తెలంగాణకు అదనంగా 200 మెడికల్ సీట్లు | 200 additional medical seats alloted to telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు అదనంగా 200 మెడికల్ సీట్లు

Jul 12 2014 4:40 PM | Updated on Oct 9 2018 7:52 PM

తెలంగాణకు అదనంగా 200 మెడికల్ సీట్లు - Sakshi

తెలంగాణకు అదనంగా 200 మెడికల్ సీట్లు

తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 200 మెడికల్ సీట్లను ఎంసీఐ కేటాయించిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు.

తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 200 మెడికల్ సీట్లను ఎంసీఐ కేటాయించిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు 600 నుంచి 800కి పెరిగాయని చెప్పారు. ఈ ఏడాది ఎంబీబీఎస్ ఫీజులు పెరిగేది లేదని స్పష్టం చేశారు.

ఆరోగ్యశ్రీని ప్రక్షాళన చేసి సమర్ధవంగా అమలుచేస్తామని, ఈ పథకం పరిధిలోకి మరిన్ని వైద్యసేవలను చేరుస్తామని రాజయ్య అన్నారు. ప్రభుత్వాస్పత్రులలో ఆరోగ్యశ్రీ చికిత్సలు ఎక్కువగా అందిస్తామని, ప్రతి జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement