనిచేసేలా, ఎప్పటికప్పుడు సైక్రియాట్రిస్ట్‌ల ద్వారా సలహా సూచనలిచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. కాగా, ఈ హెల్ప్‌లైన్‌కు ప్రస్తుతం బిర్యానీ మిస్‌ అవుతున్నామని, స్నేహితులతో హ్యాంగౌట్స్‌కు వెళ్లలేకపోతున్నామంటూ యువత ఫోన్లు చేస్తున్నారని సైక్రియాట్రిస్ట్‌ డా.నివేదిత తెలిపారు. అలాంటి వారికి ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో వివరిస్తున్నట్టు తెలిపారు. ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోందని ఒకరిద్దరు ఫోన్‌ చేయగా.. అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు అందించి వారిని కాపాడినట్లు చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top