ఇకపై వారానికి ఐదు రోజుల పాటు యూనిఫాంను తప్పనిసరిగా ధరించాలని తమ హెడ్‌క్వార్టర్స్‌లోని అధికారులకు రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ సోమవారం ఆదేశించారు.
* అదనపు డీజీలు మొదలుకొని ఎస్పీల వరకు..
* డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: ఇకపై వారానికి ఐదు రోజుల పాటు యూనిఫాంను తప్పనిసరిగా ధరించాలని తమ హెడ్‌క్వార్టర్స్‌లోని అధికారులకు రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ సోమవారం ఆదేశించారు. రాష్ట్ర విభజన అనంతరం డీజీపీ కార్యాలయంలోని కొందరు అధికారులు మినహా మిగతా వారు యూనిఫాం ధరిం చి రాకపోవడం డీజీపీ దృష్టికి వచ్చింది. అదనపు డీజీలు మొదలుకుని ఎస్పీ స్థాయి అధికారుల వరకు సివిల్ దుస్తుల్లోనే కా ర్యాలయానికి రావడం వలన క్రమశిక్షణ దెబ్బతింటున్నదని ఆ యన భావించినట్లు తెలిసింది. దీంతో ఇకపై సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు యూనిఫాంను తప్పని సరిగా ధరించి రావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.