మంగపేట మండలం బ్రాహ్మణపల్లి, రాజుపేట గ్రామాల మధ్యలో మూలమలుపు వద్ద డీసీఎం వాహనం, బైక్‌ను ఢీకొట్టింది.
మంగపేట (వరంగల్ జిల్లా) : మంగపేట మండలం బ్రాహ్మణపల్లి, రాజుపేట గ్రామాల మధ్యలో మూలమలుపు వద్ద డీసీఎం వాహనం, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రమణక్కపేట గ్రామానికి చెందిన వెంకన్న(29), బాలు(27) అనే ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి.
బాలుకు చెయ్యి విరగగా, వెంకన్నకు తల పగిలింది. చికిత్స నిమిత్తం వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా వెంకన్న పరిస్థితి విషమంగా ఉంది. స్వగ్రామం నుంచి మణుగూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.