బైక్‌ను ఢీకొన్న ఎమ్మెల్యే సీతక్క కారు, పాప మృతి | MLA sitakka car hits bike, one killed | Sakshi
Sakshi News home page

May 18 2019 11:09 AM | Updated on Jul 11 2019 8:03 PM

Bike hits MLA sitakka car, one killed - Sakshi

సాక్షి, వరంగల్‌ : ములుగు జిల్లా ఎమ్మెల్యే సీతక్క కారు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం శివారులోని జీడివాగు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దంపతులు తమ చిన్నారిని తీసుకొని బైక్‌పై వెళ్తుండగా జీడివాగు సమీపంలో ఎదురుగా దూసుకొచ్చిన ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, దంపతులు గాయపడ్డారు. అయితే పాప తండ్రి పరిస్థితి విషమంగా ఉంది.  దంపతులను చికిత్స నిమిత్తం ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని చిన్నారి మృతి

Advertisement
 
Advertisement
Advertisement