టీడీపీని ఖాళీ చేయించడం ఎవరి వల్ల కాదు | Arikela narsareddy takes on trs | Sakshi
Sakshi News home page

టీడీపీని ఖాళీ చేయించడం ఎవరి వల్ల కాదు

Dec 23 2014 2:01 AM | Updated on Aug 15 2018 9:06 PM

టీడీపీని ఖాళీ చేయించడం ఎవరి వల్ల కాదు - Sakshi

టీడీపీని ఖాళీ చేయించడం ఎవరి వల్ల కాదు

తెలంగాణలో టీడీపీని ఖాళీ చేయిస్తామని సీఎం కేసీఆర్ అంటున్నారని..

కమ్మర్‌పల్లి: తెలంగాణలో టీడీపీని ఖాళీ చేయిస్తామని సీఎం కేసీఆర్ అంటున్నారని, అది ఎవరి వల్ల సాధ్యం కాదని ఎమ్మెల్సీ,  టీడీపీ జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి అన్నారు. తమ పార్టీ టాటా కంపెనీ లాంటిదని దాన్ని ఎవరు ఏమి చేయలేరన్నారు. సోమవారం మండల కేంద్రంలో టీడీపీ కార్యకర్తల కు గుర్తింపు కార్డులను నర్సారెడ్డి  పంపిణీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తోందన్నారు.

రైతాంగానికి ఏడు గంట ల పాటు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామని, ప్రతి రైతుకు రుణమాఫీ, ప్రతి నిరుపేద కుటుంబానికి పింఛన్ అందిస్తామని హామీలు ఇచ్చారని గుర్తుచేశారు.  ప్రస్తుతం వీటిని విస్మరించారన్నారు. ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకపోతే మెడలు వంచి పని చేయిస్తామన్నారు. రుణమాఫీ పథకం కింద బ్యాంకుల్లో 25 శాతం మాత్రమే రుణం ఇస్తున్నార ని, కానీ నూరు శాతానికి రైతులతో సంతకం తీసుకుంటున్నారని ఆరోపించారు. బ్యాంకర్లు, ప్రభుత్వం ఒక్కటై రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.

రైతులు ఎంత మొత్తం తీసుకుంటే అంతే మొత్తానికి సంతకం తీసుకోవాలని ఆయన డిమాం డ్ చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రం లో చెరువులు కుంటలను అభివృద్ధి చేస్తామని సీఎం ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ఇదివరకు పరి పాలించిన ప్రభుత్వాలు చెరువులు, కుంటలను కా పాడకపోతే ఇపుడు అవి ఉండేవా అని ప్రశ్నించా రు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి జనవరి ఒకటి నుంచి బీమా వర్తిస్తుందని తెలిపారు. సభ్యత్వం తీసుకోవడానికి మంగళవారం ఆఖరి రోజన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement