బీటెక్ విద్యార్థి ఆత్మహత్య | BTech student commits suicide | Sakshi
Sakshi News home page

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Oct 21 2016 12:31 AM | Updated on Sep 4 2017 5:48 PM

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

సరైన మార్కులు రావడం లేదని ఓ బీటెక్ విద్యార్థి ఉరేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల

 గుమ్మడిదల: సరైన మార్కులు రావడం లేదని ఓ బీటెక్ విద్యార్థి ఉరేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో గురువారం జరిగింది. గుమ్మడిదలకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి, మీనాల కుమారుడు అఖిల్‌రెడ్డి ఈ ఏడాది చెన్నైలోని భారతీ యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. వారం క్రితం అఖిల్‌రెడ్డి గుమ్మడిదలకు వచ్చాడు. గురువారం సాయత్రం చెన్నై వెళ్లేందుకు రైలు టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. కానీ మధ్యాహ్నం ఇంట్లో అఖిల్‌రెడ్డి ఉరేసుకున్నాడు. బీటెక్‌లో సరైన మార్కులు రావడం లేదనే మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement