లారీకి విద్యుదాఘాతం: 11 మందికి గాయాలు | 11 injured due to electrocution | Sakshi
Sakshi News home page

లారీకి విద్యుదాఘాతం: 11 మందికి గాయాలు

Sep 19 2015 2:45 PM | Updated on Sep 3 2017 9:38 AM

ఓ లారీకి విద్యుత్ తీగలు తాకడంతో అందులో ప్రయాణిస్తున్న 11 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

బొమ్మనహల్ : ఓ లారీకి విద్యుత్ తీగలు తాకడంతో అందులో ప్రయాణిస్తున్న 11 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాలచర్ల గ్రామం నుంచి శనివారం 11 మంది కూలీలతో ఓ లారీ బొమ్మనహల్ మండలం ఉద్దేహల్‌కు వెళుతోంది. కూలీలు అందరూ లారీపైన కూర్చున్నారు.

అయితే గమ్యస్థానానికి కొద్ది దూరంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ తీగలు లారీపై కూర్చున్న ఓ కూలీని తాకాయి. దాంతో పక్కపక్కనే కూర్చున్న కూలీలందరూ గాయపడ్డారు. వీరిలో గోవింద్, రత్నమ్మ, ముత్యాలమ్మలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని కర్ణాటకలోని బళ్లారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారికి బొమ్మనహల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement