కడుపు నొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య | a woman committed suicide in khammam district | Sakshi
Sakshi News home page

కడుపు నొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య

Aug 16 2015 2:07 PM | Updated on Sep 3 2017 7:33 AM

కడుపు నొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.

పాలేరు(ఖమ్మం): కడుపు నొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాలేరు మండలం ఆరెంపుల గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన గుదిమల్ల రామనర్సమ్మ(54) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో బాధపడుతోంది. దీంతో ఈ రోజు గ్రామ శివారులోని మామిడితోటలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement