ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ దిష్టిబొమ్మ దహనం.. | ‘MLA Srinivas Goud talking shame to Engineering students’ | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ దిష్టిబొమ్మ దహనం..

Nov 16 2017 7:57 PM | Updated on Nov 16 2017 7:57 PM

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌  ఇంజనీరింగ్‌ విద్యార్థులను అవనించేలా అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం ఆయన దిష్టిబొమ్మను ప్రధాన ద్వారం వద్ద దహనం చేశారు. ఏబీవీపీ, జేఎన్‌టీయూఎచ్‌ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలను నిరసిస్తూ ర్యాలీని నిర్వహించారు . ఈ సందర్భంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర కార్యదర్శి జవ్వాజి దిలీప్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ వద్ద మెప్పు పొందడం కోసం ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారన్నారు.

ఫీజు రియింబర్స్‌మెంట్‌ రాక ఏ ఒక్క విద్యార్థికి ఇబ్బంది కలగలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతేకాక ఇంజనీరింగ్‌ విద్యార్థులు పెట్రోల్‌ బంకుల్లో పనిచేస్తున్నారని, అనవసరంగా కొందరు విద్యార్థులు రాద్ధాంతం చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement