breaking news
-
కబ్జాకోర్లు కావాలా.. ప్రశ్నించే గొంతుక కావాలా?
సాక్షి, కరీంనగర్: ‘‘కరీంనగర్ ప్రమాదంలో పడింది. భూకబ్జాదారులు, చీటర్లు, అవినీతి కేసులున్న వారు కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్షాన పోటీచేస్తున్నారు. నేను ధర్మం కోసం, ప్రజా సమస్యలపై పోరాడుతున్నాను. ఎటువైపు ఉంటారో ప్రజలు తేల్చుకోవాలి’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ ప్రజలను కోరారు. ఆదివారం ఆయన కరీంనగర్లో వేర్వేరుగా నిర్వహించిన బ్రాహ్మణ, రెడ్డి, ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొని మాట్లాడారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థికి కరీంనగర్ నియోజకవర్గం గురించి ఏమీ తెలియదని, తెలిసిందల్లా భూకబ్జాలు చేయడమేనని ఆరోపించారు. ఆయనపై 27 కేసులున్నయని, అవన్నీ కబ్జాలు, ఫోర్జరీ కేసులేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్పైనా అవినీతి, అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయని చెప్పారు. వారు ఎప్పుడూ ప్రజల కోసం కొట్లాడలేదన్నారు. అదే తనపై 74 కేసులు ఉన్నాయని.. అవన్నీ పేదలు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం కొట్లాడితే సీఎం కేసీఆర్ పెట్టించినవని పేర్కొన్నారు. భారీగా నిధులు తీసుకొచ్చా.. ఎంపీగా కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి దా దాపు రూ.9 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చా నని బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్–జగిత్యా ల, కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి నిర్మా ణానికి, స్మార్ట్ సిటీకి నిధులు తెచ్చానని పేర్కొన్నా రు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు వ్యాపారులను బెదిరించి వసూళ్లు చేయడం తప్ప మరేమీ చేయలేదని ఆరోపించారు. వారు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని, మోసపోకుండా తనకు ఓటేసి ప్రశ్నించే గొంతుకను కాపాడుకోవాలని ప్రజలను కోరారు. -
కాంగ్రెస్‌కు ఒక్క చాన్స్ ఇవ్వండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/పటాన్ చెరు/గచ్చిబౌలి (హైదరాబాద్): తాను ఓడిపోతే రెస్ట్ తీసుకుంటామని చెబుతున్న సీఎం కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కే పరిమితం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఓటమి తప్పదని తెలిసే కేసీఆర్ ఇలా అంటున్నారని చెప్పారు. తదాస్తు దేవతలు ఉన్నారని, వారంలోనే ఆయన మాట నెరవేరనుందన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు సీఎంగా కేసీఆర్‌కు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వండి. ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తాం’అని చెప్పారు. ఇవి సెమీఫైనల్ ఎన్నికలని, రాష్ట్రంలో ప్రజలందరి సహకారంతో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దీంతో 2024లో ఢిల్లీ ఎర్రకోటలో తిరంగా జెండా ఎగుర వేయడానికి మార్గం సుగమవుతుందని, మోదీని ఇంటికి పంపిస్తామన్నారు. రేవంత్ ఆదివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, పటాన్చెరు, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ప్రచార సభల్లో మాట్లాడారు. ‘ఈ బకాసురుడికి రూ. లక్ష కోట్లు దోచినా చాలట్లేదు. ధరణి పేరుతో రాష్ట్రంలో పదివేల ఎకరాలు మింగాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఎక్కడ దాక్కున్నా తోకబట్టి ఈడ్చుకొచ్చి రూ.లక్ష కోట్లను కక్కిస్తాం. సీఎం కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లోనే డబుల్ బెడ్రూం నిర్మిస్తాం.. దోపిడీలో భాగమైన కొడుకు, బిడ్డ, అల్లుడికీ చోటు కల్పిస్తాం’అని వ్యాఖ్యానించారు. పాలమూరు బిడ్డ సంతకంతోనే.. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నా కేసీఆర్ ఏనాడూ పాలమూరును పట్టించుకోలేదని రేవంత్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పూర్తిచేసే బాధ్యత కాంగ్రెస్‌దని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో పాలమూరు బిడ్డను గెలిపించుకోకుంటే మళ్లీ గుంపు మేస్త్రీలు సంతల్లో పశువుల్లా వలస తీసుకెళ్లే పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్‌లో శషబిషలు, గ్రూపులు, గుంపులు లేవన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై ఎవరైనా చేయిచేసుకుంటే వారి గుడ్లు పీకి గోళీలు ఆడతానని హెచ్చరించారు. రాష్ట్రంలోని 119 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎంతోమంది పెద్దవాళ్లు, ఉద్దండులున్నా పాలమూరు బిడ్డ సంతకంతోనే పోటీలో నిలుస్తున్నారని, ఇది పాలమూరు గడ్డ గొప్పతనమని చెప్పారు. పాలమూరు బిడ్డలు నాటిన మొక్కను నరికేందుకు ఢిల్లీ నుంచి మోదీ, గల్లీ నుంచి కేడీ, కేటీఆర్, హరీశ్ గొడ్డళ్లు పట్టుకుని వస్తున్నారని, పాలమూరు బిడ్డలు చైతన్యంతో ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు. మూడోసారి మనవడికి ఇస్తారా? కేసీఆర్ మూడోసారి గెలిపించాలని కోరుతున్నారని, ఇప్పటికే తాను సీఎం అయి, కొడుకు, అల్లుడిని మంత్రులను చేశారని, సంతోష్‌రావును ఎంపీగా చేశారని, నిజామాబాద్‌లో నేలకేసికొడితే బిడ్డను మళ్లీ ఎమ్మెల్సీని చేశారని, ఈసారి గెలిస్తే మనవడిని మంత్రి చేస్తారని రేవంత్ వ్యాఖ్యానించారు. లక్కీ నెంబర్ ఆరు లాగా మనవడు మంత్రి అయ్యాడంటే అందరికీ పదవులొచ్చినట్లవుతుందని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ 17 పరీక్షలను నిర్వహించి పల్లీలను అమ్మినట్లు పరీక్ష పేపర్లను అమ్మి మోసం చేసిందని, నిరుద్యోగులంతా కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని చెప్పారు. కార్యక్రమాల్లో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), పరి్ణకారెడ్డి (నారాయణపేట), జి.మధుసూదన్‌రెడ్డి (దేవరకద్ర), జగదీశ్వర్‌గౌడ్ (శేరిలింగంపల్లి), కాట శ్రీనివాస్ గౌడ్ (పటాన్చెరు) పాల్గొన్నారు. -
జనవరిలో గల్ఫ్ పాలసీ తెస్తాం
సిరిసిల్ల/నర్సాపూర్: తెలంగాణలో గల్ఫ్ కార్మీకుల కోసం ప్రత్యేక గల్ఫ్ పాలసీని తెస్తామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. గల్ఫ్ కార్మికులకు రైతుబంధు తరహాలో రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్ కార్మీకులు చనిపోతే, వారి కుటుంబాలకు రూ.5 లక్షలిస్తామన్నారు. జనవరిలో సమగ్ర గల్ఫ్ పాలసీ తెచ్చి వలస కార్మీకుల సంక్షేమానికి బాటలు వేస్తామని చెప్పారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మీకులుంటే ఏ రాష్ట్రంలోనూ పెన్షన్ ఇవ్వడం లేదని, తెలంగాణలోనే ఇస్తున్నామని చెప్పారు. బీడీ కార్మీకుల పీఎఫ్ కటాఫ్ తేదీని మార్చి మరో లక్ష మందికైనా పెన్షన్ ఇస్తామన్నారు. జనవరి, ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, వాటిపై 93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఆదివారం కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆదివారం నిర్వహించిన రోడ్ షోలు, సభల్లో మాట్లాడారు. ‘ఇవి మామూలు ఎన్నికలు కావు. మార్చిలో ఫెయిలైతే సెప్టెంబరులో రాసే పరీక్షల్లాంటివి కాదు. ఐదేళ్లు మీ తలరాతను రాసే ఎన్నికలు. ఆగం కావద్దు.. సంక్షేమం.. అభివృద్ధి కొనసాగాలంటే.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగాలి’అని కేటీఆర్ చెప్పారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని, ధరణి తీసేసి భూమాత తెస్తామని భట్టి విక్రమార్క అంటున్నారని, మళ్లీ దళారీ వ్యవస్థను తేవాలని చూస్తున్నారని కేటీఆర్ చెప్పారు. వ్యవసాయానికి మూడే గంటల కరెంట్ చాలని రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, పొరపాటున కాంగ్రెస్ వస్తే.. మళ్లీ పవర్ హాలిడేలు.. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడాలు ఉంటాయన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కరెంటు కనిపిస్త లేదంటున్నాడని, ఎక్కడైనా కరెంటు కనిపిస్తదా అని ఎద్దేవా చేశారు. ఒక్కసారి కరెంటు లైన్‌ను పట్టుకుంటే కరెంటు ఉందో లేదో తెలుస్తుందని, షాక్ కొట్టి పోతే రాష్ట్రానికి దరిద్రం పోతుందన్నారు. రైతులకు రూ.14 వేల కోట్ల రుణమాఫీ అయిందని, ఇంకా కొంత పెండింగ్‌లో ఉందని అది కూడా పూర్తవుతుందని చెప్పారు. రైతుబంధు ఒకటి, రెండురోజుల్లో జమ అవుతుందని వివరించారు. మోదీ 15 లక్షలు వేశారా? ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీ నాయకులు డ్రామాలు వేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 2014లో తమ ప్రభుత్వం రాగానే అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని మోదీ చెప్పారని, ఎవరి ఖాతాల్లోనైనా పైసలు పడ్డాయా అని ప్రజలను ప్రశ్నించారు. అలాగే, గ్యాస్ ధర తగ్గిస్తామని చెప్పి, రూ.400 ఉన్న సిలిండర్ ధరను రూ.1,200కు పెంచారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే రూ.400కే సిలిండర్ ఇచ్చి మిగిలిన రూ.800 తమ ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఒక్కసారి చాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారని 50 ఏళ్లలో 11 సార్లు చాన్స్ ఇస్తే ఏం చేశారని నిలదీశారు. రేవంత్‌రెడ్డి టికెట్లు అమ్ముకున్నారని, బీసీ బిడ్డ గాలి అనిల్‌కుమార్ గొంతు కోసి టికెట్ అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమాల్లో నర్సాపూర్ పార్టీ అభ్యర్థి సునీతారెడ్డి, ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేదరికం లేని తెలంగాణే నా పంతం
నాకు తెలంగాణ తీసుకువచ్చిన ఘనతే ఆకాశమంత పెద్దది. దానికి మించిన పదవి ఉందా? రెండుసార్లు సీఎంగా పనిచేసిన. పదేళ్లు సీఎంగా ఉన్నా. ఇక్కడ నా కంటే ఎక్కువకాలం పదవిలో ఉన్న సీఎం ఉన్నడా? 70 ఏళ్లొచ్చాయి. ఇంతకంటే జీవితంలో ఇంకేం కావాలి? పేదరికంలేని తెలంగాణే నా పంతం. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, సిద్దిపేట/ఖానాపూర్: పేదరికం లేని తెలంగాణ తన పంతమని.. కేరళ తరహాలో వందశాతం అక్షరాస్యత, నిరంతరం తాగునీరు, ప్రతీ ఇంచుకు సాగునీరు రావాలనేదే తన లక్ష్యమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. రైతాంగం గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోయే తెలంగాణ కావాలని.. దానికోసమే తాను తండ్లాడుతున్నానని, పదవి కోసం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే దళారీ రాజ్యం వస్తుందని, తెలంగాణ ఆగమైపోతుందని వ్యాఖ్యానించారు. ఆదివారం జగిత్యాల, వేములవాడ, దుబ్బాక, ఖానాపూర్ నియోజకవర్గాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఎన్నికలనగానే ఆగమాగం కావొద్దు. అభ్యర్థులు, పార్టిల చరిత్ర చూసి ఓటేయాలి. అసలు ఉన్న తెలంగాణను ఊడగొట్టి, ఆంధ్రాల కలిపిందే కాంగ్రెస్ పార్టీ. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో ఏడుగురు తెలంగాణ యువకులను కాల్చిచంపారు. తర్వాత 58 ఏళ్లు గోస పడ్డాం. రాష్ట్రం వచ్చా క సంక్షేమానికి పెద్దపీట వేసుకున్నాం. రూ.200 పింఛన్లను రూ.2,000 చేసుకున్నం. మళ్లీ గెలిస్తే దాన్ని రూ.5 వేలు చేసుకుందాం. రైతుబంధు సాయాన్ని రూ.16వేలు చేసుకుందాం. నీటి తీరువా రద్దు చేసి, 24 గంటల కరెంటు ఇస్తున్నాం. కల్యాణలక్ష్మి, అమ్మ ఒడి, ఉచిత ప్రసవాలు, కేసీఆర్ కిట్, రైతుబీమా, పల్లె–బస్తీ దవాఖానాలు, వంద పడకల ఆస్పత్రు లు, మెడికల్ కాలేజీలు ఇలా ఎన్నో చేసుకున్నం. ఇవన్నీ కాంగ్రెస్ వారు ఎందుకు చేయలేకపోయారు ? ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారు. ఎమర్జె న్సీలు, యువతను జైల్లో పెట్టడమేనా ఇందిరమ్మ రాజ్యమంటే? ఆమె పాలనలోనే కదా జగిత్యాల, సిరిసిల్లను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది. కాంగ్రెస్ నేతల అసమర్థత వల్లే.. గులాబీ పార్టీ సామర్థ్యాన్ని శంకించిన నాటి మంత్రి ఎమ్మెస్సార్ ముఖం మీద రాజీనామా విసిరికొట్టా ను. అప్పుడు 2.5 లక్షల మెజార్టితో కరీంనగర్ ప్రజ లు గెలిపించారు. కాంగ్రెస్ నాయకుల అసమర్థత వల్లే తెలంగాణ చాలా ఏళ్లు దుఃఖపడింది. నాడు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపా యి ఇవ్వనన్నప్పుడు ఒక్కరూ నోరు తెరవలేదు. కాంగ్రెస్ వాళ్లది.. భూమేత! అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు, రైతు బీమా, ఎమ్మెస్పీ ధరలకు వరి ధాన్యం కొనుగోలుకు మూలం ధరణి. దాని స్థానంలో కాంగ్రెస్ వాళ్లు తెచ్చేది భూమాత కాదు.. భూమేత. మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. కాంగ్రెస్ వాళ్లు కౌలుదారు చట్టం చేస్తరట. అలా చేస్తే రైతులు చిప్పపట్టుకుని తిరగాలి. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు వృథా అంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు చాలంటున్నారు. కాంగ్రెస్ అంటేనే రైతుల పాలిట శని. ప్రజలు ఆలోచించి ఓటేయాలి. అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం బీఆర్ఎస్ సర్కారు అసైన్డ్ భూములను లాక్కుంటోందని బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవం. మేం మళ్లీ అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి 100 ఉత్తరాలు రాసినా ఇవ్వలేదు. అలాంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దు. వేస్తే మోరీలో పడేసినట్టే. తండాలను పంచాయతీలు చేశాం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే తండాలను పంచాయతీలుగా చేసి గిరిజనుల కల సాకారం చేశాం. గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీకగా బంజారాహిల్స్‌లో బంజారా భవన్‌తోపాటు పక్కనే కుమురంభీం భవన్ నిర్మించాం. పోడు పట్టాలిచ్చాం, వాటికి రైతుబంధు, రైతుబీమా కూడా వర్తింపజేస్తున్నాం. కాంగ్రెస్‌వన్నీ వట్టి మాటలే. బీఆర్ఎస్ భయంకరమైన మెజార్టితో గెలుస్తోంది..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జగిత్యాలలో డాక్టర్ సంజయ్‌కుమార్, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావు, ఖానాపూర్‌లో జాన్సన్ నాయక్‌ను గెలిపించాలని కోరారు. వేములవాడ ముఖచిత్రం మారుస్తా.. వేములవాడతో నాది ప్రత్యేక అనుబంధం. ఇక్కడి రాజన్న గుడిలోనే నా వివాహం జరిగింది. కోర్టు కేసుల కారణంగా ఎమ్మెల్యే రమేశ్‌బాబును మార్చాల్సి వచ్చింది. వేములవాడ ముఖచిత్రం మార్చే బాధ్యత నాది. ఇక్కడి మూలవాగు, తల్లికోట సూరమ్మ ప్రాజెక్టులను అభివృద్ధి చేసుకుందాం. మల్కపేట రిజర్వాయర్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. జగిత్యాల జిల్లాను కరీంనగర్ తరహాలో అభివృద్ధి చేసుకుందాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంజూరు చేసుకుందాం. -
రిస్క్ వద్దు !
సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. తెలంగాణను ఎన్నో రెట్లు అభివృద్ధి చేసుకున్నాం. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ నీళ్లిచ్చాం. 24 గంటల కరెంటు ఇచ్చాం. 69 లక్షల మంది రైతులకు రైతుబంధు, 47లక్షల మందికి ఆసరా పింఛన్లు, 1.10 లక్షల మందికి రైతుబీమా, 13.50 లక్షల మందికి కల్యాణలక్ష్మి లబ్ధి చేకూర్చాం. వెయ్యి రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకొచ్చాం. అక్షరాస్యత 15 నుంచి 20 శాతం పెరిగింది. ఇవన్నీ కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ సీఎంగా ఉండాల్సిన అనివార్యత ఉంది. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు విని రిస్క్ తీసుకోవద్దని చెబుతున్నాం’ అని బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వివరించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సాక్షిటీవీ లైవ్‌షోలో ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే... కర్ణాటక వైఫల్యాల ప్రచారం ఆత్మరక్షణకు కాదు కర్ణాటక ఇచ్చే ప్రకటనలన్నీ అబద్ధం. యువశక్తి అని యాడ్ ఇచ్చారు. అక్కడ ఉద్యోగాలు ఇచ్చారా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. బస్సులు కూడా లేకుండా చేశారు. 10 కిలోల ఉచితబియ్యం అని 5 కిలోలు ఇస్తున్నారు. కర్ణాటకలో జరుగుతున్న విషయాలను చెపుతున్నాం. కర్ణాటక మోడల్ అంటే 3 గంటల కరెంటు, రైతుబంధు తొలగింపు, నోటిఫికేషన్లు ఇవ్వకపోవడమా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కర్ణాటక ప్రకటనలు ఇవ్వటం ఎందుకు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కావొద్దు బీఆర్ఎస్ ప్రజల పార్టీ. బీజేపీ కార్పొరేట్ పార్టీ. ఇక కాంగ్రెస్ దొంగ హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తుంది. ఐదు గ్యారంటీల పేరుతో కర్ణాటకలో జనాన్ని మోసం చేసింది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా అక్కడ ఎన్నికల హామీలు అమలు చేయటం లేదు. ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నోటిఫికేషన్లు లేవు. కర్ణాటకలో 5 గ్యారంటీలు ఏమోగానీ ఉన్న గ్యారంటీలు పోయాయి. గతంలో బీజేపీ ప్రభుత్వం అక్కడ అమలు చేసిన రైతుబంధు, యువశక్తి, 9 గంటల కరెంటును తొలగించింది. విద్యార్థులకు స్కాలర్íÙప్లో 80 శాతం కోత విధించింది. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వటం లేదు. కానీ ఇక్కడ కేసీఆర్ 24 గంటల కరెంట్, రైతుబంధుతో వ్యవసాయం పండగ చేశారు. రేవంత్‌రెడ్డి 3 గంటల కరెంట్, కర్ణాటక డిప్యూటీ సీఎం 5 గంటల కరెంట్ చాలు అంటున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే 3 గంటల కరెంట్, 5 గంటల కరెంట్ ఒప్పుకున్నట్టే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ రద్దు అవుతాయి. ప్రజలు ఆలోచించాలి. కరెంటు, నీళ్లు వచ్చినోళ్లంత కారుకు ఓటేయాలి 24 గంటల కరెంట్, మిషన్ భగీరథతో ఇంటింటికీ నీరు గురించి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. పూర్తిస్థాయిలో కరెంట్, ఇంటింటికీ నీళ్లు వచ్చినోళ్లంతా కారుకు ఓటేయండి... రాని వారు కాంగ్రెస్‌కు ఓటేయండి. సాఫీగా తెలంగాణపాలన సాగుతోంది. అనేకరంగాల్లో మార్గదర్శకంగా తెలంగాణను దేశంలో నంబర్ 1 స్థానంలో ఉంచారు. కేసీఆర్‌కు వాగు వంక, చెట్టు పుట్ట అన్ని తెలుసు. ప్రతిపక్ష నాయకులకు ఏది తెలియదు. కేసీఆర్ ఫోకస్ రైతులే ఎక్కడా లేనివిధంగా రైతుబంధును రాష్ట్రంలో అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దానిని పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో అమలు చేస్తోంది. అధికారంలోకి వస్తే రైతుబంధు కింద కాంగ్రెస్ పార్టీ రూ.15 వేలు ఇస్తామని చెప్తోంది. కానీ మేము రూ.16 వేలు ఇస్తామని చెప్తున్నాం. గతంలో కరెంట్ కష్టాలు ఉండేవి. ఇప్పుడు 24 గంటల కరెంటు వస్తుంది. కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా అని అందుకే అంటున్నాం. కేసీఆర్ రైతుబిడ్డ. ఆయన ఫోకస్ అంతా రైతులే. వాస్తవాలు చెబుతున్నాం కాంగ్రెస్ ప్రకటనలకో, ప్రచారానికో మేం భయపడడం లేదు. 6 గ్యారంటీల పేరుతో జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమవుతుందో విడమర్చి చెబుతున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 12 మంది ముఖ్యమంత్రులు కావడం ఖాయం. ప్రజల్లో అపనమ్మకం సృష్టించే ప్రయత్నం ధరణితోపాటు ప్రభుత్వ పథకాలన్నీ భేష్ అని ప్రజలే చెబుతున్నారు. మా బలం ఏందో ప్రతిపక్షాలకు తెలుసు. మా బలం మీద విమర్శ చేస్తేనే, దు్రష్పచారం చేస్తేనే జనం నమ్ముతారు అని వారి ఆలోచన. ప్రజల్లో అపనమ్మకం సృష్టించి జనాన్ని ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇంకా ఆయన ఏమన్నారంటే... ♦ బీఆర్ఎస్ సభలకు ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు. కానీ రాహుల్, ప్రియాంక సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం ఇస్తున్నారు. ♦ కాంగ్రెస్‌నేతలు కుటుంబపాలన అనడం విడ్డూరం. ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్‌గాంధీ వీరంతా ఎవరు? మేము ప్రజాక్షేత్రం నుంచి వచ్చిన వాళ్లం. మాది కుటుంబ పార్టీ ఎలా అవుతుంది. ♦ ఉస్మానియా యూనివర్సిటీ వెళ్లడానికి భయపడేది మేము కాదు రేవంత్‌రెడ్డి భయపడుతున్నారు. విద్యార్థులను బీర్లు, బిర్యానీ ఇస్తే ఏమైనా చేస్తారు అని అన్నాడు. ♦ పేపర్ లీకేజీలు ఇతర రాష్ట్రాల్లో జరగటం లేదా? జరిగిన తప్పును మేమే గుర్తించి సీఐడీ విచారణకు ఇచ్చాం. అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం ♦ మేము ఎవరికి బీ టీమ్ కాదు. కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్కు భయపడుతూ ఒకరిపైఒకరు చెప్పుకుంటూ మా మీద ఆరోపణ చేస్తున్నాయి. ♦ బీఆర్ఎస్ వీక్ అని వచ్చినవన్నీ ఫేక్ సర్వేలు.. పేపర్ల మీద సర్వేలు చేస్తే ఎలా? ♦ కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకతనే కాదు. పాజిటివ్ కూడా ఉండొచ్చు కదా. సంక్షేమ పథకాల లబ్ధి ఎమ్మెల్యేల ద్వారానే వెళ్తుంది కదా. 80 సీట్లతో మేమే అధికారంలోకి వస్తాం ♦ కేటీఆర్‌ను సీఎంను చేయాలని పార్టీ అనుకుంటే చేస్తుంది. మాకు కేసీఆరే సీఎం కావాలని అనుకుంటున్నాం. -
‘ప్రజల తెలంగాణ’ కల నిజం చేస్తాం
సాక్షి, కామారెడ్డి/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ప్రజల తెలంగాణ కల సాకారం కాబోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోంది. తొలి మంత్రిమండలి సమావేశంలోనే ఆరు గ్యారంటీలను చట్టబద్ధం చేసి అమలు చేస్తాం’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో సంపదను అంతా ఒకే కుటుంబం అనుభవిస్తోందని, రీడిజైన్ పేరుతో ఒక్క ప్రాజెక్టుతోనే రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ మధ్య తాను మేడిగడ్డకు వెళ్లి చూడగా పునాదులు పగిలిపోయి, డ్యాం లోపలికి కుంగిపోయి కనిపించిందన్నారు. కాళేశ్వరం కట్టింది నీళ్ల కోసం కాదని, దోచుకోవడం కోసమేనన్నారు. ధరణి పోర్టల్ ద్వారా లక్షలాది మంది రైతుల భూములను తమవారికి ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం కామారెడ్డి, సంగారెడ్డి, ఆందోల్‌లో నిర్వహించిన సభల్లో రాహుల్ ప్రసంగించారు. ఆదాయం వచ్చే ల్యాండ్, లిక్కర్, ఇరిగేషన్, ఇసుక లాంటి శాఖలన్నీ తమ చేతుల్లో పెట్టుకుని, ఇష్టారీతిన దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 8 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, దీనికి ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ప్రధాని మోదీకి లోక్‌సభలో అవసరం ఉన్నప్పుడల్లా అండగా నిలవడం వల్లే కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ లాంటి కేసులు నమోదు కాలేదని చెప్పారు. ఒకవేళ కేసీఆర్ మద్దతు ఇవ్వకపోయి ఉంటే సీఎం కురీ్చకీ ఎసరొచ్చేదని రాహుల్ దుయ్యబట్టారు. తొలి సమావేశంలోనే... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ప్రతినెలా బ్యాంకు ఖాతాలో రూ. 2,500 జమ చేస్తామని, బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా నెలకు రూ.5 వేల మేరకు ప్రయోజనం కల్పిస్తామని, గ్యాస్ సిలిండర్‌ను రూ.ఐదు వందలకు ఇస్తామని, రైతులకు రైతుభరోసా ద్వారా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని, అలాగే రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందిస్తామని తెలిపారు. రైతులకు 24 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తామని, ఇళ్లు లేనివారందరికీ రూ.5 లక్షలు ఇచ్చి సొంతింటి కల నిజం చేస్తామని చెప్పారు. తెలంగాణ కోసం ప్రాణాలొదిలిన అమరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల కోసం ఎంతో మంది రూ.లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్నారని, తాను వాళ్ల దగ్గరకు వెళ్లి మాట్లాడానని రాహుల్ చెప్పారు. విద్యాభరోసా కార్డులను ఇచ్చి, వారి ఉన్నత చదువులు, కోచింగ్ కోసం రూ.5 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు ఇంటికి చేరేలోపు పరీక్ష పత్రాలు లీకైనట్టు తెలిసి గుండెలు బాదుకోవలసిన పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. అవినీతి సొమ్ము ప్రజల ఖాతాల్లోకి.. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్, ఆయన కుటుంబం దోచుకున్న అవినీతి సొమ్మునంతా కక్కిస్తామని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. కక్కించిన ఈ సొమ్మును నిరుపేదల ఖాతాల్లో వేస్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటేనన్నారు. బీజేపీతో కాంగ్రెస్ పోరాడిన ప్రతి ఎన్నికల్లో ఎంఐఎం తమ అభ్యర్థులను బరిలోకి దించి బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు నష్టం చేసేలా అస్సాం, గోవా, రాజస్తాన్ ఎన్నికలో ఎంఐఎం వ్యవహరించిందని గుర్తుచేశారు. బీజేపీతో పోరాడుతున్నందుకు తనపై 24 కేసులు నమోదు చేశారని, తన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి, తన నివాసాన్ని కూడా లాక్కున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్న మోదీ సర్కానూ వదిలిపెట్టేది లేదన్నారు. విద్వేషాల బజార్లో ప్రేమ అనే దుకాణం తెరిచిన కాంగ్రెస్‌కు మద్దతు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, నిజామాబాద్ అర్బన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి అభ్యర్థులు షబ్బీర్‌అలీ, ఏనుగు రవీందర్‌రెడ్డి, కె.మదన్మోహన్ పాల్గొన్నారు. కామారెడ్డి ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది ‘ప్రజల రక్తానికి మరిగిన పులిని వేటాడేందుకు వేటగాన్ని రంగంలోకి దింపుతారు. అట్లనే తెలంగాణ సంపదను దోచుకుంటున్న కేసీఆర్‌ను రాజకీయంగా బొందపెట్టేందుకే నన్ను ఇక్కడికి పంపారు. కామారెడ్డి ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. దేశం మొత్తం మీవైపే చూస్తోంది’ అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. నలభై ఏళ్లుగా ఎన్నో పదవులు అనుభవించినప్పుడు గుర్తుకురాని అమ్మ, అమ్మమ్మ ఊరు కేసీఆర్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మీకుల కష్టాలను కేసీఆర్ ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇక్కడి భూముల మీద కన్నేసి కామారెడ్డికి వచ్చారని, కేసీఆర్‌ను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని రేవంత్‌రెడ్డి ప్రజలను కోరారు. -
ఆధిపత్యం ఎవరిది!?
వెనుకబడిన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో స్థానిక అంశాలే ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. ఆదివాసీలు, సింగరేణి కార్మికులు, రైతులు, కూలీలతో పాటు యువతరం ఈసారి అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంట నిలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాగా వేసేందుకు కాంగ్రెస్ శక్తివంచన లేని కృషి పట్టు సాధించేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. పది నియోజకవర్గాలున్న ఉమ్మడిజిల్లాలో ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ ఎస్టీలకు రిజర్వు కాగా, బెల్లంపల్లి, చెన్నూరు ఎస్సీల రిజర్వ్డ్ స్థానాలు. తొమ్మిదిన్నరేళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, పేదలకు అందించిన సంక్షేమ పథకాలు, సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కల్పన వంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా ఉమ్మడి జిల్లాకు జరిగిన అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో అభ్యర్థులు ముందున్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వల్ల ముంపునకు గురవుతున్న భూముల సమస్యపై కాంగ్రెస్, బీజేపీ ఫోకస్ చేస్తున్నాయి. బీఎస్పీ తరపున పోటీ చేస్తున్న ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రధాన పక్షాలకు సవాల్ విసురుతున్నారు. అధికార బీఆర్ఎస్కు ఉమ్మడి జిల్లాలో తూర్పు ప్రాంతమైన మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌లలో కాంగ్రెస్ బలమైన ప్రత్యర్థిగా ఉండగా, పశ్చిమాన ఆదిలాబాద్, బోథ్, ముథోల్, నిర్మల్‌లలో బీజేపీ గట్టి పోటీనిస్తోంది. ఖానాపూర్, సిర్పూర్‌లలో వివిధ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఆదిలా‘బాద్షా’ ఎవరో? బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ సీనియర్ ఎమ్మెల్యే జోగు రామన్న మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో జోగు రామన్నకు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ మరోసారి బరిలో నిలిచి సవాల్ విసురుతున్నారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్‌రెడ్డి బరిలోకి దిగారు. ఆదిలాబాద్‌లో నెలకొన్న సామాజిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి కూడా బీఆర్ఎస్, బీజేపీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఆదిలాబాద్‌లో జరిగిన అభివృద్ధి, పేదలకు అందిన సంక్షేమ పథకాలు, మైనారిటీ ఓటు బ్యాంకుతో మళ్లీ విజయం వరిస్తుందనే ఆశాభావంతో జోగు రామన్న ఉన్నారు. ప్రభుత్వంతో పాటు జోగు రామన్న పట్ల సహజంగా ఉండే అసంతృప్తి, పెరిగిన బీజేపీ బలం తనకు కలిసి వస్తుందని పాయల్ శంకర్ భావిస్తున్నారు. ప్రభుత్వంపై అసంతృప్తి నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి సైతం విజయంపై ధీమాతో ఉన్నారు. బోథ్: ఆదివాసీలే కీలకం గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలై, బీజేపీలో చేరి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచిన సోయం బాపూరావు మరోసారి బోథ్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2018లో కాంగ్రెస్ టికెట్ రాక ఇండిపెండెంట్‌గా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచిన అనిల్ జాదవ్ ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆదివాసీల ప్రభావం అధికంగా ఉండే ఈ నియోజకవర్గం నుంచి ఆ వర్గం అభ్యర్థిగా ప్రధాన పార్టీల నుంచి సోయం బాపూరావు మాత్రమే బరిలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి ఆడె గజేందర్ ఇద్దరూ లంబాడీ వర్గానికి చెందిన వారే. బీఎస్పీ నుంచి మరో ఆదివాసి మెస్రం జంగుబాపు బరిలో ఉన్నప్పటికీ, ఆదివాసీల ప్రతినిధిగా సోయం బాపూరావునే ఆ వర్గీయులు భావిస్తుండడం ఆయనకు కలిసివచ్చే అంశం. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు సైతం బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుకు మద్దతిస్తుండటం గమనార్హం. ఆసిఫాబాద్: కలిసి రానున్న‘ఆదివాసీ’ ఓటు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు బీఆర్ఎస్లో చేరినప్పటికీ, ఈసారి ఆయనకు మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన కోవా లక్ష్మినే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో ఆమె తన భర్త మాజీ ఆర్టీఏ అధికారి శ్యాం నాయక్‌తో పాటు కాంగ్రెస్ లో చేరారు. దీంతో శ్యాంనాయక్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతో, అప్పటివరకు కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారు బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ అభ్యర్థిగా ఆత్మారాంనాయక్ బరిలో నిలిచినప్పటికీ, ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే నెలకొంది. పోటీ పడుతున్న ముగ్గురు అభ్యర్థుల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి ఒక్కరే ఆదివాసీ కావడం, ఆదివాసీ ఓట్లు ఏకంగా 70 వేల ఓట్లు ఉండడం ఆమెకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఖానాపూర్: అభ్యర్థి మారినా ‘రాత’ మారుతుందా? సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ అభ్యర్థిత్వాన్ని కాదని కేటీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న జాన్సన్‌నాయక్‌కు బీఆ ర్ఎస్ ఇక్కడ సీటిచ్చింది. బీజేపీ నుంచి మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ పోటీ పడుతుండగా, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఆది వాసీ ఉద్యమ నాయకుడు వెడ్మ బొజ్జును బరిలో నిలిపింది. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఈ ముగ్గురి మధ్యనే త్రిముఖ పోటీ నెలకొంది. అయితే బీఆర్ఎస్, బీజేపీ తరపున పోటీ పడుతున్న అభ్యర్థులు ఇద్దరు లంబాడీ వర్గానికి చెందిన వారు కావడం, కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జుకు కలిసి వచ్చే అంశం. ఆదివాసీ ఓట్లతో పాటు లంబాడీ వర్గం ఓట్లు భారీగానే ఉన్నప్పటికీ, లంబాడీ ఓట్ల చీలిక కాంగ్రెస్‌కు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌ను మార్చడం బీఆర్ఎస్కు కలిసివచ్చే అంశంగా భావిస్తున్నప్పటికీ, జాన్సన్‌నాయక్‌ను లంబాడీలు ఆదరించడంపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. సిర్పూరు: ‘ఏనుగు’ మళ్లీ ఎగురుతుందా? 2004లో కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోనేరు కోనప్ప 2014లో బీఎస్పీ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరారు. ఆయనే 2018లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలవగా, ఆయనకు చెక్ పెట్టేందుకు ఈసారి మూడు పార్టీలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్ ‘ఏనుగు’ గుర్తుపై పోటీలో నిలిచి రాష్ట్ర స్థాయిలో అందరినీ ఆకర్షిస్తున్నారు. గతంలో కోనప్ప గెలిచిన బీఎస్పీ తరపునే పోటీ చేసి ఆయనను ఓడించాలనే ధ్యేయంతో అటవీ, మైదాన ప్రాంతాల్లో కలియతిరుగుతున్నారు. సిర్పూరులో ఎస్సీ, బుద్ధిస్ట్ ఓట్లు భారీగా ఉండడం, మైనారిటీలతో పాటు గిరిజన వర్గాల ఓట్లు కూడా చీలి తనకు కలిసి వస్తుందని ప్రవీణ్‌కుమార్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కోనప్పపై కాంగ్రెస్ తరపున పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన పాల్వాయి హరీశ్‌బాబు ఈసారి బీజేపీ పక్షాన పోరాడుతున్నారు. కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్ బరిలో నిలిచారు. ప్రధాన పోటీ బీఆర్ఎస్, బీఎస్పీ, బీజేపీ మధ్యనే నెలకొంది. నిర్మల్: కారు, కమలం మధ్యన పోటీ.. సీనియర్ నేత, మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్‌లో ఈసారి రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరి ఆపార్టీ అభ్యర్థిగా పోటీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు కూచాడి శ్రీహరిరావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో స్థానాన్ని బీజేపీ గెలుచుకున్న ప్రభావం, భైంసా, నిర్మల్‌లలో జరిగిన మతఘర్షణల నేపథ్యంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇక్కడ బీజేపీ బలం పెరిగిందని అంటున్నారు. కాగా మైనారిటీ ఓట్లు, మున్నూరు కాపు ఓట్లతో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపై అల్లోల్ల ఇంద్ర కరణ్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ముథోల్: ఇక్కడా బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే.. రాష్ట్రంలో సున్నిత ప్రాంతంగా పేరున్న భైంసా ప్రధాన కేంద్రంగా ఉన్న ముథోల్ నియోజకవర్గంలో అధికార పార్టీకి బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గెడ్డన్నగారి విఠల్‌రెడ్డికి బీజేపీ అభ్యర్థి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పవార్ రామారావు పటేల్ గట్టి పోటీ ఇస్తున్నారు. గ్రామీ ణ ఓటర్లతో పాటు ముస్లిం మైనారిటీ ఓట్లతో విజయం తనదేనని సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ధీమాతో ఉన్నారు. భైంసాలోని ముస్లిం మైనారిటీల ఓట్లతో బీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా, భైంసాలో నెలకొన్న పరిస్థితుల వల్లనే హిందూ ఓట్లన్నీ ఈసారి గంపగుత్తగా బీజేపీకే పడతాయని ఆపార్టీ భావిస్తుంది. గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశం కనిపించడం లేదు. మంచిర్యాల: బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నడిపెల్లి దివాకర్‌రావు ఐదో విజయం కోసం బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో 4,877 ఓట్ల తేడాతో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఈసారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరోసారి తనను గట్టెక్కిస్తాయనే నమ్మకంతో దివాకర్‌రావు ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు పార్టీ అభ్యర్థిపై ప్రజల్లో నెల కొన్న అసంతృప్తి తనను ఈసారి విజయ తీరాలకు చేరుస్తుందని ప్రేంసాగర్‌రావు ఆశాభావంతో ఉన్నారు. గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ మరోసారి బరిలో నిలవగా, ఆయనకు వచ్చే ఓట్లు ఎవరికి నష్టం చేకూరుస్తుందనేది ప్రశ్నార్థకం. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురిది వెలమ సామాజికవర్గమే. బెల్లంపల్లి: గెలుపుపై రెండు పార్టీల్లోనూ ధీమా.. సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్ల నెలకొన్న వ్యతిరేకత, బీఆర్ఎస్ మండల స్థాయి నాయకుల వ్యవహారశైలి... కాంగ్రెస్ అభ్యర్థి, గత ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిన మాజీ మంత్రి గడ్డం వినోద్‌పై ఉన్న సానుభూతి బెల్లంపల్లిలో కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశం. అయితే ప్రభుత్వ పథకాల లబి్ధదారులు, బీఆర్ఎస్ శ్రేణులు తనను గట్టెక్కిస్తారనే ధీమాతో చిన్నయ్య ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి బరిలో ఉన్నప్పటికీ పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే నెలకొంది. చెన్నూరు: నువ్వా నేనా..? బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విజయం నల్లేరు మీద నడక అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ గడ్డం వివేకానంద రావడం రాజకీయ పరిస్థితులను ఒక్కసారిగా మార్చేసింది. చెన్నూరులో రూ. వందల కోట్లతో చేసిన అభివృద్ధి, సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలను చూసి ఓటేయాలని సుమన్ కోరుతున్నారు. వివేక్ రాకతో బీఆర్ఎస్కు చెందిన పలువురు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు సుమన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం. వివేక్ చెన్నూరులో విజయం కోసం కోట్లు వెచ్చిస్తున్నారని, నాయకులను కొంటున్నారని ఎమ్మెల్యే సుమన్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఈడీ రైడ్స్ చెన్నూరులో రాజకీయాలను మరింత రక్తి కట్టిస్తున్నాయి. దీంతో ఈ నియోజకవర్గంలో ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీనెలకొంది. విజయం కోసం ఇద్దరూ శ్రమిస్తున్నారు. కేసీఆర్ వల్లనే సింగరేణి వారసత్వ ఉద్యోగం.. సింగరేణిలో ఇక రావు అనుకున్న డిపెండెంట్ ఉద్యోగాలను కేసీఆర్ ఇప్పించారు. టీడీపీ హయాంలో రద్దయిన ఈ ఉద్యోగాలను ఏ ప్రభుత్వం మళ్లీ ఇవ్వదనుకున్నాం. నేను ఎంఏ, బీఈడీ చదివాను. వారసత్వ ఉద్యోగాల్లో అల్లుళ్లకు కూడా ఉద్యోగాలివ్వడంతో మా మామ ఉద్యోగం నాకు వచ్చింది. సింగరేణి పరంగా బీఆర్ఎస్ హయాంలో కార్మికులకు అనేక హక్కులతో పాటు సదుపాయాలు కూడా వచ్చాయి. గతంలో క్వార్టర్లలో ఉంటే బేసిక్ జీతంపై ఒక శాతం విద్యుత్‌చార్జీలు వసూలు చేసేవారు. ఇప్పుడు దాన్ని తీసేశారు. ఏసీ కూడా పెట్టుకుంటున్నాం. మా తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం కూడా అందిస్తున్నారు. – దుర్గం రవికుమార్, జనరల్ మజ్దూర్, ఆర్కే 5 గని వీధి వ్యాపారిగా మారిన.. రెక్కల కష్టం తప్ప మాకు ఏ ఆధారం లేదు. నా భర్త నృత్య కళాకారుడు. వందలాదిమంది కళాకారులను తయారు చేశారు. ఆయనకు కళాకారుల ఉద్యోగం ఈ సర్కారులో రాలేదు. బీసీబంధు పథకం మాకు ఇయ్యలేదు. పేదలకుమేలు చేస్తున్నామని సర్కారు చెప్పుకునుడే తప్ప అమల్లో లేదు. ఏ ఒక్క ప్రభుత్వ పథకం మంజూ రు కాని మేము అనేక కష్టనష్టాలు పడుతున్నాం. చివరికి వీధి వ్యాపారిగా మారాల్సి వచ్చింది. – హనుమాన్ల సువర్ణ, చిరు వీధి వ్యాపారి, బెల్లంపల్లి కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో అపార నష్టం.. నాకు మూడున్నర ఎకరాల సాగు భూమి ఉంది. పత్తి సాగు చేశాను. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో గత నాలుగేళ్లుగా పంట మునిగిపోతోంది. తీవ్రంగా నష్టపోయిన. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పరిహారం రాలేదు. మాకోసం ఆలోచించే వారినే మేం గెలిపించుకుంటాం. –సుంకరి మల్లయ్య, రైతు, కోటపల్లి (చెన్నూరు) డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదుబీఆర్ఎస్ పార్టీ ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఏవేవో పథకాలన్నారు. ఎన్ని పథకాలు పెట్టినా పేదలకు మాత్రం ఎలాంటి ఫాయిదా లేదు. నాకు ఇల్లు లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న. ఎంతో ఆశతో ఎదురు చూసినా మంజూరు చేయలేదు. పదేళ్లు బీఆర్ఎస్ను చూసాం. పేదోళ్లకు ఏం మేలు జరగలేదు. ఈసారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చి చూస్తాం. – సయ్యద్ ఖాజాపాషా, పంక్చర్ కొట్టు నిర్వాహకుడు, బెల్లంపల్లి - ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి పోలంపల్లి ఆంజనేయులు -
కాంగ్రెస్‌తో కష్టాలు తెచ్చుకోవద్దు
మణికొండ/దుబ్బాకటౌన్: రాష్ట్రంలో కంటికి కనిపించే అభివృద్ధి, ఇంట్లోకి వస్తున్న సంక్షేమ పథకాలను కాదని, ఏరికోరి కాంగ్రెస్ పాలన తెచ్చుకుని కష్టాల పాలు కావద్దని మంత్రి హరీశ్‌రావు అన్నా రు. ఆదివారం మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఏ కోశానాలేదని, ఒకవేళ వస్తే విద్యుత్ కోత లు, బిల్డర్ల వద్ద కర్ణాటకలో మాదిరిగా చదరపు అడుగుకు రూ.80లు వసూలు, స్కాములు, కర్ఫ్యూ లు తప్పవని అన్నారు. రైతులకు రైతుబంధు, బీ మా, బీసీబంధు, దళితబంధు, ఇంటింటికి తాగునీ రు, 24గంటల విద్యుత్, శాంతి భద్రతలు, ప్రభుత్వ ఆసుపత్రులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, న్యూ ట్రిషన్ కిట్లు ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మా ర్చాల్సిన అవసరం ఎందుకని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రతి మíßహిళకు గృహలక్ష్మి, రూ.400లకే గ్యాస్ సిలిండర్, ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్యబీమా, మరో లక్ష డబుల్బెడ్రూం గృహాలను ఇస్తామని హామీ ఇచ్చారు. మరో మూడు రోజులు మాత్రమే ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కనిపిస్తారని, ఎన్నికలు ముగియగానే వారంతా ఢిల్లీ బాట పడతారని, ఇక్కడ ఉండేది ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు మాత్రమేనని గుర్తుంచుకోవాలన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు మాత్రమే గెలిచిందని, అక్కడి ప్రజలు ఆ పార్టీని నమ్మలేదని, అలాంటిది రాహుల్, ప్రియాంకలు ఇక్కడకు వచ్చి గొప్పలు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. వారిని నమ్మి మోసపోవద్దని హరీశ్‌రావు కోరారు. వారికి దమ్ముంటే ఇప్పుడు బెంగళూరు ప్రజలతో సమావేశం పెట్టాలని సవాల్ విసిరారు. రాబోయే ఐదు సంవత్సరాలలో హైదరాబాద్ నగరం చుట్టూ నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మణికొండ, శంషాబాద్‌లకు వంద పడకల ఆసుపత్రులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, మన రాష్ట్రం, మన పాలనకే ప్రజలు పట్టం కట్టాలని.. ఢిల్లీ పార్టీలను తరమికొట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్ అన్నారు. రాష్ట్రంలో మరో మారు బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు ఓటు వేయాలని అన్నారు. కేంద్రం రూ.28 వేల కోట్లు ఎగ్గొట్టింది.. రైతుల బోరు బావుల వద్ద కరెంట్ మీటర్లు పెట్టక పోవడంవల్ల తెలంగాణకు రావాల్సిన రూ.28 వేల కోట్లను కేంద్రం ఎగ్గొట్టిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్న కాంగ్రెస్, రాష్ట్రంలో 11 సార్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని, పొరపాటున కాంగ్రెస్ వస్తే మళ్లీ చీకటి కష్టాలు వస్తాయని అన్నారు. -
కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ
సాక్షి, యాదాద్రి/నారాయణపేట/ములుగు: కాంగ్రెస్ అంటేనే అమ్ముడుపోయే పార్టీ అని, అది తెలంగాణలో బీఆర్ఎస్ను బీ టీమ్‌లా కాపాడుతోందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్టేనని, ఆ రెండింటికీ చెక్‌పెట్టి బీజేపీని గెలిపించాలని కోరారు. మూసీ నదిలా తెలంగాణ మొత్తాన్ని కేసీఆర్ అవినీతితో కలుషితం చేశారని.. ఈ అవినీతి కాలుష్యాన్ని శుద్ధి చేయాలంటే బీజేపీకి అధికారం అప్పగించాలని పేర్కొన్నారు. ఆదివారం మక్తల్, ములుగు, భువనగిరి నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభల్లో అమిత్‌షా మాట్లాడారు. నారాయణపేట సభలో కురుమూర్తిస్వామి, జోగుళాంబదేవి, సంగమేశ్వరస్వామికి.. ములుగు సభలో సమ్మక్క–సారలమ్మ, రామలింగేశ్వరస్వామికి నమస్కరిస్తున్నా అంటూ అమిత్ షా తన ప్రసంగాలను ప్రారంభించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఇవి తెలంగాణ భవిష్యత్ కోసం జరుగుతున్న ఎన్నికలు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలి. కేసీఆర్ సర్కారు గత పదేళ్లలో అవినీతిలో కూరుకుపోయింది. కుంభకోణాల మయంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో, మియాపూర్ భూముల్లో వేల కోట్లు దోచుకున్నారు. బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్ భూకబ్జాల కారును గ్యారేజీకి పంపిస్తాం. కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి జైలుకు పంపిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారు. అసలు కేసీఆర్ జాతీయ హోదా కోసం ఒక్కనాడు కూడా ప్రధాని మోదీని కలవలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డీల్.. కాంగ్రెస్‌కు వేసే ప్రతి ఓటు బీఆర్ఎస్కు వేసినట్లే. వారిలో ఎవరికి ఓటు వేసినా ఒక్కటే. కాంగ్రెస్ అమ్ముడు పోయే పార్టీ. అది బీఆర్ఎస్ను బీ టీంలా కాపాడుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో వారి మధ్య అధికారాన్ని పంచుకునే డీల్ కుదిరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలాగూ అధికారంలోకి రాదు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇక్కడ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారు. బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో కేంద్రంలో రాహుల్‌గాందీని ప్రధాన మంత్రిని చేయాలనేది ఒప్పందం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. ఎస్సీ వర్గీకరణ చేపడతాం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. కేసీఆర్ రజాకార్ల పార్టీ ఎంఐఎంకు భయపడి విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు. మేం అధికారంలోకి రాగానే సెపె్టంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తాం. బీఆర్ఎస్ ఇస్తున్న నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెంచుతాం. మేం అధికారంలోకి రాగానే గిరిజనేతరులకు సైతం ఆంక్షలు లేని పోడుపట్టాలు జారీ చేస్తాం. గిరిజన రైతులకు రూ.12 వేల చొప్పున అందజేస్తాం. అయోధ్యలో రాముడి దర్శనం చేయిస్తాం భవ్యమైన, దివ్యమైన అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతోంది. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరగనుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి ప్రజలకు ఉచితంగా అయోధ్య ప్రయాణం, వసతి, దర్శనం కల్పిస్తాం..’’అని అమిత్ షా ప్రకటించారు. 'డబుల్ ఇంజన్’తో రాష్ట్రం నంబర్‌వన్ రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుందాం. దేశాన్ని సురక్షితంగా అభివృద్ధిపథంలో నడిపిస్తున్న మోదీని 2024లో మరోసారి ప్రధాని చేసుకుందాం. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారుతో తెలంగాణను నంబర్‌వన్‌గా అభివృద్ధి చేసుకుందాం. బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి. -
ప్రజల కష్టాలు తీరుస్తాం: యోగి
ఆమనగల్లు, సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్, ఎల్బీనగర్/లింగోజిగూడ, కుత్బుల్లాపూర్: బీజేపీకి అధికారం ఇస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీనిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ప్రజల కష్టాలు తీరి తెలంగాణ సమగ్రాభివృద్ధి సా ధ్యమన్నారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో జరిగిన ప్రజాదీవెన సభ లో, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విజయసంకల్ప సభలో, కర్మన్‌ఘాట్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో, షాపూర్‌నగర్‌లో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ఎందరో త్యా గాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ కు టుంబం దోచుకుంటోందని ధ్వజమెత్తారు. ఇక్కడ కూడా గో మాఫియా, పశు మాఫియా ఉన్నాయనీ, ఆ మాఫియాలను హెచ్చరించేందుకు ఇక్కడికి వ చ్చానని వ్యాఖ్యానించారు. 2017 కంటే ముందు ఉత్తరప్రదేశ్‌లో మాఫియాలు ఉండేవనీ, ఇప్పుడు మోదీ నేతృత్వంలోని మార్గదర్శకంలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండడంతో అక్కడ ప్రశాంతంగా ఉందన్నారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు కామన్ ఫ్రెండ్ ఎంఐఎం. ఫెవికాల్ వలే ఎంఐఎం పనిచేస్తుంది. ఈ మూడు పార్టీలు ఒక్కటే. తెలంగాణ ప్రజల మనోభావాలు, జీవితాలతో ఇవి ఆటలాడుకుంటున్నాయి’’అని విమర్శించారు. హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మారుస్తాం బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే హైదరా బాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని యూపీ సీఎం యోగి ప్రకటించారు. అమరుల త్యా గాలతో వచ్చిన తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల తెలంగాణగా మార్చిందని, నిరుద్యోగులను రోడ్డుపాలు చేసిందని ఆరోపించారు. బీజేపీ అభ్యర్ధిని గెలిపిస్తే రామ మందిరం దర్శనం ఉచితం అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తవుతోంది.. బీజేపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించి వారితో పాటు మీరంతా 2024, జనవరి 26న జరిగే అయోధ్యలో రామ మందిరం ప్రారం¿ోత్సవానికి రండి.. ఉచిత దర్శనం వాళ్లే కల్పిస్తారు’’అంటూ యోగి ఆదిత్యనా«థ్ చెప్పుకొచ్చారు. -
‘డబుల్ ఇంజన్’తోనే అభివృద్ధి
నిర్మల్/మెదక్: తెలంగాణలో మొదటిసారిగా బీజేపీ సర్కార్ ఏర్పాటు కానుందని.. సకల జనులంతా బీజేపీ వెంటే ఉన్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలతో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడితే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కేవలం కుటుంబ పార్టీలు అని, బీజేపీ మాత్రం నిరంతరం పేద ప్రజల గురించే ఆలోచిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా పేదల ఆకలి తీర్చేందుకు మరో ఐదేళ్లు ఉచిత రేషన్ కొనసాగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో, మెదక్ జిల్లా తూప్రాన్‌లో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలలో ప్రధాని మోదీ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాధించుకున్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చారు. నీళ్లు ఇవ్వలేదు. నియామకాలను పేపర్ లీకులు, వాయిదాలతోనే సరిపెట్టారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే నియామకాలు జరిగాయి. సీఎం కేసీఆర్ తెలంగాణను లూటీ చేసి దేశ రాజకీయాల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో కట్టర్ ఫ్రాడ్‌తో చేతులు కలిపి లిక్కర్ స్కామ్ చేశారు. లిక్కర్ స్కామ్ చేసిన బీఆర్ఎస్, కట్టర్ ఫ్రాడ్ నాయకులను ఎవరినీ వదలబోం. ఇందులో కేసీ ఆర్ కుటుంబ సభ్యులపై విచారణ జరుగుతోంది. అవినీతి నాయకులు జైలుకు వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. ఇది మోదీ గ్యారంటీ. దిగజారుడు రాజకీయాలు సిగ్గుచేటు బీజేపీ ఫుడ్‌పార్క్, టెక్స్టైల్స్ పార్క్ వంటివి ఏర్పాటు చేస్తుంటే.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు మాత్రం బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి. మత ప్రాతిపదికన రాష్ట్రంలో ఐటీపార్కు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ పేర్కొనడం రాజ్యాంగానికే ప్రమాదకరం. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు సిగ్గుచేటు. పదేళ్లు సచివాలయానికి రాకుండా ఫాంహౌస్ నుంచే పాలన సాగించిన కేసీఆర్‌ను చిత్తుగా ఓడించి పర్మినెంట్‌గా ఫాంహౌస్‌కే పరిమితం చేయాలి. కేసీఆర్ మల్లన్నసాగర్ ప్రాజెక్టు బాధితులకు పరిహారం ఇవ్వకుండా నడిరోడ్డుపై వదిలేశారు. ఆ మల్లికార్జున స్వామి కూడా కేసీఆర్‌ను వదలడు. అసైన్డ్ భూములను లాక్కున్నారు తెలంగాణలో ధరణి పేరిట భూమాయ నడుస్తోంది. పేదల నుంచి అసైన్డ్ భూములను లాక్కున్నారు. మేం అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తాం. మీభూమి పేరిట కొత్త పోర్టల్ తీసుకువస్తాం. డ్రోన్ల సాయంతో పారదర్శకంగా భూముల లెక్కలు తేలుస్తాం. కేసీఆర్ తెలంగాణకు దళితుడిని తొలి సీఎం చేస్తామని మాటిచ్చి ద్రోహం చేశారు. మేం ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేస్తాం. మాదిగలకు సరైన న్యాయం చేస్తాం. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. ఢిల్లీలో సుల్తాన్లు.. తెలంగాణలో రజాకార్లు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. రెండూ కుటుంబ పాలన సాగిస్తున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ సుల్తాన్లను పెంచి పోషిస్తే.. తెలంగాణలో కేసీఆర్ రజాకార్లను పెంచి పోషిస్తున్నారు. ఆ రెండు పార్టీలూ ఒక్కటే. కాంగ్రెస్ బోఫోర్స్ మొదలు హెలికాప్టర్ల కొనుగోలు వరకు అవినీతిలో కూరుకుపోతే.. కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాల్లో 30శాతం కమీషన్లు లాగడమే. కాంగ్రెస్‌కు వేసే ప్రతి ఓటూ బీఆర్ఎస్కు వెళ్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లతోపాటు వాటి వెంట ఉన్న ఎంఐఎంను కూడా ఓడించాలి. అసమర్థ కాంగ్రెస్‌కు ప్రజలు చెక్‌పెట్టారు కేంద్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన కొనసాగించింది. ఉగ్రవాదుల దాడుల్లో ఎంతో మంది అమాయకులు బలయ్యారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి బీజేపీకి పట్టం కట్టారు. మేం సమర్థ పాలనతో దేశంలో శాంతి నెలకొల్పాం. ఉగ్రవాదులను మట్టి కరిపించాం. ఓటమి భయంతోనే రాహుల్‌గాంధీ యూపీలోని అమేథీ నుంచి కేరళకు పారిపోయారు. ఇక్కడ (గజ్వేల్) ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ కూడా ఈటల రాజేందర్ చేతిలో ఓటమి తప్పదనే భయంతోనే కామారెడ్డి నుంచి పోటీచేస్తున్నారు..’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నిజామాబాద్‌ను టర్మరిక్ సిటీ చేస్తాం బీజేపీ మేనిఫెస్టోలో రైతుల సంక్షేమం కోసం ఎన్నో అంశాలను చేర్చింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.2.75 లక్షల కోట్లు జమచేశాం. నిజామాబాద్, నిర్మల్ తదితర జిల్లాల పసుపు రైతుల కోసం జాతీయ పసుపు బోర్డును తీసుకువచ్చాం. నిజామాబాద్‌ను టర్మరిక్ సిటీ చేస్తాం. ఆర్మూర్ పసుపునకు జియోట్యాగింగ్ తీసుకువస్తాం. కోవిడ్ తర్వాత ప్రపంచానికి పసుపు విలువ తెలిసి వచ్చింది. రైతులు బాగా పండించి లాభాలు పొందాలి. బీజేపీ అధికారంలోకి రాగానే నిర్మల్ కొయ్యబొమ్మల పరిశ్రమను ఆదుకుంటాం. తెలంగాణలో త్వరలో మిల్క్ ప్రాసెసింగ్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్‌పై వ్యాట్ ఎత్తేశాం. అక్కడ ధరలు తక్కువగా ఉన్నాయి. తెలంగాణలోనూ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్ ఎత్తివేసి ధరలు తగ్గేలా చూస్తాం. తెలుగులో మాట్లాడుతూ.. ఉత్సాహపరుస్తూ.. బహిరంగ సభల్లో ప్రసంగించిన సమయంలో పలుమార్లు ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడారు. సభికులను ప్రశ్నలు అడుగుతూ, ఉత్సాహపరిచారు. పలుమార్లు ‘నా కుటుంబ సభ్యులరా..’ అని సంబోధించడం ఆకట్టుకుంది. ఇక తెలుగులో మాట్లాడుతూ.. ‘ప్రజలను కలవని, సచివాలయానికి వెళ్లని ఫామ్‌హౌస్ సీఎం అవసరమా? ఇలాంటి సీఎంను తీసేయాలా వద్దా?’.. ‘తెలంగాణలో మొదటిసారి బీజేపీ సర్కార్ ఏర్పాటు కానుంది’.. ‘పెట్రోల్ ధరలు తగ్గాలా.. వద్దా..?’ అని సభికులను ప్రశ్నించారు. ఇక మోదీ హిందీలో ప్రసంగించినప్పుడు దానిని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలుగులో అనువదించారు. ధ్యానంతోనే మానసిక ప్రశాంతత – యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: మోదీ నందిగామ: సమాజంలోని ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని.. ధ్యానంతో మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చని ప్రధాని మోదీ సూచించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా శాంతివనంలోని ధ్యాన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. శ్రీరామచంద్ర మిషన్ వ్యవస్థాపకుడు బాబూజీ మహరాజ్ 125వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన స్మారక ఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రధాని మోదీ అనురాధా నక్షత్రానికి సంబంధించిన ‘బాకుల’ అనే మొక్కను నాటారు. గురూజీ కమ్లేష్ పటేల్‌తో కలసి ధ్యానం చేశారు. అనంతరం మాట్లాడారు. ఒకే సమయంలో లక్ష మంది ధ్యానం చేయగలిగేలా అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. యోగా, ధ్యానం మనసుకు ఎంతో ఉల్లాసాన్ని, ప్రశాంతతని ఇస్తాయన్నారు. యువత చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మోదీ కోరారు. మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హాని చేయడమే కాకుండా బంగారు భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. -
ఈ రెండు రోజులూ కీలకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ అభ్యర్థులు పోటీచేస్తున్న 111 (జనసేన 8 సీట్లు కలిపితే 119) అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుత వాస్తవ పరిస్థితి, అభ్యర్థుల విజయావకాశాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా సమీక్షించారు. చివరి రెండు రోజుల ప్రచారం ఎంతో కీలకమని, ఉధృతంగా ప్రచారం నిర్వహించడంతో పాటు పోల్ మేనేజ్ మెంట్‌పై దృష్టి పెట్టాలని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. పోల్ మేనేజ్మెంట్ను పటిష్టంగా అమలు చేయాలని, ఎక్కడా లోటుపాట్లు లేకుండా అన్ని నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో పోలింగ్ బూత్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించేలా చూడాలని పార్టీ నాయకులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇందుకు రాష్ట్ర పార్టీకి జాతీయనాయకత్వం చేదోడువాదోడుగా నిలుస్తుందని నడ్డా భరోసానిచ్చినట్టు చెబుతున్నారు. ఆదివారం నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన నడ్డా, తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన విధుల్లో నిమగ్నమైన జాతీయనేతలు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్, సంస్థాగత సహ ఇన్చార్జి శివప్రకాష్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్‌తో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు పనిచేసింది ఒక ఎత్తు.. చివరి రోజుల్లో పార్టీకి ప్రజల్లో పెరిగిన మద్దతును ఓట్ల రూపంలో పోలింగ్‌బూత్‌ల దాకా తీసుకెళ్లి విజయం సాధించడం మరొక ఎత్తు అని పేర్కొన్నట్టు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షాలు నిర్వహించిన తర్వాత పరిస్థితిలో అనూహ్యంగా మార్పు వచ్చిందని, అభ్యర్థుల విజయావకాశాలు చాలా సీట్లలో మెరుగయ్యాయని వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. ఆ సీట్లపై పూర్తిస్థాయిలో ఫోకస్ 45–50 స్థానాల్లో అభ్యర్థులు గట్టి పోటీనిస్తున్నారని, వీటిలో అత్యధిక సీట్లను గెలుచుకోవడం ద్వారా తెలంగాణలో బీజేపీ సత్తా చాటాల్సి ఉంటుందని నడ్డా పేర్కొన్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్, కామారెడ్డిలలో పరిస్థితి ఏమిటి అని నడ్డా ప్రశ్నించినపుడు ఆ రెండుచోట్లా కేసీఆర్‌కు బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారని, గెలిచే అవకాశాలూ ఉన్నాయని ప్రకాష్జవదేకర్, సునీల్‌బన్సల్ వెలిబుచ్చినట్టు పార్టీవర్గాల సమాచారం. -
30న తెలంగాణ భవిష్యత్తు తేలిపోతుంది
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్)/నారాయణపేట: గత పదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ముషీరాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్‌కుమార్‌యాదవ్‌కు ఆశీస్సులు అందించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం బాగ్‌లింగంపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిద్ధరామయ్య మాట్లాడుతూ నవంబర్ 30న తెలంగాణ భవిష్యత్తు తేలిపోతుందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అన్ని కుల, మతాల ప్రజల సంక్షేమం కోసం పని చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్సే అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రమేయం లేదని, పార్లమెంటులో ఆయనకు ఎంపీలు లేకపోయినా సోనియా గాంధీ ధైర్యం చేసి రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని ధ్వజమెత్తారు. కేసీఆర్, మోదీలకు ఓడిపోతామనే భయం ప్రారంభమైందని, బీజేపీకి మూడు సీట్లు మించి రావని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మూడే రోజులు ‘బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర అభివృద్ధిని మరచి పక్కనున్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని సిద్ధరామయ్య అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరి తరపున ఏర్పాటు చేసి రోడ్‌షోలో సిద్ధరామయ్య మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇంకా మూడురోజులే గడువు ఉందన్నారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారని, కానీ అది మూణ్నాళ్ల ముచ్చటగా మారిందని విమర్శించారు. మా రాష్ట్రం వస్తే గ్యారంటీల అమలు చూపిస్తాం సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తున్నామని, ఈ విషయంలో ఎవరికైనా అనుమానాలుంటే తమ రాష్ట్రానికి వస్తే చూపిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఐదు గ్యారంటీల ను కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అమలు చేయడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ఈ పథకాల అమలు కోసం తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.38 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఆదివారం తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ రాష్ట్ర మంత్రులు బోసురాజు, లక్ష్మీ హెబ్బాల్కర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులతో కలసి మాట్లాడారు. ఐదు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామని, ఎన్నికల సందర్భంగా కర్ణాటక ప్రజలకిచ్చిన 165 హామీల్లో ఇప్పటివరకు 158 నెరవేర్చామని సిద్ధరామయ్య వెల్లడించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం గత పదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 10 శాతం కూడా నెరవేర్చలేదన్నారు. ఐదు గ్యారంటీల అమలు కారణంగా కర్ణాటక ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని ప్రధాని మోదీ చెపుతున్న మాటల్లో వాస్తవం లేదని సిద్ధరామయ్య అన్నారు. -
కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ఆ నేతలు బీఆర్ఎస్లో చేరతారు: అమిత్ షా
ములుగు: కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ ఆ నేతలు బీఆర్ఎస్లో చేరుతారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించాలంటే బీజేపీకి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోడు భూముల సమస్య పరిష్కరించలేక.. గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య బీఆర్ఎస్ వివాదం సృష్టిస్తోందని మండిపడ్డారు. గిరిజనులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. ములుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. గిరిజనులను మోసం చేయడం కాంగ్రెస్ లక్షణమని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ గిరిజన వ్యతిరేక పార్టీ అని చెప్పారు. తెలంగాణలో ప్రధాని మోదీ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అత్యధిక గిరిజన ఎంపీలు బీజేపీకి చెందినవారే ఉన్నారని స్పష్టం చేశారు. సమ్మక్క సారక్క పండుగలను జాతీయ పండుగగా చేయాలని ప్రకటించామని చెప్పారు. నవంబర్ 30న రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాని మోదీ కూడా ఇక్కడే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తూప్రాన్‌లో జరిగిన సభలో మాట్లాడారు. అటు.. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: ఏం మేలు జరిగిందని ఇందిరమ్మ రాజ్యం రావాలి?: కేసీఆర్ -
'ఏపీ పాలకులకంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలే ఎక్కువ ముంచారు'
జగిత్యాల: గతంలో ఏపీ పాలకులకంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలే ఎక్కువ ముంచారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఇందిరమ్మ కాలంలో జగిత్యాలను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారని గుర్తుచేశారు. ఇందిరమ్మ రాజ్యంలో లక్షల మందిని జైళ్లలో ఉంచారని మండిపడ్డారు. అలాంటి ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్లీ తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని చెప్పారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు తేడా ఏంటో ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు. జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. 'తెలంగాణ తెచ్చింది ఎవరు? 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవరు?. ఎవరి చేతిలో అధికారం ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందో ప్రజలు తెలుసుకోవాలి. ఎవరు నిజమైన సిపాయిలో ప్రజలు గుర్తించాలి. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని చీకటి రోజులే. ఏం మేలు జరిగిందని మళ్లీ ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. నీళ్ల పన్ను లేని రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే.' అని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు.. రైతు బంధు ఉండాలా? వద్దా..? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. రైతు బంధును రూ.16 వేలు చేస్తామని ప్రకటించారు. ధరణి స్థానంలో భూమాత తెస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.. కానీ అది భూమాత కాదు భూమేత అని ఎద్దేవా చేశారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమేనని చెప్పారు. కాంగ్రెస్ మాటలు నమ్మితే అంతా ఆగమాగమేనని పేర్కొన్నారు. ఒకే ఒక్క ఆయుధం ఓటు.. ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి రాలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వచ్చాయని ఆగమాగం కావొద్దని ప్రజలకు సూచించారు. గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని గమనించండి.. ఓటు వేసే ముందు ఆలోచించి వేయండని సూచించారు. ప్రజలకు ఒకే ఒక్క ఆయుధం ఓటు.. వేసే ఓటులో తేడా వస్తే ఐదేళ్లు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు. దుబ్బాకలో జరిగిన ఎన్నికల సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 'ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్లు చూపించేవారు వస్తారు.. వారి మాటలు నమ్మకండి. మీరు వేసే ఓటు ఐదేళ్ల తలరాతను మారుస్తుంది. ఆలోచించి ఓటు వేస్తే దేశం ముందుకు సాగుతుంది. ఓటు వేసే ముందు అభ్యర్థి వెనుక పార్టీ చరిత్రను గమనించండి. ఎన్నికలు వచ్చాయంటే అబద్ధాలు చెబుతుంటారు. ఎంతో పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. మళ్లీ ఆగమైతే రాష్ట్రం వెనక్కిపోతుంది. పదేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం.' అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదీ చదవండి: ఏం మేలు జరిగిందని ఇందిరమ్మ రాజ్యం రావాలి?: కేసీఆర్ -
కాంగ్రెస్‌ది సుల్తాన్ పరిపాలన.. బీఆర్ఎస్ది నిజాం పాలన: మోదీ
హైదరాబాద్: తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రధాని మోదీ అన్నారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయానికి వెళ్లని సీఎం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ఫామ్‌హౌజ్‌లో పడుకునే ముఖ్యమంత్రి మనకు అవసరమా? అని సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. ఈటలకు బయపడే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తూప్రాన్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. 26/11 దాడుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ప్రధాని మోదీ చెప్పారు. చేతకాని అసమర్థ నాయకులు దేశాన్ని పాలిస్తే ఇలానే ఉంటుందని మోదీ అన్నారు. కాంగ్రెస్, కేసీఆర్ ఒక్కటే ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రజలను కలవని సీఎం మనకు అవసమా? అంటూ తెలుగులో మాట్లాడిన మోదీ.. దుబ్బాక, హుజూరాబాద్‌లో ట్రైలర్ చూశారు.. ఇకపై సినిమా చూస్తారని అన్నారు. బీజేపీతోనే సకల జనుల సౌభాగ్య తెలంగాణ సాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ తెలంగాణ ప్రతిష్టను పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ నిర్ణయించింది. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. బీసీలకు బీజేపీతోనే ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. కుటుంబం గురించే కేసీఆర్ ఆలోచన అంతా.. పదేళ్లుగా బీఆర్ఎస్ తెలంగాణకు చేసిందేమీ లేదని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్‌ది సుల్తాన్ తరహా పాలన.. బీఆర్ఎస్ది నిజాం పరిపాలన అని దుయ్యబట్టారు. నమ్మకద్రోహం తప్పా.. బీఆర్ఎస్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ తొలిసారి అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు తెలంగాణ ప్రజల భవిష్యత్ గురించి చింత లేదని ప్రధాని మోదీ అన్నారు. తన కుటుంబం గురించే కేసీఆర్ ఆలోచన అంతా అని చెప్పారు. రాష్ట్రంలో కోట్ల రూపాయల ఇరిగేషన్ స్కాం జరిగిందని ఆరోపించారు. నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. నిర్మల్‌లో బొమ్మల పరిశ్రమను బీఆర్ఎస్ పట్టించుకోలేదని ప్రధాని మోదీ విమర్శించారు. నిజామాబాద్ పసుపు బోర్డు హామీని నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అంటే.. పేదలకు గ్యారెంటీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. కేంద్ర పథకాలను కేసీఆర్ అడ్డుకున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని అన్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ఆ నేతలు బీఆర్ఎస్లో చేరుతారు: అమిత్ షా -
కేసీఆర్‌జీ కాళేశ్వరంలో ఎంత దోచావు: రాహుల్ గాంధీ
సాక్షి, సంగారెడ్డి: ‘కేసీఆర్‌జీ నువ్వు కాళేశ్వరంలో ఎంత దోపిడీ చేశావో చెప్పు. మీరు తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల దోపిడీ చేశావని కాంగ్రెస్ ఆరోపిస్తోంది’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఢిల్లీలో మోదీకి బీఆర్ఎస్, తెలంగాణలో బీఆర్ఎస్కు మోదీ పరస్పర మద్దతుంది. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం. కాంగ్రెస్‌ను ఓడించడానికే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి. కాంగ్రెస్‌ను ఓడగొట్టేందుకే బలం లేకపోయినా ఎంఐఎం పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ దొరల ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి’ అని రాహుల్ మండిపడ్డారు. ‘కాంగ్రెస్ వచ్చాక ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. నేను ప్రజా సమస్యలపై పోరాడితే కేసులు పెట్టారు. కేసీఆర్ అవినీతికి పాల్పడితే మోదీ మద్దతిస్తున్నారు. కేసీఆర్ ఎంత అవినీత చేసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోంది. నా ఇల్లును లాగేసుకున్నా భారత దేశమే నా ఇల్లు అనుకున్నా. కేసీఆర్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు’ అని రాహుల్ విమర్శించారు. ఆంథోల్ సభలో మాట్లాడుతూ.. ‘దొరల సర్కార్‌కు ప్రజల సర్కార్‌కు మధ్య పోటీ జరుగుతోంది. కేసీఆర్ చదువుకున్న స్కూల్ కాంగ్రెస్ కట్టించిందే. ప్రపంచంలోనే ప్రసిద్ది గాంచిన హైదరాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ది చేసింది. కేసీఆర్.. మీ చేతిలోనే ధరణి ఉంది. పేదల నుంచి 20 లక్షల ఎకరాల భూమిని లాక్కున్నారు. నిన్న రాత్రి తెలంగాణ యువకులతో కలిసి మాట్లాడా. నిరుద్యోగులకు ఉద్యోగాలెందుకు రావడం లేదు. ప్రశ్నపత్రాలు ఎందుకు లీకవుతున్నాయి. కేసీఆర్ దోచుకున్న డబ్బులు ప్రజల బ్యాంక్ ఖాతాల్లోకి పంపిస్తాం. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం. చాతి ముందుకు పెట్టుకుని తిరిగే వారి, కారు టైర్లో గాలి తీసేది కాంగ్రెస్ పార్టీయే’ అని రాహుల్ తెలిపారు. ఇదీచదవండి..వారిని గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీలను పెట్టింది: మంత్రి కేటీఆర్ -
TS: సీనియర్లకు ఫ్రెషర్ల ఛాలెంజ్
ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర ఎంతో కీలకమైనది. యువత ముందుకొచ్చి ఓటు వేయడమే కాకుండా.. ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహారించాలన్న చర్చ ఎప్పటి నుంచో నడుస్తున్నదే. అయితే ఈసారి జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో పలుచోట్ల యువరక్తం.. పైగా కొత్త ముఖాలు.. అందునా సీనియర్లతో పోటాపోటీకి సిద్ధం కావడం గమనార్హం. కార్నె శిరీష(బర్రెలక్క) : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కార్నె శిరీష(బర్రెలక్క) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఈ దఫా ఎన్నికల్లో చిన్నవయస్కురాలైన అభ్యర్థిగా ఈమెకు ఓ గుర్తింపు దక్కింది. సోషల్ మీడియాలో బర్రెలక్కగా బాగా పాపులర్ అయిన శిరీష.. నామినేషన్ మొదలు నుంచి వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రచార సమయంలో ఆమె వర్గం దాడి జరిగాక.. ఆ చర్చ తారాస్థాయికి చేరింది. చివరాఖరికి హైకోర్టు సైతం ఆమెకు భద్రత కల్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీజేపీ సుధాకర్ లాంటి సీనియర్లను ఈమె ఢీ కొడుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: పవన్ కంటే బర్రెలక్క నూరుపాళ్లు నయం! మామిడాల యశస్వినీరెడ్డి: ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మరో అత్యంత యువ అభ్యర్థి యశస్విని కావడం విశేషం. కాంగ్రెస్ తరఫున పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి సీనియర్ మీద మామిడాల యశస్వినీ(26) పోటీకి దిగింది. యశస్వినీరెడ్డి హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసింది. ఆపై ఝాన్సీరెడ్డి కొడుకు రాజారామ్ మోహన్ రెడ్డిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. అత్త ఝాన్సీరెడ్డికి కాంగ్రెస్ టికెట్ విషయంలో పౌరసత్వ అభ్యంతరాలు తలెత్తడంతో.. కోడలు యశస్వినీకి ఆ అవకాశం దక్కింది. ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఈ యువ అభ్యర్థి కోసం ప్రచారం కూడా చేశారు. నాన్ లోకల్ అనే ప్రత్యర్థి ప్రచారాన్ని తిప్పి కొడుతూ.. పాలకుర్తిలో గెలుపుపై యశస్విని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదీ చదవండి: ఎర్రబెల్లికి చుక్కలు చూపిస్తున్న హనుమాండ్ల ఫ్యామిలీ మైనంపల్లి రోహిత్‌రావు: మైనంపల్లి హనుమంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్(27). మెదక్ జిల్లా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మెడిసిన్ పూర్తిచెసిన రోహిత్ తన తండ్రి.. ఆయన అనుచర గణం అండతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్’ పేరిట కరోనా టైంలో అందించిన సేవలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి లాంటి సీనియర్‌తో పోటీకి రోహిత్ సిద్ధం అయ్యారు. ఇదీ చదవండి: మెదక్‌లో మళ్లీ పాతయుద్ధమేనా? ఉషా దాసరి: ఐఐటీ గ్రాడ్యుయేట్ ఉషా దాసరి (27).. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థినిగా పోటీలో ఉన్నారు. కలెక్టర్ కావాలనే కలని సైతం పక్కన పెట్టి తల్లిదండ్రుల పేరు మీద ట్రస్ట్ నెలకొల్పి.. ఉచిత ట్యూషన్లతో స్థానికంగా మంచి పేరు సంపాదించుకున్నారీమె. దాసరి మనోహర్‌తో పాటు చింతకుంట విజయరమణారావులాంటి సీనియర్ల నడుమ పోటీకి నిలిచారు. ఇదీ చదవండి: ఐఐటీ స్టూడెంట్... పొలిటికల్ ఎంట్రీ వీళ్లేకాదు.. మిరియాల రామకృష్ణ(28) జనసేన అభ్యర్థిగా ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల.. పువ్వాడ అజయ్లాంటి వారితో పోటీ పడుతుండగా.. అలాగే ములుగు నుంచి సీతక్కకు పోటీగా బీఆర్ఎస్ అభ్యర్థిని బడే నాగజ్యోతి(29) ఎన్నికల బరిలో దిగి యువసత్తా చాటాలని చూస్తున్నారు. -
ఏం మేలు జరిగిందని ఇందిరమ్మ రాజ్యం రావాలి?: కేసీఆర్
సాక్షి, నిర్మల్: యాభై ఏళ్ల పాలనలో తెలంగాణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం ఖానాపూర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. ఓటేసే ముందు పార్టీల చరిత్రను గుర్తు తెచ్చుకోవాలని ప్రజానీకాన్ని అభ్యర్థించారాయన. ‘‘తెలంగాణను బలవంతంగా ఏపీలో కలిపిందే కాంగ్రెస్. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయంతో 58 ఏళ్లు గోస పడ్డాం. కాంగ్రెస్ పాలనలో తాగునీరు కూడా ఇవ్వలేకపోయారు. ప్రాణాలు పణంగా పెట్టి 15 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొంటున్నాం. ..ఆడబిడ్డలకు కల్యాణ కల్యాణ లక్ష్మి, షాదీముబాకర్‌లు ఇస్తున్నాం. గిరిజనుల, ఆదివాసీల ఆత్మగౌరవ భవనాలు నిర్మించాం. అన్ని వర్గాల ఆత్మగౌరవం కోసం పని చేశాం. దేశంలో రైతు బంధు పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తుందట. ధరణి తీసేస్తే రైతు బంధు ఎలా వస్తుంది?.కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారీల రాజ్యం వస్తుంది. ఈసారి గెలిచాక.. పెన్షన్ రూ.5 వేలకు పెంచుతాం. తెల్ల రేషన్‌కార్డు దారులకు సన్నబియ్యం ఇస్తాం. రైతుబంధు రూ.16 వేలకు పెంచుకుందాం అని అన్నారాయన. జగిత్యాలలో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ తెచ్చింది ఎవరు? 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవరు?. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన.. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఏంటో ప్రజలకు తెలుసు. ఏం మేలు జరిగిందని మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలి?. ఇందిరమ్మ రాజ్యంలో జగిత్యాలను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు. యువకులను జైల్లో పెట్టారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ వర్గం బాగుపడింది?. ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ చీకటి రోజులే కదా. ఏపీ పాలకుల కంటే కాంగ్రెస్ నేతలే తెలంగాణను ఎక్కువ ముంచారు. ఎవరు నిజమైన సిపాయిలో గుర్తించాలి’’ అని కేసీఆర్ జగిత్యాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. యాభై ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేయలేదు. రైతు బంధు గురించి ఎవరైనా ఆలోచించారా? రైతు బంధు పుట్టించిందే బీఆర్ఎస్.. కేసీఆర్. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. రైతు బంధు ఉండాలా? వద్దా?. కాంగ్రెస్ వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతారట. ధరణిని ఆపేస్తే.. రైతు బంధు ఎట్లా వస్తది?. ఓటు వేసే ముందు పార్టీ చరిత్ర, అభ్యర్థుల గుణగణాలు చూడాలి అని అన్నారాయన. -
వారిని గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీలను పెట్టింది: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామరక్ష అని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దమ్మున్న నాయకుడు కేసీఆర్.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. నవంబర్ 29న బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడవారు అక్కడ దీక్షా దీవస్‌ను పాటించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ధర్మపురి అరవింద్, బండి సంజయ్, రాజాసింగ్‌ను గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీలను పెట్టింది. రాజాసింగ్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌ను ఓడిస్తాం. రైతు బంధు ఆపేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. కర్ణాటక కాంగ్రెస్ నాయకులను తెలంగాణ ప్రజలు పట్టించుకోరు’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘మా నేతలపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. పీఎం కిసాన్ వేసినప్పుడు రేవంత్ ఎందుకు మాట్లాడారు?. రైతు బంధు కొత్త స్కీమ్ కాదు ...కొనసాగుతున్న స్కీమ్ ఇది. రేవంత్ 3 గంటలు...డీకే శివ కుమార్ 5 గంటలు కరెంట్ అంటున్నారు.. మేము 24 గంటలు కరెంట్ ఇస్తాం అంటున్నాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈడీ నోటీసులపై స్పందించిన కేటీఆర్.. తనకు వచ్చిన ఈసీ నోటీసులకు బదులు ఇస్తామని చెప్పారు. చదవండి: ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు: మంత్రి హరీశ్ -
ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు: మంత్రి హరీశ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిలకు పోలింగ్ సమీపిస్తున్న వేళ ట్రబుల్ షూటర్, మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంట్ కావాలో కాంగ్రెస్ కావాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలన్నారు. కర్ణాటక మాదిరిగా తెలంగాణ ఆగం అవకూడదు అని ప్రజలను కోరారు. కాగా, మంత్రి హరీశ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రాహుల్ గాంధీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం. రైతుబంధు సృష్టికర్త కేసీఆర్. కర్ణాటక మోడల్ అంటే 24 గంటల కరెంట్ బదులు మూడు గంటల కరెంట్ ఇవ్వడమా?. 69 లక్షల మంది రైతులకు రైతుబంధు నిధులు ఇస్తున్నాం. రైతుబంధు డబ్బులు జమకాలేదని ఎవరన్నా రోడ్లమీదకు వచ్చారా?. ధరణితో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. ధరణితో బీఆర్ఎస్కు మంచి పేరు వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓట్ల కోసం దళిత బంధును బీఆర్ఎస్ తీసుకురాలేదు. అలజడిని సృష్టించి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టాలని చూస్తున్నారు. దళిత వర్గాల అభివృద్ధి కోసమే దశలవారీగా దళితబంధు అమలు చేస్తాం. పేపర్ లీక్ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇలాంటివి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వాన్ని విమర్శించడం చేతగాకే ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్షా 32వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వంలో 80వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. నీళ్లు, నిధులు, నియామకాలే బీఆర్ఎస్ విధానం. బీఆర్ఎస్ అత్యుత్తమ పారిశ్రామిక విధానాల ద్వారా పదేళ్లలో ప్రైవేటు రంగంలో 24 లక్షల ఉద్యోగాల కల్పన చేశాం. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే గడ్డం తీయనని ఉత్తమ్ కుమార్ అన్నారు. రేవంత్ రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. దేశంలో ప్రతీ ఎమ్మెల్యేకు క్యాంప్ ఆఫీస్ పెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ 80కిపైగా సీట్లు గెలుస్తుంది. కేసీఆర్ కచ్చితంగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. తెలంగాణలో అతి తక్కువ ఫీజుతో విద్యార్థులు డాక్టర్ కోర్సు చదవచ్చు. బీజేపీ నాయకుల మాదిరిగా మేము పూటకో మాట మాట్లాడం’ అని కౌంటరిచ్చారు. -
మిమ్మల్ని కట్టుబానిసల కంటే హీనంగా చూశారు: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర స్థానిక ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధుల దుస్థితిపై లేఖలో పేర్కొన్నారు. లేఖలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కాగా రేవంత్ లేఖలో..‘జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాకు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత తెలుసు. ఏ ప్రభుత్వ పాలనకైనా మీరే పునాదులు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ అవస్థలు.. మీకు జరిగిన అవమానాలు నాకు తెలుసు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కేసీఆర్ పురుగులకంటే హీనంగా చూశారు. నిర్ణయాధికారం లేక, నిధులు రాక మీరు పడిన బాధలు గుర్తున్నాయి. సర్కారు నిధులు రాకున్నా భార్య మెడలో బంగారం అమ్మి అభివృద్ధి చేసిన వాళ్లు ఉన్నారు. ఊరి కోసం అప్పుచేసి వడ్డీలు కట్టలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొందరు ఉపాధి హామీ కూలీలుగా, వాచ్ మెన్లుగా చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 30న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మీ పాత్ర అత్యంత కీలకం. పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టండి. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదొక అవకాశం. రేపటి నాడు మీ కష్టాలు తీర్చి, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. స్థానిక సంస్థలకు పూర్వవైభవాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక బీఆర్ఎస్, కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదాం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు మీ వంతు పాత్ర పోషించండి. మీ పల్లె రుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ ఇస్తుంది. పార్టీలకు, జెండాలకు, ఎజెండాలకు అతీతంగా.. వార్డు సభ్యుడు నుంచి సర్పంచ్ వరకు.. కౌన్సిలర్ నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు.. కార్పొరేటర్ నుంచి మేయర్ల వరకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను కట్టు బానిసల కంటే హీనంగా చూశారు. ఫిరాయింపులతో ఆత్మగౌరవాన్ని, నిధులు ఇవ్వక అప్పులు పాలు చేసి వ్యక్తిగత జీవితాలను చిన్నాభిన్నం చేశారు. ఊరి అభివృద్ధికి తెచ్చిన అప్పులు కట్టలేక చాలా మంది స్థానిక ప్రజా ప్రతినిధులు ఆత్మహత్యలు… pic.twitter.com/sJgoNB5HMS — Revanth Reddy (@revanth_anumula) November 26, 2023 -
తెలంగాణ ఎన్నికలు.. మన అభ్యర్థులు ఏం చదివారంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తోంది. దీంతో, నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక, గెలుపు మాదంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈసారి ఎన్నికల బరిలో ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మూడో వంతుపైగా పట్టభద్రులు ఉన్నారు. ఇక, డిగ్రీతో పాటు న్యాయవాద విద్యను అభ్యసించిన వారు ఎక్కువగా ఉండగా వైద్యులు, ఇంజనీర్లు కూడా పోటీలో ఉన్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించిన వారూ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అసలే చదవుకోనివారు, పదో తరగతిలోపే చదివిన వారు కూడా ప్రధాన పార్టీల్లో ఉన్నారు. అభ్యర్థుల విద్యార్హత వివరాలు ఇవే.. పదో తరగతి పాసైన అభ్యర్థుల సంఖ్య 441, ఇంటర్ పాసైన వారి సంఖ్య 330, చదువుకోనివారి సంఖ్య 89, ఐదో తరగతి పాసైన వారి సంఖ్య 91, ఎనిమిదో తరగతి పాసైన వారి సంఖ్య 117, డిగ్రీ ఆపై చదివిన వారి సంఖ్య 1143, డిప్లమా చదివిన వారి సంఖ్య 53, డాక్టరేట్ ఉన్న వారి సంఖ్య 32. -
‘మూడ్ ఆఫ్ తెలంగాణను బీఆర్ఎస్ మూడోసారి గెలుస్తుందా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హ్యాట్రిక్ విజయంపై అధికార బీఆర్ఎస్ పార్టీ ఎంతో నమ్మకంతో ఉంది. ఎన్నికల బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ నిలుస్తారని గులాబీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, ►మూడ్ ఆఫ్ తెలంగాణను బీఆర్ఎస్ మూడోసారి గెలుస్తుందా? ►కుటుంబపార్టీ అన్న ఆరోపణలకు అధికారపార్టీ కౌంటరేంటి.? ►నీళ్లు, నిధులు, నియామాకాల ఆశయాన్ని బీఆర్ఎస్ సర్కారు పూర్తి చేసిందా.? ►అవినీతి సర్కార్ అన్న విపక్షాల విమర్శలకు ఆన్సరేంటి.? ►బీజేపీకి బీ-టీం, కాంగ్రెస్‌కు కారు పార్టీ కనెక్ట్ అయిందన్న జాతీయ పార్టీలకిచ్చే జవాబేంటి.? ►సంక్షేమమే తారక మంత్రమా? తాయిలాలు కారును దౌడ్ తీయిస్తుందా? ►తెలంగాణ మంత్రి హరీశ్‌రావుతో స్పెషల్ లైవ్ షో మీ సాక్షి టీవీలో.. -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Telangana Assembly Elections Today Minute To Minute Update.. జుక్కల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సౌదా గర్ గంగారాం సస్పెన్షన్ కామారెడ్డి జిల్లా, జుక్కల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సౌదా గర్ గంగారాం సస్పెన్షన్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని గంగారాంను కాంగ్రెస్ పార్టీ నుండి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసిన క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నా రెడ్డి రెబెల్ గా నామినేషన్ వేసి ఉపసంహరించుకున్న గంగారాం ఇవ్వాళ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్కు ఓట్లు వేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చిన గంగారాం కేజీ టు పీజీ స్కూల్లో పలకతో రండి పట్టాతో వెళ్ళండి: కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చేరుకున్న మంత్రి కేటీఆర్. రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ భారీగా హాజరైన మండల ప్రజలు 30 తేదీన బటన్ నోక్కేటప్పుడు ఒకటే ఆలోచన చేయండి 24 గంటల కరంటు కావాలా... 3 గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా రేపు లేదా ఎల్లుండి రైతు బందు డబ్బులు పడుతాయి, టింగు టింగు మని మేసేజులు వస్తాయి చూడండి మండలంలో ని అన్ని గ్రామాల స్కూల్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం, పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ వెళ్లకుండా చేస్తాను. ఇక్కడ ఉన్న కేజీ టు పీజీ స్కూల్లో చేరి పలకతో రండి పట్టాతో వెళ్ళండి దుబ్బాక ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి రాలేదు ఎన్నికలు వచ్చాయని ఆగమాగం కావొద్దు గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని గమనించండి ఓటు వేసే ముందు ఆలోచించి వేయండి ప్రజలకు ఒకే ఒక్క ఆయుధం ఓటు వేసే ఓటులో తేడా వస్తే ఐదేళ్లు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్లు చూపించేవారు వస్తారు.. వారి మాటలు నమ్మకండి మీరు వేసే ఓటు ఐదేళ్ల తలరాతను మారుస్తుంది ఆలోచించి ఓటు వేస్తే దేశం ముందుకు సాగుతుంది ఓటు వేసే ముందు అభ్యర్థి వెనుక పార్టీ చరిత్రను గమనించండి ఎన్నికలు వచ్చాయంటే అబద్ధాలు చెబుతుంటారు ఎంతో పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం మళ్లీ ఆగమైతే రాష్ట్రం వెనక్కిపోతుంది పదేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం రైతుబంధును తీసుకొచ్చిందే బీఆర్ఎస్ రైతులకు ఇవాళ 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం కాంగ్రెస్ నేతలు రైతుబంధు దుబారా అంటున్నారు రైతుబంధు రూ. 16వేలు చేస్తాం రైతు బీమాతో అన్నదాతలను ఆదుకున్నాం 50 ఏళ్లు మనల్ని ఇబ్బందిపెట్టిన కాంగ్రెస్ మళ్లీ అవసరమా? రైతుబంధు ఉండాలా? వద్దా? రైతుల భూములు బాధలు నాకు తెలుసు రైతుల భూముల కష్టాలు తీర్చేందుకు ధరణి తెచ్చాం రైతు పండించిన పంటను ప్రభుత్వమే కొంటోంది ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే కాంగ్రెస్ నేతలు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు ధరణి తీసేస్తామనే వారినే బంగాళాఖాతంలో వేయండి ధరణి ఉండాలా? వద్దా? భువనగిరి ఎన్నికల ప్రచార సభలో కేంద్రమంత్రి అమిత్ షా ఆచార్య వినోబాభావే భూధానోద్యమం ప్రారంభిస్తే కేసీఆర్ మాత్రం భూమి కబ్జా చేసే ఉద్యమాన్ని ప్రారంభించారు వేలకోట్ల భూములను దోచుకున్నారు బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతి బీఆర్ఎస్ గ్యారేజీకి పంపిస్తాం బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చే రోజు వస్తుంది కేసీఆర్ జూటా మాటలు చెప్తున్నాడు కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా మార్చాలని మోదీని కేసీఆర్ఎప్పుడు కలవలేదు కేసీఆర్ ను గద్దె దించేందుకు మీరంతా సిద్ధం కావాలి కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్కు ఓటేసినట్లే 2018 లో కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎమ్మెల్యేలు అంతా బీఆర్ఎస్ లో చేరారు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరింది కేసీఆర్ సీఎం, రాహుల్ పీఎం కావాలని వారి ప్లాన్ బీజేపీ గెలిచిన తర్వాత బీసీని సీఎం చేస్తాం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం నిర్మల్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ తన కుటుంబం గురించే కేసీఆర్ ఆలోచిస్తున్నారు హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ ప్రజలను మోసం చేశారు పేద ప్రజలను పట్టించుకోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపండి కేంద్ర ఇచ్చిన సంక్షే పథకాలను కేసీఆర్ అడ్డుకుంటున్నారు బీజేపీ ప్రభుత్వం అంటే పేదలకు గ్యారెంటీ ప్రభుత్వం నా ఇల్లు కట్టకోవడానికి నేను ప్రధాని కాలేదు పేద ప్రజలకు ఇళ్లు కట్టడం కోసమే ప్రధాని అయ్యా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఇళ్లు కట్టిస్తాం.. ఇది మోదీ గ్యారెంటీ పదేళ్లుగా తెలంగాణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు కాంగ్రెస్ ఓటేస్తే బీఆర్ఎస్కు ఓటేసినట్లే బీజేపీ అధికారంలోకి వస్తేనే ధరలు తగ్గుతాయి ప్రజలను కలవని సీఎం.. సచివాలయానికి రాని సీఎం మనకు అవసరమా? ములుగులో అమిత్ షా కామెంట్స్ కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ ఆ నేతలు బీఆర్ఎస్లోకి వెళతారు పోడు భూముల సమస్య పరిష్కరించలేక బీఆర్ఎస్ వివాదం రేపుతోంది గిరిజనులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు గిరిజనులను మోసం చేయడం కాంగ్రెస్ లక్షణం కేసీఆర్‌ను గద్దె దించాలంటే బీజేపీకి ఓటేయండి తెలంగాణలో మోదీ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశారు అత్యధిక గిరిజన ఎంపీలు బీజేపీకి చెందినవారే ఉన్నారు సోనియా వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది: దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఎంతగానో కృషి చేసింది ఔటర్ రింగ్ రోడ్డుకి రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ సోనియా వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది తెలంగాణ ప్రజలకు సోనియా ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా అమలుచేస్తాం రైతుబంధు సామాన్య రైతులకు కాకుండా భూస్వాములకు ఉపయోగపడుతోంది టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్.. రాముడు అందరికీ దేవుడే. కొందరు రాముడితో కూడా రాజకీయాలు చేస్తున్నారు కాంగ్రెస్ మత రాజకీయాలు చేయదు మతాన్ని వాడుకొని రాజకీయాలు చేసే వాళ్ళకి మేం వ్యతిరేకం జగిత్యాల ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ తెలంగాణ తెచ్చింది ఎవరు? 24 గంటల కరెంటు ఇచ్చింది ఎవరు? ఇందిరమ్మ రాజ్యంలోనే లక్షల మందిని జైలులో పెట్టారు ఎవరికి కావాలి మీ ఇందిరమ్మ రాజ్యం ప్రజాస్వామ్య పరిణితిపై మీరంతా ఆలోచించాలి గత కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు తేడా గమనించండి రైతుబంధు ఇచ్చి దుబారా చేస్తున్నారని ఉత్తమ్ చెబుతున్నారు రైతుబంధు ఉండాలా? వద్దా? రైతుబంధు రూ. 16వేలు చేస్తాం రైతుబంధు గురించి ఎవరైనా ఆలోచించారా? రైతుబంధు తెచ్చింది బీఆర్ఎస్సే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే: రాజాసింగ్ నిజామాబాద్: బీజేపీ గెలువద్ధనే కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ పోటీకి దిగారు కేసీఆర్ పెద్ద మోసగాడుబీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎమ్మెల్యేలంతా అవినీతి పరులే మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ బీజేపీ కేసీఆర్ మోసగాడు... కేటీఆర్ పెద్దమోసగాడు అసెంబ్లీ సాక్షిగా అనేక అబద్దాలు చెప్పారు బంగారు తెలంగాణ అంటూ అప్పుల తెలంగాణగా మార్చారు ప్రభుత్వం నడిపే కారు స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉంది కేసీఆర్, కేటీఆర్‌లు ఎంఐఎం కాళ్ళు పట్టుకునే అవసరం ఏముంది? ఓవైసి లు నడిపే దక్కన్ కాలేజీ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు హైదరాబాద్ ఓల్డ్ సిటీ మినీ పాకిస్తాన్‌గా మారింది ఓవైసి బ్రదర్స్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఒవైసి బ్రదర్స్‌ని పాకిస్తాన్ తరిమిస్తాం తూప్రాన్ ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగం కాంగ్రెస్, కేసీఆర్ ఒక్కటే.. ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది ప్రజలను కలవని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? అబద్ధపు హామీలు ఇచ్చి కేసీఆర్ ప్రజలను మోసం చేశారు సచివాలయానికి వెళ్లని సీఎం అవసరమా? ఈటలకు భయపడి కేసీఆర్ మరోచోటుకు వెళ్లారు దుబ్బాక, హుజురాబాద్‌లో ట్రైలర్ చూశారు.. ఇక సినిమా చూపిస్తారు కేసీఆర్ ఇచ్చిన హామీలను ఏవీ నెరవేర్చలేదు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు తెలంగాణకు ఇలాంటి సీఎం అవసరం లేదు బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని బీజేపీ సీఎం చేస్తుంది సంగారెడ్డి ఎన్నికల ప్రచార సభలో రాహుల్ కేసీఆర్‌జీ నువ్వు కాళేశ్వరంలో ఎంత దోపిడీ చేశావో చెప్పు. ఢిల్లీలో మోదీకి బీఆర్ఎస్, తెలంగాణలో బీఆర్ఎస్కు మోదీ పరస్పర మద్దతుంది అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం కాంగ్రెస్‌ను ఓడించడానికే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి కాంగ్రెస్‌ను ఓడగొట్టేందుకే బలం లేకపోయినా ఎంఐఎం పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది బీజేపీ, బీఆర్ఎస్ దొరల ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి అని రాహుల్ మండిపడ్డారు కాంగ్రెస్ వచ్చాక ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం నేను ప్రజా సమస్యలపై పోరాడితే కేసులు పెట్టారు. కేసీఆర్ అవినీతికి పాల్పడితే మోదీ మద్దతిస్తున్నారు కేసీఆర్ ఎంత అవినీత చేసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోంది నా ఇల్లును లాగేసుకున్నా భారత దేశమే నా ఇల్లు అనుకున్నా కేసీఆర్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌కు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచారం రాహుల్ గాంధీ వచ్చి బిర్యాని, పాన్ తిని వెళ్ళిపోతారు గాంధీలు చుట్టపు చూపుగా ఇలా వచ్చిపోతుంటారు అండగా నిలిచిన ప్రతిసారి తెలంగాణను నిండా ముంచిన గాంధీ కుటుంబం తెలంగాణకు తీరని మోసం చేసిన గాంధీ కుటుంబం వందలాది మంది యువతను కాంగ్రెస్ పార్టీ బలితీసుకుంది ప్రత్యేక తెలంగాణ ఆలస్యం కావడంతో అనేక మంది ఆత్మబలిదానాలు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చు పెట్టే ప్రయత్నం నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా లేదా కన్నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా ? రైతు బంధు కావాలా లేదా రాబంధు కావాలా ? కాంగ్రెస్ మూడు గంటల కరెంటు కావాలా... బీఆర్ఎస్ 24 గంటల కరెంటు కావాలా ? కాంగ్రెస్ పాలనలో చూసిన దారుణమైన పరిస్థితులు కావాలా ? దారుణ పరిస్థితి మళ్లీ రావద్దంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలి ప్రభుత్వం మనమే ఏర్పాటు చేస్తున్నాం: భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం మర్లపాడు సెంటర్లో కాంగెస్ పార్టీ మీటింగ్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్ సత్తుపల్లి శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట డాక్టర్ రాగమయి దయానంద్‌లు ప్రజా సేవ చేసిన నాయకులు కొందమంది పారిశ్రామిక వెత్తలు సంచులతో డబ్బులు వెదజల్లి బిఆరెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తుంది. గతంలో కాంగ్రెస్,తెలుగుదేశం పాలనలో మాత్రమే అభివృద్ధి జరిగింది గత పది సంవత్సరాల నుండి బిఆర్ఎస్ హయాంలో ఒక్క అభివృద్ధి జరగలేదు. పందిక్కొక్కులాగ దొపిడి చేసి తెలంగాణ సంపదను దోచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులందరూ భారీ మెజారిటీతో గెలుపోందనున్నారు.. ప్రభుత్వం మనమే ఏర్పాటు చేస్తున్నాం. గత ఐదు సంవత్సరాలు గా రుణామాఫి చేయ్యని ప్రభుత్వం కేసిఆర్ ప్రభుత్వం కేసిఆర్ కి బుద్ది ఉందా.. ప్రతి రైతుకు ఎకారానికి 15000 ఇస్తాం....బోనాస్గా 500 రైతుకూలీలకు 1200౦ ఇస్తాం,ఇల్లు నిర్మానానికి ఐదు లక్షలు ఇస్తాం,పీజ్ రియాంబర్ మెంట్స్ విద్యార్ధులకు ఇస్తాం.నిరుద్యోగం లేకుండా చేస్తాం..200 యూనిట్లు ఉచితంగా ఇస్తాం. ఇది కాంగ్రెస్ ప్రభంజనం: పొంగులేటి ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం మర్లపాడు సెంటర్లో కాంగెస్ పార్టీ మీటింగ్‌లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ సత్తుపల్లి నియోజకవర్గంలో ఎలాంటి డౌట్ లేదు మూడు రంగుల జెండా రెపరెపలాడుతుంది రాగమయి గెలుపులో అందరం భాగస్వాములం కావాలి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజల వద్దకు తీసుకువెళ్ళండి ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు మీ అందరి దీవేనలతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తున్నాం ఈ ప్రభంజనం ముందు బడా బాబులు తుడుసుకుపెట్టుకొని పోతారు బీఆర్ఎస్పై యూపీ సీఎం యోగి ఫైర్ మహబూబ్ నగర్: అందరికి నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన యోగి నేను జితేందర్‌రెడ్డి పార్లమెంటు లో కలిసి పనిచేశాం అమరవీరుల ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ ను మాఫియా మయం చేసింది మిగులు రాష్ట్రాన్నికేసీఆర్ సర్కారు అప్పులమయం చేసింది మహబూబ్ నగర్‌ను పాలమూరుగా మార్చటం కోసమే వచ్చాను యూపీలో మాఫియాను బుల్డోజర్తో అణిచివేశాం ఎంఐఎం , బీఆర్ఎస్, కాంగ్రెస్ కామన్ ఫ్రెండ్స్ 26/11 ముంబైలో ఉగ్రదాడి జరిగింది కాని ఇది నయా భారత్ దేశంలోకి చొరబడితే ఏం జరుగుతుందో ఉగ్రవాదులకు తెలుసు సర్జికల్ స్ట్రైక్‌తో ఉగ్రవాదులకు బుద్ధి చెప్పింది మోదీ సర్కార్ కేంద్రంలో యూపీలో డబుల్ ఇంజన్ సర్కార్‌తో ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతున్నాం యూపీలో 55 లక్షల మందికి ఇళ్ళు కట్టించాం 6 ఏళ్ళలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్‌లో జోష్.. నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో జైరాం రమేష్ జైరాం రమేష్ కామెంట్స్.. భారత్ జోడో యాత్ర తరువాత కాంగ్రెస్ జోష్ పెరిగింది అదే జోష్‌తో కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించింది తెలంగాణలోనూ విజయం సాధిస్తాం ఆశించినంతగా అభివృద్ది తెలంగాణలో జరగలేదు బీఆర్ఎస్ కేవలం హైదరాబాద్‌పైనే దృష్టి పెట్టింది. ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు వస్తాయని అనుకుంటే అదీ జరగలేదు ఉద్యోగ అవకాశాలు లేక యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రజా పాలన కొనసాగడం లేదు.. కుటుంబ పాలన కొనసాగుతుంది తెలంగాణ ఇచ్చింది.. ప్రజల అభివృద్ధి కోసం కానీ కేసీఆర్ ప్యామిలీ కోసం కాదు కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందింది బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు ఒక్కటే. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్, ఎంఐఎం సీ టీమ్. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు కచ్చితంగా నేరవేర్చుతాం తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి. కాంగ్రెస్‌ను గెలిపించండి.. ప్రజా తెలంగాణను తిరిగి నిర్మిస్తాం ప్రజల ఆశలను నేరవేర్చుతాం తెలంగాణలో కారు టైర్ పంక్చర్ కాబోతుంది. సీఈవోకు బీఆర్ఎస్ ఫిర్యాదు తెలంగాణ సీఈవో వికాస్ రాజ్‌ను కలిసిన బీఆర్ఎస్ లీగల్ సెల్ కొడంగల్ ఘటనలో కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారు.. ఖానాపూర్ సభలో సీఎం కేసీఆర్ మంచి ఎమ్మెల్యే గెలిస్తే మంచి ప్రభుత్వం వస్తుంది రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం ఖానాపూర్ ఏ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రం ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది పార్టీల చరిత్ర చూసి ప్రజలు ఓటేయాలి పదిహనేళ్లు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం ఈ సారి గెలిచాక పెన్షన్ రూ.5వేల వరుకు పెంచుతాం ఆడ బిడ్డలకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ అందిస్తున్నాం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాల అందించాం గిరిజనులు, ఆదివాసీల కోసం వేర్వేరుగా భవనాలు నిర్మించాం అన్ని వర్గాల ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నాం ఈ సారి గెలిచాక రేషన్‌కార్డు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తాం దేశంలో రైతు బంధు పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం ఆంథోల్‌లో రాహుల్ కామెంట్స్.. కాంగ్రెస్ వచ్చాక ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ దొరల ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎంఐఎం కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది. కాంగ్రెస్‌ను ఓడిచేందుకు బలం లేకపోయినా ఎంఐఎం పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది. కేసీఆర్ ఎంత అవినీతి చేసినా కేంద్రంలోకి బీజేపీ చూస్తూ ఊరుకుంటోంది. నేను ప్రజా సమస్యలపై పోరాడితే నాపై కేసులు పెట్టారు. నా ఇల్లును లాగేసుకున్నా భారతదేశమే నా ఇల్లు అనుకున్నా. కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ధరణితో 20 లక్షల ఎకరాల భూములు లాక్కున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలుచేస్తాం. ప్రజల స్వప్నాన్ని కేసీఆర్, మంత్రులు నాశనం చేశారు. కేసీఆర్ అవినీతికి పాల్పడితే మోదీ మద్దతుగా నిలుస్తున్నారు. కేసీఆర్ ఎంత అవినీతి చేసినా కేంద్రంలోని బీజేపీ చూస్తూ ఊరుకుంటుంది. లోక్‌సభలో మోదీకి బీఆర్ఎస్, తెలంగాణలో కేసీఆర్‌కు మోదీ మద్దతిస్తారు. ప్రచారంలో మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి.. డ్యాన్స్‌తో జోష్ బొడుప్పల్లో మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఎన్నికల ప్రచారం మహిళా గర్జనలో మహిళలతో డ్యాన్స్ చేసిన ప్రీతి రెడ్డి మహిళా గర్జనలో పెద్ద ఎత్తున హాజరైన మహిళలు మహిళలతో కలిసి బోనమెత్తిన ప్రీతి రెడ్డి.. ప్రచారంలో పాటలకు డ్యాన్స్ చేసిన ప్రీతి రెడ్డి. ఆమె డ్యాన్స్‌లో స్టేప్పులు కలిపిన మహిళా కార్యకర్తలు ప్రీతి రెడ్డి కామెంట్స్.. బోడుప్పల్లో అభివృద్ధి కావాలంటే కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించండి. కాంగ్రెస్ నేతలు ఎన్ని కథలు చెప్పిన నమ్మకండి. మల్లారెడ్డి వల్లే అభివృద్ధి జరుగుతుంది. బోడుప్పల్ బిడ్డగా మీ ముందుకు వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. ఓ మహిళగా మీ సమస్యలు నాకు తెలుసు. మహిళల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టింది. కారు గుర్తుకు ఓటు వేసి మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి. ఈసీ నోటీసులకు బదులిస్తాను: కేటీఆర్ రైతుబంధు కొత్త స్కీమ్ కాదు.. ఇప్పటికే కొనసాగుతున్న స్కీమ్ రేవంత్ మూడు గంటలు, డీకే శివకుమార్ ఐదు గంటలు కరెంట్ అంటున్నారు. మేము 24 గంటల కరెంట్ ఇస్తామంటున్నాం. కర్ణాటక వాళ్లు ఇక్కడ ప్రచారం చేయడం ఏంటి? కాంగ్రెస్‌ను నమ్ముతాం అంటే అది వారి అవగాహనకు వదిలేస్తాం. గోషామహల్లో కూడా బీజేపీని ఓడిస్తాం. నాకు ఈసీ నోటు ఇచ్చారు. ఈసీ నోటీసులకు బదులు ఇస్తాను. మక్తల్ బీజేపీ సభలో అమిత్ షా కామెంట్స్.. పదేళ్లుగా తెలంగాణను బీఆర్ఎస్ నాశనం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదు. నిరుద్యోగులకు రూ.3వేలు భృతి ఇస్తానని కేసీఆర్ ఇవ్వలేదు. మక్తల్‌లో వంద పడకల ఆసుపత్రి ఎందుకు నిర్మించలేదు. కేసీఆర్ సర్కార్ అంటే లీకేజీ ప్రభుత్వం: బల్మూరి వెంకట్ బీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ సీరియస్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎన్ని అయితే పరీక్షలు నిర్వహించారో అన్నిట్లో లీకేజీలే. నిరుద్యోగులను మోసం కేసీఆర్ మోసం చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగంతో పాటు అన్ని ఉద్యోగాలలో పేపర్ పత్రాలు లీకేజ్ చేసిన ఘనత కేసీఆర్ సర్కార్‌దే. ఈ సందర్భంగా ప్రభుత్వం, కేసీఆర్ 420 అనే ప్రశ్నాపత్రాన్ని వెంకట్ లీక్ చేశారు. ఈ పత్రాలను ఓయూ లైబ్రరీతో పాటుగా చిక్కడపల్లి లైబ్రరీలో ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు కొత్త పేరు పెట్టిన జేపీ నడ్డా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలే. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి. కాంగ్రెస్ అంటే కమీషన్, క్రిమినలైజేషన్, కరప్షన్. దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు మోదీకి ఓటు వేయండి. తెలంగాణలో బీజేపీని గెలిపించండి. దమ్మున్న నాయకుడు కేసీఆర్.. మీడియాతో మంత్రి కేటీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి గొప్ప వ్యక్తి కేసీఆర్ ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చారు నవంబర్ 29న బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడవారు అక్కడ దీక్షా దీవస్‌ను పాటించాలి తెలంగాణకు స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామరక్ష తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తాం ధర్మపురి అరవింద్, బండి సంజయ్, రాజాసింగ్‌ను గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీలను పెట్టింది రాజాసింగ్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌ను ఓడిస్తాం రైతు బంధు ఆపేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు కర్ణాటక కాంగ్రెస్ నాయకులను తెలంగాణ ప్రజలు పట్టించుకోరు తెలంగాణలో కాంగ్రెస్ గెలవదు: మాజీ ఎంపీ వినోద్ కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో బోయినపల్లి వినోద్ కుమార్ ప్రెస్ మీట్.. తెలంగాణలో 90 సీట్లు గెలిచి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కరీంనగర్ జిల్లాలో అన్నీ సీట్లు గెలుస్తాం. కరీంనగర్లో ట్రయాంగిల్ లేదు బీఆర్ఎస్ ఒక్కటే వస్తుంది. కాంగ్రెస్ గెలవడం అనేది తెలంగాణలో జరగదు. కాంగ్రెస్ గెలుస్తదని వెళ్తున్నారు కానీ మళ్లీ వెనకకు వస్తారు. బీజేపీ పార్టీ మత విద్వేషాలు పెంచుతుంది. తెలంగాణలో గెలిచే సత్తా మా పార్టీకి ఉంది. లేనిది ఉన్నట్టు చూపించే పార్టీ కాంగ్రెస్. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. గాలి మాటలు నమ్మి మోసపోవద్దు కాంగ్రెస్‌కు ఓటు వేసి ఆగం కావద్దు. హుజూరాబాద్‌లో ట్రయాంగిల్ ఫైట్ ఉంది. మైనార్టీలను కాంగ్రెస్ మోసం చేస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులకు రేవంత్ లేఖ తెలంగాణ రాష్ట్ర స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధుల దుస్థితిపై లేఖలో జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాకు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత తెలుసు. ఏ ప్రభుత్వ పాలనకైనా మీరే పునాదులు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ అవస్థలు.. మీకు జరిగిన అవమానాలు నాకు తెలుసు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కేసీఆర్ పురుగులకంటే హీనంగా చూశారు. నిర్ణయాధికారం లేక, నిధులు రాక మీరు పడిన బాధలు గుర్తున్నాయి. సర్కారు నిధులు రాకున్నా భార్య మెడలో బంగారం అమ్మి అభివృద్ధి చేసిన వాళ్లు ఉన్నారు. ఊరి కోసం అప్పుచేసి వడ్డీలు కట్టలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొందరు ఉపాధి హామీ కూలీలుగా, వాచ్ మెన్లుగా చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 30న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మీ పాత్ర అత్యంత కీలకం. పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టండి. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదొక అవకాశం. రేపటి నాడు మీ కష్టాలు తీర్చి, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. స్థానిక సంస్థలకు పూర్వవైభవాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. బీఆర్ఎస్, కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదాం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు మీ వంతు పాత్ర పోషించండి. మీ పల్లె రుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ ఇస్తుంది. పార్టీలకు, జెండాలకు, ఎజెండాలకు అతీతంగా.. వార్డు సభ్యుడు నుంచి సర్పంచ్ వరకు.. కౌన్సిలర్ నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు.. కార్పొరేటర్ నుంచి మేయర్ల వరకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రి హరీశ్ కీలక వ్యాఖ్యలు.. Live Show తెలంగాణలో రాహుల్ గాంధీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కర్ణాటక మాదిరిగా తెలంగాణ ఆగం అవకూడదు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం. కరెంట్ కావాలో కాంగ్రెస్ కావాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలి. తెలంగాణపై బీజేపీ అగ్రనేతల ఫోకస్.. ఈరోజు పది సభల్లో పాల్గొననున్న అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, సీఎం యోగి ఆదిత్యనాథ్. రాష్ట్ర కార్యాలయం నుంచే బీఎల్ సంతోష్ పర్యవేక్షణ. ఈరోజు మధ్యాహ్నం జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ భేటీ. ఎస్సీ వర్గీకరణ, బీసీ సీఎం ఫార్ములా వర్క్ అవుట్ అవుతుందని కమలనాథుల ఆశలు. రైతుబంధు, బీఆర్ఎస్పై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు రైతుబంధుపై సీఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ రైతు బంధుపై ఈసీ ఇచ్చిన ఆదేశాలను బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో వాడకుండా ఆంక్షలు విధించాలని ఫిర్యాదు. రైతుబంధు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నట్లు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్న కాంగ్రెస్ ఈసీ ఆదేశాలను బీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తుందన్న కాంగ్రెస్ నేడు మధిరలో భట్టి బైక్ ర్యాలీ.. ఖమ్మంలో భట్టి విక్కమార్క ఎన్నికల ప్రచారం నేడు మధిర నియోజకవర్గంలో భట్టి బైక్ ర్యాలీ బైక్ ర్యాలీలో పాల్గొననున్న పొంగులేటి, తుమ్మల నాగేశ్వర రావు మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రుపాలెం క్రాస్‌రోడ్ నుంచి బోనకల్లు మండలం సీతానగరం వరకు బైక్ ర్యాలీ భారీ సంఖ్యలో బైక్ ర్యాలీకి ప్లాన్ చేసిన కాంగ్రెస్ నేతలు తెలంగాణలో అసెంబ్లీ అభ్యర్థులు విద్యార్హత వివరాలు ఇవే.. పదో తరగతి పాసైన అభ్యర్థుల సంఖ్య 441, ఇంటర్ పాసైన వారి సంఖ్య 330, చదువుకోనివారి సంఖ్య 89, చదువుకున్న వారి సంఖ్య 26 ఐదో తరగతి పాసైన వారి సంఖ్య 91, ఎనిమిదో తరగతి పాసైన వారి సంఖ్య 117, డిగ్రీ ఆపై చదివిన వారి సంఖ్య 1143, డిప్లమా చదివిన వారి సంఖ్య 53, డాక్టరేట్ ఉన్న వారి సంఖ్య 32. కామారెడ్డిలో పోస్టర్ల కలకలం టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై సెటైరికల్ కామెంట్స్ కొడంగల్‌లో చెల్లని రూపాయి కామారెడ్డికి అవసరమా అంటూ పోస్టర్లు కామారెడ్డి ప్రధాన కూడళ్లలో వెలిసిన పోస్టర్లు పోస్టర్లు అతికించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు, పోలీసులకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు నేడు తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్య నేతల పర్యటనలు ఇలా.. ఆంథోల్, సంగారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్న రాహుల్ గాంధీ నారాయణపేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, కామారెడ్డి, పటాన్చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్న రేవంత్ రెడ్డి. వరంగల్ వెస్ట్, కరీంనగర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్న ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్. మక్తల్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య. బీఆర్ఎస్ అభ్యర్థిపై హత్యాయత్నం కేసు నమోదు నారాయణపేట రాజకీయాల్లో కలకలం కోస్గిలో కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు కాంగ్రెస్ కార్యకర్త కూర నరేష్‌పై కర్రలతో దాడి చేసిన బీఆర్ఎస్ నేతలు 307తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు మొత్తం ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు, ఏ1గా పట్నం నరేందర్ రెడ్డి. నేడు కేటీఆర్ ప్రచారం షెడ్యూల్ ఇలా.. నేడు చొప్పదండి, సిరిసిల్ల నియోజకవర్గాల్లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం ఉదయం చొప్పదండిలో ఎన్నికల ప్రచారం సాయంత్రం సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటలో రోడ్ షో నేడు తెలంగాణలో సీఎం సిద్ధరామయ్య పర్యటన ఎన్నికల సందర్బంగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య తెలంగాణ పర్యటన నేడు మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ హెలికాప్టర్లో బేగంపేట నుంచి మక్తల్‌కు సిద్ధరామయ్య మధ్యాహ్నం మూడు గంటలకు మక్తల్‌లో ప్రచార సభ.. సాయంత్రం 5.30 గంటలకు ముషీరాబాద్‌లో ప్రచార సభ పాల్గొననున్న కర్టాటక సీఎం. నేడు మహబూబ్‌నగర్‌కు సీఎం యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేడు మహబూబ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం యోగి నేడు నిర్మల్‌లో మోదీ, కేసీఆర్ పర్యటన నేడు నిర్మల్ జిల్లాలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్మల్ జిల్లా కేందంలో ఎన్నికల ప్రచార సభలో పాల్లొననున్న ప్రధాని మోదీ ఖానాపూర్‌లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరుకానున్న సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ సభ నేపథ్యలో పోలీసుల భారీ భద్రత. నేడు నాలుగు చోట్ల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు.. ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పూర్తి అప్డేట్స్.. సర్వేల పూర్తి సమాచారం.. ఇప్పుడు మీ కోసం..