breaking news
polkam palli
-
పోల్కంపల్లిలో కొండారెడ్డి బురుజు
సాక్షి, సంగారెడ్డి : ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఉండాల్సిన కొండారెడ్డి బురుజు మన జిల్లాకు వచ్చింది. అదెలా సాధ్యమనుకుంటున్నారా..? ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లిలో మహేష్‌బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ కోసం ఏర్పాటుచేశారు. గతంలో ‘ఒక్కడు’ సినిమాలో కొండారెడ్డి బురుజు వద్ద మహేష్‌బాబు, ప్రకాష్‌రాజ్‌తో ఫైట్ సీన్ గుర్తుంది కదా. ఇక్కడ ‘మీనాక్షి’, ‘మహర్షి’ తదితర సినిమాలకు భారీ సెట్టింగ్‌లు వేశారు. మళ్లీ ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా కోసం కొండారెడ్డి బురుజు సెట్టింగ్ తీర్చిదిద్దారు. 25 నుంచి షూటింగ్ ప్రారంభంకానుంది. – ఇబ్రహీంపట్నం రూరల్ -
ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ
నల్గొండ: నల్లగొండ జిల్లా పోల్కంపల్లి వీఆర్ఓ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్దఅడిశర్లపల్లి మండలం పోల్కంపల్లిలో పట్టాదారు పాసు పుస్తకం కోసం బద్డెన శంకర్ అనే రైతు వీఆర్ఓ సత్యనారాయణను కలిశాడు. అయితే వీఆర్ఏ రూ.15 వేలు లంచం అడగటంతో సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం ఉదయం రైతు నుంచి రూ.5 వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.