చెల్లిని చంపేశాడు | Brother killed his sister in karimnagar district | Sakshi
Sakshi News home page

చెల్లిని చంపేశాడు

May 16 2015 11:19 AM | Updated on Sep 3 2017 2:10 AM

డబ్బు కోసం ఓ అన్న సొంత చెల్లెలుపై రోకలిబండతో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటన శనివారం కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం చెర్లకొండాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

కరీంనగర్: డబ్బు కోసం ఓ అన్న సొంత చెల్లెలుపై రోకలిబండతో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటన శనివారం కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం చెర్లకొండాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. చెర్లకొండాపూర్లో అశోక్ అనే యువకుడు తన చెల్లెలు రోజా (24) డబ్బులు ఇవ్వమని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. దాంతో పక్కనే ఉన్న రోకలి బండ తీసుకుని సోదరి తలపై కొట్టాడు.

దీంతో స్థానికులు వెంటనే స్పందించి ఆమెను జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోజా మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం కరీంనగర్ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అశోక్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement