‘ఎంపీటీసీలకు 6 వేల గౌరవ వేతనమివ్వాలి’ | Bolli swamy to demand for MPTCs should give 6 thousand honorary wage | Sakshi
Sakshi News home page

‘ఎంపీటీసీలకు 6 వేల గౌరవ వేతనమివ్వాలి’

May 20 2014 6:03 AM | Updated on Sep 2 2017 7:37 AM

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఎంపీటీసీల ద్వారానే ఖర్చు చేయాలని, వారికి నెలవారీ గౌరవ వేతనం కింద రూ.6 వేలు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ ఎంపీటీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ఫోరం(టీఎస్ ఎంపీటీసీ ఫోరం) కన్వీనర్ బొల్లి స్వామి డిమాండ్ చేశారు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఎంపీటీసీల ద్వారానే ఖర్చు చేయాలని, వారికి నెలవారీ గౌరవ వేతనం కింద రూ.6 వేలు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ ఎంపీటీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ఫోరం(టీఎస్ ఎంపీటీసీ ఫోరం) కన్వీనర్ బొల్లి స్వామి డిమాండ్ చేశారు. తెలంగాణలోని 6,277 మంది ఎంపీటీసీల్లో 1,497 మంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారని, రాష్ర్ట అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయాలని కోరారు. ఈ మేరకు స్థానిక బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో సోమవారం జరిగిన ఫోరం ఆవిర్భావ సభలో స్వామి మాట్లాడారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎంపీటీసీలకు అధికారాలు, హోదా కల్పించాలన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎం కానున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఫోరం నేతలు విజయ్‌కుమార్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement