breaking news
brother ana sisiter
-
చెల్లెలిని ప్రేమించాడన్న కోపంతో ఓ అన్న..
జమ్మికుంట(హుజూరాబాద్): చెల్లెలిని ప్రేమించాడన్న కోపంతో ఓ అన్న.. తన బంధువును కత్తితో గొంతు కోసి, అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లికి చెందిన మంద సంతోష్(30), మోత్కులగూడెంకు చెందిన జీడీ శివకృష్ణ అలియాస్ చిరంజీవి బంధువులు. వీరు పేయింటింగ్ వర్క్ చేస్తుంటారు. సంతోష్‌కు గతంలో పెళ్లి జరిగింది. కానీ అతని భార్య కాపురానికి రావడం లేదు. ఈ క్రమంలో అతను శివకృష్ణ చెల్లెలితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లిపోయారు. తన చెల్లెలు అదృశ్యమైందని శివకృష్ణ గత అక్టోబర్ 24న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరుపుతున్న క్రమంలో సంతోష్ ఆమెతో జమ్మికుంట చేరుకున్నాడు. వీరి ప్రేమ వ్యవహారంపై ఇరు కుటుంబాల మధ్య పంచాయితీ జరగడంతో సమస్య పరిష్కారమైంది. కానీ సంతోష్ ఆ తర్వాత కూడా ఆమెతో సఖ్యతగా ఉంటున్నాడని శివకృష్ణ అనుమానించాడు. ఈ నేపథ్యంలో అతను బుధవారం మరో ముగ్గురితో కలిసి పేయింటింగ్ పనులు చేశాడు. రాత్రి గాంధీచౌక్‌లోని సో హాన్ వైన్స్ పర్మిట్ రూమ్‌లో నలుగురూ మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో సంతోష్ అక్కడికి వచ్చి, వారితో కలిసి మద్యం సేవిస్తుండగా శివకృష్ణ కత్తితో ఒక్కసారిగా అతని గొంతు కోశాడు. ఈ ఘ టనతో పక్కనున్నవారు ఉలిక్కిపడ్డారు. సంతోష్‌ను తీసుకొని, పోలీస్‌స్టేషన్‌కు పరుగు పెట్టారు. అప్పటి కే తీవ్ర రక్తస్రావం జరిగి, అతను అపస్మారక స్థితి లోకి వెళ్లాడు. పోలీసులు తమ వాహనంలో జమ్మికు ంట ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందా డు. శివకృష్ణ పోలీసులకు లొంగిపోయాడు. -
దాని అంతు నేను చూస్తాను
పిల్లల్లో కామిక్ సీరియళ్లు హింసను ప్రేరేపిస్తున్నాయి అని నిన్న మొన్నటి వరకు బెంగ పెట్టుకునేవాళ్లం. అయితే పెద్దలు చూసే టీవీ సీరియళ్లను, టీవీ డిబేట్లను చూస్తున్నందు వల్ల పిల్లల్లో కనిపిస్తున్న విపరీత ధోరణులతో పోలిస్తే.. కామిక్ హింసే నయం అనే భావన కలగడం సహజమే! ఒక ఇంట్లో : అన్నాచెల్లెళ్లు స్కూలు నుంచి వచ్చారు. ఎవరి హోమ్‌వర్క్ వాళ్లు చేసుకుంటున్నారు. స్కూలుకు తీసుకెళ్లిన బుక్స్ అన్నీ తిరిగొచ్చాయో లేదోనని కూతురి స్కూల్ బ్యాగ్‌ని అలవాటుగా చెక్ చేస్తోంది తల్లి. అందులో ఓ బుక్ ఆమెకు కనిపించినట్లు లేదు.‘‘దియా నీ సైన్సు పుస్తకాన్ని నేహా నుంచి తిరిగి తీసుకున్నావా?’’ అని కూతుర్ని అడిగింది. రాస్తున్న నోట్‌బుక్‌ని, బాల్పెన్నీ పక్కన పెట్టి సీరియస్‌గా పైకి లేచింది దియా. నేహా పేరు వినగానే ఆ పాప ముఖం అప్రసన్నంగా మారిపోయింది. కళ్లు పెద్దవి చేసింది. మూతి బిగించింది. ‘‘తన గురించి ఏమనుకుంటోంది! అది నా మీద కుట్ర పన్నుతుందా?’’ అంది! తల్లి బిత్తరపోయింది. ‘దియా..’ అంది! ‘‘దాని అంతు.. నేను చూస్తాను’’ అంది దియా. ‘దాని అంతు’ అని చిన్న విరామం ఇచ్చి ‘నేను చూస్తాను’ అని అంటున్నప్పుడు టీవీ సీరియళ్లలో పగబట్టి, ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న లేడీ క్యారెక్టర్లా ఉంది ఆరేళ్ల ఆ పాప. ఆ తల విసరడం, చేతులు తిప్పడం, కళ్లలో కోపాన్ని ఒలికించడం.. తల్లికి దడపుట్టించేలా ఉన్నాయి. దియా అన్నయ్య కూడా హోమ్‌వర్క్ ఆపేసి దియా వైపు ఆశ్చర్యంగా చూస్తుంటాడు.అక్కడితో ఆగదు దియా. కుడి చేతి పిడికిలి బిగించి పైకి లేపుతూ.. ‘‘అది నా చేతిలోంచి తప్పించుకోలేదు’’ అంటుంది. పళ్లు కూడా బిగిస్తుంది.‘‘దియా..!!’ అని ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది తల్లి. ‘‘ఆగు’’ అని పెద్దగా అరిచి తల్లిని అడ్డుకుంటుంది దియా. ఆగుతుంది తల్లి. అప్పుడు అంటుంది దియా.. ‘‘చూస్తూ ఉండమ్మా..’’ అని. దియా తల్లి చేష్టలుడిగిపోతుంది. ఇంకో ఇంట్లో : అక్కా తమ్ముడు టేబుల్ మీద ఎవరి ఆటలో వాళ్లు ఉంటారు. తమ్ముడు చిన్న చిన్న బ్లాక్స్‌తో టేబుల్‌పై బిల్డింగ్ నిలబెడుతుంటాడు. బొమ్మలతో ఆడుతుంటుంది అక్క. ఈ సీన్లో.. ఇంటికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తారు. పిల్లల అమ్మానాన్న ఎదురెళ్లి ఆ వచ్చిన భార్యాభర్తల్ని రిసీవ్ చేసుకుంటారు. ‘‘సారీ రమేశ్.. మా అబ్బాయి సి«ద్ ఆడుకోవడానికి రాలేకపోయాడు’’ అంటాడు ఆ వచ్చినాయన. ఆడుకోవడానికి వచ్చేటప్పుడు సిద్‌ను కూడా తెస్తామని ముందే మాట ఇచ్చినట్లున్నారు ఆ దంపతులు. కానీ వెంటబెట్టుకు రాలేకపోయారు. అందుకే ఆయన ‘సారీ’ చెప్పాడు.‘సారీ’ అనే మాట వినగానే బ్లాక్స్‌తో బిల్డింగ్ కడుతున్న పిల్లాడు వింతగా, విడ్డూరంగా, విసుగ్గా చూసి.. ‘‘సారీ..! సరిపోతుందా సారీ’’ అంటాడు. అంతేకాదు, తల అడ్డంగా ఊపుతూ.. ‘‘ఇది తేలిగ్గా తీసుకునేది కాదు’’ అని కూడా అంటాడు. వచ్చిన పెద్దలు, ఈ ఇంట్లో ఉన్న పెద్దలు ఇబ్బందిగా ముఖాలు చూసుకుంటారు. పిల్లాడు ఆపడు. ‘‘ఇది గట్టిగా తేల్చుకోవాల్సిన అంశం. సిద్ సమాధానం ఇవ్వాలి. ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది చాలా అన్యాయం’’ అని రెండు చేతులూ గాలిలో ఊపుతాడు. వాడి మోచేయి తగిలి టేబుల్‌పై అంత వరకు బ్లాక్స్‌తో అతడు కట్టిన భవంతి కుప్పకూలిపోతుంది. ఇవి రెండూ.. వారం రోజులుగా డిస్నీ ఇండియా (తెలుగు) ప్రమోట్ చేస్తున్న వీడియోలు. ‘దట్ ఆక్వర్డ్ మోమెంట్’ పేరుతో పార్ట్’ 1, పార్ట్ 2 ఈ వీడియోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది డిస్నీ చానెల్. ప్రైమ్ టైమ్‌లో వచ్చే టీవీ సీరియళ్లు, హోరాహోరీగా సాగే న్యూస్ డిబేట్లు పిల్లలపై ఎంతగా ప్రభావం చూపుతున్నాయో చెబుతూ.. ‘పిల్లలు కేవలం పెద్దలు చూడవలసిన ప్రోగ్రామ్‌లను చూస్తుంటే ఏం నేర్చుకుంటారు? డిస్నీ కిడ్స్ ప్యాక్ తీసుకోండి. డిస్నీ యొక్క బాల్యపు మ్యాజిక్‌ను పదిలపరుచుకోండి’ అని అంటుంది డిస్నీ చానెల్. పై రెండు వీడియోల్లో లాస్ట్ సీన్‌గా.. పిల్లలు డిస్నీ కామిక్ సీరియళ్లు చూస్తూ లోకాన్ని మైమరిచి పకపక నవ్వేస్తుంటే వాళ్లను చూసి పేరెంట్స్ మురిసిపోతుంటారు. డిస్నీ ఈ వీడియోలను తన వ్యాపారం కోసమే తయారు చేసినా, పెద్దల ప్రోగ్రాములు ఆ చిన్న మెదళ్లను ఎలా దూకుడుగా, దుందుడుకుగా మార్చేస్తున్నదీ చక్కగా చెప్పగలిగింది. అంతేకదా.. కుట్రలు పన్నే అత్తాకోడళ్లు, బుసలుకొట్టే ఆడపడుచులు, పెద్ద గొంతేసుకుని డిబేట్‌కు వచ్చినవాళ్లపై విరుచుకుపడే ఆర్ణబ్ గోస్వాములు పదీ పన్నెండేళ్ల పిల్లలకు ఏం అవసరం? అయితే పిల్లలు చూసే కామిక్స్‌లో మాత్రం హింస ఉండటం లేదా? ఉంటుంది. కానీ అది నవ్వించే హింస. నవ్వునే మర్చిపోయేంత హింస కాదు. హింసలో ప్రేరేపించే గుణం ఉంటుంది. పిల్లల్లో త్వరగా ప్రేరణకు గురయ్యే బలహీనత ఉంటుంది. అందుకే టామ్ అండ్ జెర్రీ, మిక్కీ మౌజ్, పాపోయ్, 3 స్టూజెస్, సూపర్‌మేన్, లూనీ ట్యూన్స్, స్కూబీ డూ, బఫీ ది వాంపైర్ స్లేయర్, అమెరికన్ డాల్ వంటి కార్టూన్ షోలు ఇంతగా పిల్లల్ని ఆకట్టుకుంటున్నాయి. అయితే.. ‘‘ఆకట్టుకోవడం వరకు మంచిదేకానీ, వాటిల్లోని క్యారెక్టర్లు రోజంతా పిల్లల్ని అలా కట్టి పడేసి ఉంచుతున్నాయి. వారిలో దుడుకు స్వభావాన్ని పెంపొందిస్తున్నాయి’’ అని ఐయోవా స్టేట్ యూనివర్సిటీ నాలుగేళ్ల క్రితమే చేసిన ఒక అధ్యయనంలో వెల్లడయింది! పిల్లలు చూసే పెద్దవాళ్ల ప్రోగ్రాములు ఇందుకు రివర్స్. ఆకట్టుకోవు కానీ, కట్టేసుకుంటాయి. -
రోకలిబండతో అక్కను చంపాడు
మహబూబాబాద్: వరంగల్ జిల్లా మహబూబాబాద్ పత్తిపాక కాలనీలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే జెర్రిపోతుల ఉషను ఆమె తమ్ముడు రొకలి బండతో కొట్టి హతమార్చాడు. ఈ సంఘటన శనివారం వేకువజామున జరిగింది. మృతురాలి తల్లి తిరుపతమ్మ కథనం మేరకు వివరాలు... ఉష కు ఏడేళ్ల క్రితం సతీష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. సతీష్ హోటల్లో పనిచేసేవాడు. ఉష నడ వడికపై అనుమానం కలిగిన తమ్ముడు రాములు శుక్రవారం రాత్రి ఆమెతో గొడవ పడ్డాడు. మాటామాటా పెరిగి రొకలిబండతో ఆమె తలపై గట్టిగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాములు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.