‘ప్రత్యేక హైకోర్టు కోసం చాలా నిరసనలు చేశాము’

Bar Council Member Vishnuvardhan Reddy Comments On High Court Bifurcation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉమ్మడి హైకోర్టు విభజన చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలంగాణ  బార్ కౌన్సిల్ మెంబర్, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఉన్న 20 వేల మంది న్యాయవాదులందరికి ఆనందంగా ఉందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కోసం చాలా నిరసనలు చేశామన్నారు. హైకోర్టు విభజించడం వల్ల కేసులు పరిష్కారం తొందరగా అవుతాయని తెలిపారు. 

హైకోర్టు విభజన వల్ల తెలంగాణ న్యాయమూర్తులకు అవకాశం ఉంటుందన్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా కేసులు పరిష్కారంకు అనువుగా ఉంటుందని తెలిపారు. ఏపీ న్యాయమూర్తులు, న్యాయవాదులకు సహకరిస్తామన్నారు. కేసుల బదిలీలో విచారణ, పరిష్కారం వంటి సమస్యలు ఉంటాయని, కానీ వారికి తమ మద్దతు ఉంటుందని అన్నారు. ఇప్పటికే ఏపీ న్యాయమూర్తులు, అడ్వకేట్లు ఆప్షన్లు ఇచ్చుకున్నారని తెలిపారు. న్యాయమూర్తుల కమిటీ వెళ్లి పరిశీలించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నారని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top