ట్రాక్టర్ పై నుంచి పడి ఇద్దరి మృతి | 2 killed in road accident at khammam district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ పై నుంచి పడి ఇద్దరి మృతి

May 25 2016 4:41 PM | Updated on Aug 30 2018 4:07 PM

ట్రాక్టర్ పై నుంచి పడి ఇద్దరు కూలీలు మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.

సత్తుపల్లి: ట్రాక్టర్ పై నుంచి పడి ఇద్దరు కూలీలు మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కూలీలు ట్రాక్టర్‌పై పొలాలకు ఎరువు తరలిస్తున్న సమయంలో చెరువు కట్ట వద్దకు చేరుకోగానే ట్రక్ పై ఉన్న నలుగురు కూలీలు జారి కిందపడ్డారు. అది గమనించని డ్రైవర్ అలాగే ముందుకు పోనివ్వడంతో.. వెంకటేశ్వర్రావు(45), సత్యావతి(40) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement