103 మంది బాల కార్మికులకు విముక్తి | 103 child labours got relief in karimnagar district | Sakshi
Sakshi News home page

103 మంది బాల కార్మికులకు విముక్తి

Jan 29 2016 9:27 PM | Updated on Sep 19 2018 8:32 PM

సుల్తానాబాద్ మండల పరిధిలో 103 మంది బాల కార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు.

సుల్తానాబాద్(కరీంనగర్ జిల్లా): సుల్తానాబాద్ మండల పరిధిలో 103 మంది బాల కార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. ఒడిషాకి చెందిన వీరంతా సుల్తానాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇటుకల బట్టీల్లో పనిచేస్తున్నారు. బాలలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. బాలలను దగ్గర్లోని సంక్షేమ కార్యాలయానికి తరలించనున్నట్లు ఐసీడీఎస్ అధికారిణి పర్వీన్ సుల్తానా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement