రంగారెడ్డి జిల్లాలో 1092 చెరువుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్టు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు.
శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లాలో 1092 చెరువుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్టు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. ఆదివారం శంకర్‌పల్లి మండలం జనవాడ, మోక్లతండా, కొండకల్ గ్రామాల్లోని చెరువుల్లో పూడికతీత పనులను మంత్రి ప్రారంభించారు.
అలాగే గండిపేట నుంచి శంకర్‌పల్లి వరకు... రామంతాపూర్ నుంచి దేవరంపల్లి వరకు రోడ్డు విస్తరణ పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు.