అదనపు చెల్లింపులకు ఓకే! | Additional payments are okay! | Sakshi
Sakshi News home page

అదనపు చెల్లింపులకు ఓకే!

May 16 2015 12:51 AM | Updated on Jul 11 2019 7:49 PM

సాగునీటి ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ధరల పెంపు (ఎస్కలేషన్) చేయాలని ప్రభుత్వం నియమించిన ఎస్కలేషన్ కమిటీ నిర్ణయించింది.

హైదరాబాద్:  సాగునీటి ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ధరల పెంపు (ఎస్కలేషన్) చేయాలని ప్రభుత్వం నియమించిన ఎస్కలేషన్ కమిటీ నిర్ణయించింది. ఏపీలో ఎస్కలేషన్ అమలు చేస్తున్న దృష్ట్యా తెలంగాణలోనూ దీన్ని అమ లు చేయాల్సిందేనని  కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది.

ఈ మేరకు శుక్రవారం మరోమారు భేటీ అయిన కమిటీ తన తుది నివేదికను సిద్ధం చేసింది. జీవో-13ను చిన్నపాటి మార్పుచేర్పులతో అమలు చే యాలని కమిటీ తన నివేదికలో పే ర్కొన్నట్లుగా తెలిసింది. కాంట్రాక్టర్లు  కోరుతున్న మేర ఎస్కలేషన్ చెల్లిస్తే నీటిపారుదలశాఖపై రూ. 4వేల కో ట్ల భారం పడుతుందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement