‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’లో ఎలాంటి మార్పు లేదు: సీపీ | Anjani Kumar: There is No Change In Drunk And Drive | Sakshi
Sakshi News home page

కరోనా: ‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఎలాంటి మార్పు లేదు’

Mar 4 2020 3:28 PM | Updated on Mar 4 2020 3:34 PM

Anjani Kumar: There is No Change In Drunk And Drive - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వల్ల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిలిపి వేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న వార‍్తల్లో వాస్తవం లేదని సీపీ అంజనీ కుమార్‌ స్పష్టం చేశారు.  డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ స్పెషల్‌ డ్రైవ్స్‌లో ఎలాంటి మార్పు లేదని, యథావిధిగా కోనసాగుతుందని ఆయన తెలిపారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చెకింగ్స్‌లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఒక్కొక్కరికి ఒక్కో స్ట్రా(పుల్లలు) పెట్టి చెక్ చేస్తున్నామని తెలిపారు. మరోవైపు కోవిడ్‌-19ను అదుపు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ప్రభుత్వం సూచించే అన్ని జాగ్రత్తలను ప్రజలు పాటించాలని సూచించారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించారు. (దేశంలో 28 కరోనా కేసులు: కేంద్ర మంత్రి)

కరోనా వైరస్‌కు సంబంధించిన వార్తల కోసం క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement