ఏటా 724.3 ఎంయూల విద్యుదుత్పత్తి!

Above 24 MU of Power generation annually - Sakshi

రూ.866 కోట్లతో దుమ్ముగూడెం పవర్‌ హౌజ్‌

ఏడాదిలో 70–80 రోజుల పాటు ఉత్పత్తికి చాన్స్‌

ప్రాజెక్టు డీపీఆర్‌ నివేదికలో వెల్లడించిన ప్రభుత్వం 

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి నదిపై తలపెట్టిన 320 మెగావాట్ల దుమ్ముగూడెం జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణం పూర్తైతే ఏటా 724.3 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి జరగనుంది. రూ.4504 కోట్ల అంచనా వ్యయంతో దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం డీపీఆర్‌ను సిద్ధం చేసింది. 37 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జలాశయం పాటు 320 మెగావాట్ల విద్యుదు త్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొ క్కటి 40 మెగావాట్ల సామర్థ్యం గల 8 విద్యుదుత్పత్తి యూనిట్లు కలిపి 320 మెగావాట్ల సామర్థ్యం గల ఇంటిగ్రేటెడ్‌ పవర్‌హౌజ్‌ను నిర్మించనుంది.

ఏడెనిమిది ఏళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డీపీఆర్‌ నివేదిక ప్రకారం.. ఏటా 70–80 రోజుల పాటు నిరంతర వరద నీటి ప్రవాహం ఉండనుందని, ఆ మేరకు విద్యుదు త్పత్తి జరిగే అవకాశాలున్నాయి. ఇక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను 3 కి.మీ. దూరంలో ఉన్న అంగడిపేట సబ్‌స్టేషన్‌ ద్వారా సరఫరా చేయనుంది. రూ.4,504 కోట్ల అంచనా వ్యయంలో రూ.3,639 కోట్లు జలాశయం నిర్మా ణానికి ఖర్చు చేయనుండగా, మిగిలిన రూ.866 కోట్లతో జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మిస్తారని తెలంగాణ జెన్‌కో అధికార వర్గాలు తెలిపాయి. ఒక యూనిట్‌ విద్యుదుత్పత్తికి రూ.5 నుంచి రూ.6 వరకు వ్యయం కానుందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. 

రుణం+రాష్ట్ర ప్రభుత్వ వాటా: దుమ్ముగూడెం జలాశయాన్ని నీటిపారుదల శాఖ, జలవిద్యుదుత్పత్తి కేంద్రాన్ని జెన్‌కో ఆధ్వ ర్యంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరిపై సముద్ర మట్టానికి 63 మీటర్ల ఎత్తులో 6 కి.మీ. పొడవు, 6 కి.మీ. వెడల్పుతో తొలుత జలాశయాన్ని నీటిపారుదల శాఖ నిర్మించ నుంది. జలాశయానికి 70 రేడియల్‌ గేట్లను ఏర్పాటు చేయనుం ది. అనంతరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను జెన్‌కో చేప ట్టనుంది. జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా కొంత భాగాన్ని కేటాయిస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చినట్లు జెన్‌కో అధికారవర్గాలు తెలిపాయి. మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో జెన్‌కో సమీకరించనుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top