గొర్రెల కాపరిపై ఎలుగు దాడి | Bear attacks Shepherd | Sakshi
Sakshi News home page

గొర్రెల కాపరిపై ఎలుగు దాడి

Aug 15 2015 4:40 PM | Updated on Sep 3 2017 7:30 AM

గొర్రెల మేత కోసం వెళ్లిన కాపరిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది.

అమ్రాబాద్ (మహబూబ్‌నగర్ జిల్లా) : గొర్రెల మేత కోసం వెళ్లిన కాపరిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం ఉప్పునూతలబికే గ్రామంలోని అటవీ ప్రాంతంలో శనివారం జరిగింది. మండలంలోని కుమ్మరోనిపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య గత నెల రోజులుగా తన గొర్రెల మందను ఉప్పునూతలబికే గ్రామం సమీపంలోని అటవీప్రాంతానికి మేతకు తీసుకెళ్తున్నాడు.

కాగా ఈ క్రమంలోనే శనివారం గొర్రెల మేతకు వెళ్లిన అతనిపై ఎలుగుబండి దాడి చేసింది. ఈ విషయాన్ని గమనించిన మరికొంతమంది గొర్రెల కాపరులు ఎలుగుబంటిని తరిమికొట్టారు. తీవ్రంగా గాయపడిన వెంకటయ్యను అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఇదే మండలంలో శుక్రవారం మరో రైతు ఎలుగుబంటి దాడిలో గాయపడిన విషయం తెలిసిందే. దీంతో మండలంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement