రోకలిబండతో అక్కను చంపాడు | brother kills sister in warangal district | Sakshi
Sakshi News home page

రోకలిబండతో అక్కను చంపాడు

Feb 20 2016 11:54 AM | Updated on Oct 8 2018 5:19 PM

వరంగల్ జిల్లా మహబూబాబాద్ పత్తిపాక కాలనీలో విషాదం చోటు చేసుకుంది.

మహబూబాబాద్: వరంగల్ జిల్లా మహబూబాబాద్ పత్తిపాక కాలనీలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే జెర్రిపోతుల ఉషను ఆమె తమ్ముడు రొకలి బండతో కొట్టి హతమార్చాడు. ఈ సంఘటన శనివారం వేకువజామున జరిగింది. మృతురాలి తల్లి తిరుపతమ్మ కథనం మేరకు వివరాలు... ఉష కు ఏడేళ్ల క్రితం సతీష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు.
 
సతీష్ హోటల్‌లో పనిచేసేవాడు. ఉష నడ వడికపై అనుమానం కలిగిన తమ్ముడు రాములు శుక్రవారం రాత్రి ఆమెతో గొడవ పడ్డాడు. మాటామాటా పెరిగి రొకలిబండతో ఆమె తలపై గట్టిగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాములు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement