యాసిడ్‌ పడి ముగ్గురు కార్మికులకు గాయాలు | 3 Workers injured in Nizam deccan Sugar limited | Sakshi
Sakshi News home page

యాసిడ్‌ పడి ముగ్గురు కార్మికులకు గాయాలు

Aug 27 2015 2:58 PM | Updated on Aug 17 2018 2:10 PM

నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం దక్కన్ షుగర్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదవశాత్తూ యాసిడ్ పడి ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి.

బోధన్ (నిజామాబాద్) : నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం దక్కన్ షుగర్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదవశాత్తూ యాసిడ్ పడి ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. పరిశ్రమలోని ఎస్‌ఎస్‌ఎల్ విభాగంలో పని చేస్తున్న కార్మికులపై గురువారం ప్రమాదవశాత్తూ యాసిడ్ పడటంతో.. లింగారెడ్డి(45), అహ్మద్(46), శివయ్య(38)లకు తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన తోటి కార్మికులు వారిని వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారిలో లింగారెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement