అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ సరుకులు స్వాధీనం | 2500 kgs Ration rice seized | Sakshi
Sakshi News home page

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ సరుకులు స్వాధీనం

Jun 26 2015 2:59 PM | Updated on Sep 4 2018 5:16 PM

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ సరుకులు స్వాధీనం - Sakshi

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ సరుకులు స్వాధీనం

హైదరాబాద్ మైలార్‌దేవ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

హైదరాబాద్ : హైదరాబాద్ మైలార్‌దేవ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బాబుల్ రెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న విజయ్ కుమార్ అనే వ్యక్తి దుకాణంలో తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఉచితంగా సరఫరా చేసే రేషన్ సరుకులను కనుగొన్నారు. దుకాణంలో నిల్వ ఉంచిన 80 కేజీల చక్కెర, 400 కేజీల గోధుమ, 2500 కేజీల బియ్యం, 90 లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రేషన్ షాపు యాజమానిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement