ఏపీకి ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి: బాల్క సుమన్ | balka suman slams ashok gajapathi raju | Sakshi
Sakshi News home page

ఏపీకి ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి: బాల్క సుమన్

Nov 28 2014 2:05 AM | Updated on Sep 2 2017 5:14 PM

ఏపీకి ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి: బాల్క సుమన్

ఏపీకి ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి: బాల్క సుమన్

చంద్రబాబు... మీకు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే ఏపీలోని 4 విమానాశ్రయాలకు ఆయన పేరు పెట్టుకో.

సాక్షి, న్యూఢిల్లీ: ‘‘చంద్రబాబు... మీకు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే ఏపీలోని 4 విమానాశ్రయాలకు ఆయన పేరు పెట్టుకో. ప్రేమ మరీ ఎక్కువైతే ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌గా పేరు పెట్టుకో’’ అని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ సలహా ఇచ్చారు. విజయ్‌చౌక్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

శంషాబాద్ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టి తెలంగాణపై ఆధిపత్యాన్ని కొనసాగించవద్దన్నారు. దీనిపై సమాధానం చెప్పాల్సి వస్తుందని మంత్రి అశోక్‌గజపతి రాజు సభలకు హాజరవకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. టెర్మినల్ పేరు మార్పిడిలో బాబు కుట్రలపై ప్రధాని మోదీని కలసి వివరించనున్నట్టు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement