స్కూల్ బస్సు బోల్తా...28 మందికి గాయాలు | 28 students injured in bus accident | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు బోల్తా...28 మందికి గాయాలు

Apr 3 2015 2:17 AM | Updated on Sep 2 2017 11:45 PM

స్కూల్ బస్సు బోల్తా...28 మందికి గాయాలు

స్కూల్ బస్సు బోల్తా...28 మందికి గాయాలు

కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామ సమీపంలో గురువారం ఉదయం సెయింట్ ఆన్స్‌కు చెందిన స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది.

పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామ సమీపంలో గురువారం ఉదయం  సెయింట్ ఆన్స్‌కు చెందిన స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 28 మంది విద్యార్థులు గాయపడ్డారు. మండలంలోని మూలసాల, కొత్తపల్లి గ్రామాల నుంచి విద్యార్థులను ఎక్కించుకొని బోజన్నపేట చేరుకునే సమయంలో మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవార్త తెలుసుకున్న వెంటనే పెద్దపల్లి సీఐ ప్రశాంత్‌రెడ్డి, ఎస్సైలు జగన్‌మోహన్, రవికుమార్ బోజన్నపేటకు చేరుకొని విద్యార్థులను స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలించారు. తలకు గాయూలైన 5 గురు విద్యార్థులను కరీంనగర్‌కు తరలించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకొని విద్యార్థుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  ఘటనాస్థలికి కేవలం 10 అడుగుల దూరంలోనే 11 కేవీ కరెంటు స్తంభం ఉండటంతో ఒకవేళ బస్సు స్తంభానికి ఢీకొని ఉండుంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని తల్లిదండ్రులు ఆందోళన చెందారు

Advertisement
 
Advertisement
Advertisement