రేపు రాష్ట్రపతిని కలవనున్న ఏపీ మంత్రులు | AP ministers to meet president pranab mukerjee tomorrow | Sakshi
Sakshi News home page

రేపు రాష్ట్రపతిని కలవనున్న ఏపీ మంత్రులు

Jul 5 2015 5:08 PM | Updated on Mar 23 2019 9:03 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు రేపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కలవనున్నారు.  ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్-8ని అమలు చేసే విషయంపై ప్రణబ్తో చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు ఓటుకు కోట్లు వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాల్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు సమాచారం.

 

శనివారం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్నిప్రణబ్ దర్శించుకున్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఆయనకు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం ప్రణబ్ సువర్ణ పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement