బాబోయ్‌ ఎన్ని పాములో..! | 33 Snakes Found in House Medak | Sakshi
Sakshi News home page

బాబోయ్‌ ఎన్ని పాములో..!

May 2 2020 10:13 AM | Updated on May 3 2020 2:20 PM

33 Snakes Found in House Medak - Sakshi

కౌడిపల్లిలో బయటపడిన పాము, పాము పిల్లలు

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండల కేంద్రంలోని ఓ ఇంట్లో 33 పాములు, 20గుడ్లను స్థానికులు గుర్తించి వాటిని చంపేశారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. కౌడిపల్లి కొత్తకాలనీకి చెందిన ఇట్టబోయిన మల్లమ్మ ఇంట్లో ఓ గదిలో వీర్‌సింగ్‌ కుటంబం అద్దెకు ఉంటున్నారు. కాగా రెండు రోజులు క్రితం గోడ సందులోంచి చిన్న పాము పిల్ల బయటకు రావడంతో గుర్తించి దాన్ని చంపేశారు. మరుసటి రోజు సైతం మరో పాము పిల్ల బయటకు రావడంతో దాన్ని సైతం చంపేశారు. రోజు ఒక్కోటిగా బయటకు వస్తుండటంతో గోడ సందులో పరిశీలించి గోడను తవ్వారు. దీంతో అక్కడ పెద్దపాముతోపాటు మరో 33 పాము పిల్లలు, 20 గుడ్లు గుర్తించి వాటిని చంపేశారు. ఇంట్లో పిల్లలతోపాటు పెద్దలు ఉంటున్నారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement