రిమోట్‌ కారు పేలి బాలుడికి త్రీవ గాయాలు.. | Boy Injured in Remote Car blast in Bhadradri Kothagudem | Sakshi
Sakshi News home page

రిమోట్‌ కారు పేలి బాలుడికి త్రీవ గాయాలు..

Feb 24 2018 11:07 AM | Updated on Jul 12 2019 3:29 PM

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఓ రిమోట్‌ కారు పేలడంతో పది సంవత్సరాల బాలుడికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని టేకులపల్లి మండలం కొత్తూరులో చోటుచేసుకుంది. వివరాలివి.. గ్రామానికి చెందిన అరవింద్‌(10) జాతరలో కొనుగోలు చేసిన రిమోట్‌ కారుతో ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో కారు ఒక్కసారిగా పేలడంతో బాలుడికి తీవ్ర గాయలయ్యాయి.  చికిత్స నిమిత్తం ఆ చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

ఆ ప్రమాదంలో బాలుడి ఎడమ చేయి నుజ్జునుజ్జయింది. అంతేకాక కడుపులో నుంచి పేగులు బయటకు వచ్చాయి. బాలుడి పరిస్థితిని పరీక్షించిన వైద్యులు సర్జరీ చేసేందుకు ఏర్పాటు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement