గ్రానైట్ క్వారీలో పేలుడు | 3 injured in granite quarry blast | Sakshi
Sakshi News home page

గ్రానైట్ క్వారీలో పేలుడు

Nov 12 2015 10:03 AM | Updated on Apr 3 2019 3:52 PM

వరంగల్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి గ్రానైట్ క్వారీలో పేలుళ్లు సంభవించాయి.

వరంగల్: వరంగల్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి గ్రానైట్ క్వారీలో పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానికి ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement