రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | biker killed in a road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Nov 4 2015 10:38 AM | Updated on Aug 30 2018 3:56 PM

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మండలంలోని సింగరాజుపల్లికి చెందిన పొనుగోటి శ్రీనివాసరావు(45) వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తెల్లవారు జామున బైక్ పై వెళ్తుండగా.. బైక్ తూర్పుపల్లి శివారుకు చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



నల్లగొండ, రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి, గుర్తు తెలియని వాహనం, బైకర్ మృతి

Advertisement
 
Advertisement
Advertisement