కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌.. బాంబు కలకలం | Bomb Threat call to Konark Express Train in Madhira | Sakshi
Sakshi News home page

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌.. బాంబు కలకలం

Feb 24 2018 9:53 AM | Updated on Aug 21 2018 6:02 PM

Bomb Threat call to Konark Express Train in Madhira - Sakshi

సాక్షి, ఖమ్మం: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందనే సమాచారం కలకలం రేపింది. దీంతో ప్రయాణికులు భయందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మధిర రైల్వే స్టేషన్‌లో విస్తృత తనిఖీలు చేపట్టారు.  ట్రైన్‌లోని S 11 కోచ్‌ సీట్‌ నెంబర్‌ 57 కింద అనుమానాస్పదంగా ఉన్న రెండు చిన్న బాక్స్‌లు, ఒక చేతి సంచీని పోలీసులు గుర్తించి వాటిని స్టేషన్‌కి దూరంగా తరలించారు. అనంతరం బాంబు స్వ్కాడ్‌కు సమాచారం అందించారు. రైల్వే స్టేషన్‌లో మరోసారి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ముంబై నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఖమ్మంలో కాసేపు నిలిపివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement