‘కేసీఆర్‌ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు’ | bjp state president lakshman takes on kcr over mulsim reservations | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు’

Apr 17 2017 12:13 PM | Updated on Mar 29 2019 9:00 PM

‘కేసీఆర్‌ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు’ - Sakshi

‘కేసీఆర్‌ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు’

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక‍్టర్‌ లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక‍్టర్‌ లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం ఇక్కడ మాట్లాడుతూ మతం పేరుతో రిజర్వేషన్లు ఇవ‍్వడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ముస్లింలపై ఉన్న ప్రేమ కేసీఆర్‌కు ఇతర సామాజిక వర్గాలపై లేదని లక్ష్మణ్‌ దుయ్యబట్టారు.  ముస్లింలలో పేదరికం లేదని తాము అనడం లేదని, అయితే ఓటు బ్యాంకు రాజకీయాలకు తాము వ్యతిరేకమన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలను కేసీఆర్‌ వక్రీకరించారన్నారు. ప్రధాని మాటలు మస్లిం రిజర్వేషన్లను సమర్థించడం గురించి కాదని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపడతామన్నారు. ముస్లింల సంక్షేమం కోసం షాదీముబారక్‌ వంటి కార్యక్రమాలు చేస్తే అభ్యంతరం లేదని, కానీ మతపరమైన రిజన్వేషన్లను  తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని లక్ష్మణ్‌ తేల్చి చెప్పారు. ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో పర్యటిస్తారని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement