నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలంపాడు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో సోమవారం రాత్రి రెండు భారీ అగ్ని ప్రమాదాలు సంభవించాయి. భవానీపేట్ గ్రామంలో ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు ఎగిసిపడి రెండు గడ్డివాములు కాలిపోయాయి. సమీపంలోని పూరిల్లుతోపాటు కట్టేసి ఉన్న మూడు గేదెలు మంటల్లో కాలిపోయాయి. రూ.6 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. సాలంపాడ్ గ్రామంలో జరిగిన మరో ప్రమాదంలో పది వరకు గడ్డివాములు కాలిపోయాయి.