2 కోట్ల మందితో ఉద్యమిస్తాం

All party leaders warns state government on BC reservation - Sakshi

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తే ఊరుకోం

రాష్ట్ర ప్రభుత్వానికి అఖిల పక్ష నేతల హెచ్చరిక 

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే రెండు కోట్ల మందితో ఉద్యమిస్తామని అఖిలపక్ష నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి కుదించడాన్ని తప్పుపడుతూ ఆదివారం ఇందిరాపార్క్‌ వద్ద బీసీ సంక్షేమ సంఘం మహా ధర్నా నిర్వహించింది. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రే య, కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తదితరులు ఇం దులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో బీసీలు 50 శాతానికి పైగా ఉన్నారని, ఆ మేరకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనన్నారు. గత ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయగా.. ఈ దఫా వాటిని 23 శాతానికి కుదిస్తూ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను తక్షణమే రద్దు చేసి బీసీ రిజర్వేషన్లను పెంచాలన్నారు. 

జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిందే
జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ఏళ్లుగా ఉద్యమించి సాధించుకున్న బీసీ రిజ ర్వేషన్లను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తగ్గించినట్లు కనిపిస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే సహిం చేది లేదని, రాష్ట్రంలోని 2 కోట్ల మందితో ఉద్యమా న్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఇవ్వాలని, ఇందుకు చట్టబద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నా రు. పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు ద్వారా రిజ ర్వేషన్లపై నిర్ణయం తీసుకోవచ్చన్నారు. అప్పటివరకు పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలన్నారు. ఈ ధర్నాకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, టీజేఏస్‌ అధ్యక్షుడు కోదండరాం సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, జనార్దన్, నీల వెంకటేశ్, జి.మల్లేశ్, జైపాల్, అనంతయ్య, బీఆర్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top