ఆదిలాబాద్‌@ 41 | Adilabad @41 | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌@ 41

Mar 25 2017 6:50 PM | Updated on Aug 17 2018 2:56 PM

రాష్ట్రంలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి.

హైదరాబాద్‌: రాష్ట్రంలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్లగొండల్లో 40 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
 
హన్మకొండ, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, రామగుండంలలో 39 డిగ్రీల చొప్పున, హైదరాబాద్‌లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా, ఖమ్మంలో 4 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రత రికార్డు అయింది. వచ్చే నాలుగు రోజులు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement