సెల్‌ చార్జింగ్ పెడుతూ బాలుడు మృత్యువాత | boy dies by short circuit at cell charging | Sakshi
Sakshi News home page

సెల్‌ చార్జింగ్ పెడుతూ బాలుడు మృత్యువాత

May 3 2015 9:55 PM | Updated on Jul 12 2019 3:02 PM

సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ బాలుడు మృతి చెందాడు.

వికారాబాద్ రూరల్(రంగారెడ్డి జిల్లా): సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ బాలుడు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పీలారం గ్రామానికి చెందిన మైనొద్దీన్, ఫాతిమా దంపతుల రెండో కుమారుడు అబ్బాస్(17) వ్యవసాయ పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం అదే గ్రామంలోని తన నానమ్మ ఇంటికి వెళ్లాడు.

 

తన సెల్‌కు చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే అబ్బాస్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement