ఆరు బయట నిద్రిస్తుండగా.. దారుణ హత్య | brutal murdered in jogipet | Sakshi
Sakshi News home page

ఆరు బయట నిద్రిస్తుండగా.. దారుణ హత్య

May 29 2015 7:10 AM | Updated on Sep 3 2017 2:54 AM

ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు.

జోగిపేట (మెదక్): ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన మెదక్ జిల్లా జోగిపేటలోని శివాజీరోడ్డులో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. హమాలీగా పనిచేసే ఆంజనేయులు (30)ను దుండగులు గొడ్డలితో మెడపై నరికేశారు. స్థానికులు శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించగా, వారు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement