ఇంట్లో గుట్టలు గుట్టలుగా పాములు

సాక్షి, కామారెడ్డి : ఒకటి, రెండు కాదు.. ఏకంగా 63 పాములు ఓ ఇంట్లో కనిపించడంతో కలకలం రేగింది. భిక్కనూరు మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి భూమయ్య శుక్రవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూస్తున్నాడు. అయితే, గోడకున్న రంధ్రం నుంచి ఓ పాము బయటకు రాగా, కుటుంబ సభ్యులు గమనించారు. దీంతో భూమయ్య చుట్టుపక్కల వారిని పిలిచి గోడను తవ్వగా, గుట్టలుగా పాములు కనిపించాయి. మొత్తం 63 పెద్ద పాములను చంపడంతో పాటు వందకు పైగా గుడ్లు కనిపించడంతో వాటిని ధ్వంసం చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి