రెండో రౌండ్లోనూ బీజేపీ ముందంజ | BJP cadidate Ramachandra Rao leading | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్లోనూ బీజేపీ ముందంజ

Mar 25 2015 7:55 PM | Updated on Aug 29 2018 6:26 PM

తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో పట్టుభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ముందంజలో ఉన్నారు.

తొలి రౌండ్లో ముందంజలో ఉన్న రామచంద్రరావు రెండో రౌండ్లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రామచంద్రరావు తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ కంటే 6వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఫలితాల సరళి ఇలాగే కొనసాగితే గెలుస్తామని బీజేపీ వర్గాల ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నుంచి ఎర్రబెల్లి రామ్మోహన్ రావు పోటీ చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement