నల్లగొండ జిల్లా పోల్కంపల్లి వీఆర్ఓ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
నల్గొండ: నల్లగొండ జిల్లా పోల్కంపల్లి వీఆర్ఓ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్దఅడిశర్లపల్లి మండలం పోల్కంపల్లిలో పట్టాదారు పాసు పుస్తకం కోసం బద్డెన శంకర్ అనే రైతు వీఆర్‌ఓ సత్యనారాయణను కలిశాడు. అయితే వీఆర్ఏ రూ.15 వేలు లంచం అడగటంతో సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం ఉదయం రైతు నుంచి రూ.5 వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.