'కేసులకు భయపడేది లేదు'

Asaduddin Owaisi Comments About Ayodhya Verdict In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బాబ్రీ మసీదు–అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు పై రాజ్యాంగం పరిధిలోనే మాట్లాడానని, కేసులకు భయపడేది లేదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ బద్ధంగా అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు తనకు ఉందని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను సంతోష పెట్టేలా మాట్లాడలేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందని తేల్చి చెప్పారు. ‘నాపై ఎంత మాట్లాడుతారో మాట్లాడండి. అది మీ హక్కు. ఎంత అసహనం వెల్లగక్కుతారో వెల్లగక్కండి. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు భయపడేది లేదు’అని అన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top