నా విజయాన్ని ఎవరూ ఆపలేరు... | c laxmareddy about his victory in elections | Sakshi
Sakshi News home page

నా విజయాన్ని ఎవరూ ఆపలేరు...

Oct 21 2017 4:08 AM | Updated on Oct 21 2017 4:08 AM

c laxmareddy about his victory in elections

జడ్చర్ల: వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేసినా తన విజయాన్ని ఆపలేరని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు.  జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జడ్చర్ల నియోజకవర్గం నుంచి కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బరిలోకి దిగుతారని జరుగుతున్న ప్రచారంపై ఆయన పైవిధంగా స్పందించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో నిర్మించనున్న స్టేడియం నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఎవరు పడితే వారు వచ్చి జడ్చర్ల లో పోటీ చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. కల్వకుర్తిలో స్థానికేతరుడైన ఎన్‌టీ రామారావును ఓడించి స్థానికుడిని గెలిపించుకున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement