
'అమరవీరులే నిజమైన హీరోలు'
అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ కల సాకారమైందని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు
కరీంనగర్: అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ కల సాకారమైందని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అమరవీరులే నిజమైన హీరోలని అన్నారు. కరీంనగర్ జిల్లాలో 132 మంది అమరవీరుల కుటుంబాలకు సోమవారం మంత్రి రూ. 13.20 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు.
ఆకలికేకలు,ఆత్మహత్యలులేని బంగారు తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరం ఉందని ఈటెల రాజేందర్ చెప్పారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలతో కలసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు.