breaking news
-
బీసీల బతుకులు మారాయి
సాక్షి, అమరావతి: సమాజంలో అన్ని విధాలుగా వెనుకబడిన తరగతుల వారికి ఈ ప్రభుత్వంలోనే సరైన న్యాయం జరిగిందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. డబ్బు, నోరు, శక్తి, గుర్తింపు లేనివాళ్లకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అగ్రపీఠం వేసిన ఏకైక వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. జగన్ పాలనలో బడుగుల బతుకులు మారాయని, ఆయన గెలుపుతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ఓ హోటల్లో 139 బీసీ కులాల ప్రతినిధులతో గురువారం బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మారేష్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ తన 45 ఏళ్ల బీసీ ఉద్యమ ప్రస్థానంలో ఎంతో మంది నాయకులను చూశాననీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల మేలు కోరే జగన్ వంటి నాయకుడిని చూడలేదనీ పేర్కొన్నారు. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సంఘ సంస్కర్తగా అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, సామాజిక న్యాయం అందించడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. నాలుగున్నరేళ్ల ఆయన పాలనలోనే వాస్తవ రాజ్యాధికార బదిలీ జరిగిందని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలోనూ జరగనంత సామాజిక న్యాయం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని చెప్పారు. సామాజిక న్యాయం కోసం, సమ సమాజం నెలకొల్పే దిశగా జగన్ పాలన కొనసాగుతున్నందున బీసీలంతా ఆయనకు మద్దతుగా నిలవాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీలు బాగుంటే చంద్రబాబుకు కడుపుమంట సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలోని పేదవర్గాల కడుపునిండుతుంటే చంద్రబాబు వంటి పెత్తందార్ల కడుపు మండుతోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ’ఖబడ్దార్ ప్రతిపక్షాలు.. మీ మోసాలు మాకు తెలిశాయి’ అంటూ కృష్ణయ్య హెచ్చరించారు. అమ్మఒడి, విద్యాదీవెన వంటి అనేక పథకాలు పెట్టి బీసీల బిడ్డలను సీఎం జగన్ చదివిస్తున్నారనీ, విదేశీ విద్య వంటి ప్రోత్సాహంతో బీసీల పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారనీ, వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి బీసీలు ఇప్పుడు కార్లు, విమానాల్లో తిరుగుతున్నారని చెప్పారు. పొరుగున ఉన్న ఒడిశా, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకు వెళ్లి బీసీ బతుకులు ఎలా ఉన్నాయో చూస్తే ఏపీలో బీసీల అభివృద్ధి ఎంత గొప్పగా ఉందో తెలుస్తుందని చెప్పారు. ఇటీవల కర్ణాటకలోని బళ్లారి, తమిళనాడులోని తెలుగు వారుండే ప్రాంతంలో ఓ సమావేశానికి తాను వెళ్లినపుడు అమ్మ ఒడి, పింఛన్, విద్యా కానుక, ఆరోగ్యశ్రీ వంటి పథకాల కోసం తమను కూడా ఏపీలో కలిపితే బాగున్ను అని అక్కడివారు తనతో అన్నట్టు ఉదహరించారు. రాష్ట్రాన్ని 14 ఏళ్ళు పాలించిన చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రతిపక్షాల మోసపు మాటలు ఎవరూ నమ్మొద్దని పిలుపునిచ్చారు. -
పురపాలికల్లో అవిశ్వాస రాజకీయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నెల కూడా గడువక ముందే చాలా పురపాలికల్లో అవిశ్వాస రాజకీయం ఊపందుకుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మునిసిపాలిటీలో గురువారం జరిగిన సమావేశంలో కౌన్సిలర్లు మునిసిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గగా మరో ఏడు మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలపై చర్చకు జిల్లా కలెక్టర్లు కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరుగనుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో అవిశ్వాస నోటీసుకు స్పందించిన కలెక్టర్ ఈ నెల 8న పాలకమండలిని సమావేశపరిచారు. అదేరోజు నల్లగొండలోనూ సమావేశం జరగనుంది. 11న మంచిర్యాల మునిసిపాలిటీ పాలకమండలి సమావేశం కానుండగా ఆ సమావేశంలోనే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్, ఆ తరువాత గంటకే కొత్త చైర్పర్సన్, వీసీ ఎన్నిక ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లితోపాటు నస్పూర్ మునిసిపాలిటీ సమావేశం ఈ నెల 12న జరగనుంది. కాగజ్‌నగర్ మునిసిపాలిటీ చైర్పర్సన్ సద్దాం హుస్సేన్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 20న సభ సమావేశం కానుంది. అలాగే ఈ నెల 19న సిద్దిపేట జిల్లా చేర్యాల మునిసిపాలిటీ సమావేశం జరగనుంది. ఇంకా చాలా మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలకు ఇచ్చిన నోటీసులపై జిల్లా కలెక్టర్లు స్పందిస్తున్నారు. అవిశ్వాసాల నుంచి తప్పించుకోవడానికి సుమారు 15 మంది మునిసిపల్ చైర్పర్సన్లు కాంగ్రెస్‌లో చేరినా పదవీగండం తప్పేలా లేదు. మరికొన్ని చోట్ల నోటీసులకు సిద్ధం.. నల్లగొండ జిల్లాలో నల్లగొండ మునిసిపాలిటీతోపాటు నేరే డుచెర్ల, భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ మునిసిపాలిటీల్లో అవిశ్వాసాల రగడ నడుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద అంబర్‌పేట మునిసిపాలిటీ లతోపాటు మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, గుండ్లపో చంపల్లి, నిజాంపేట మునిసిపాలిటీలు, పీర్జాదిగూడ, జవహ ర్‌నగర్ కార్పొరేషన్లలో నోటీసులు జారీ చేసేందుకు సభ్యులు సిద్ధమవుతున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌లో చేరిన ఇందుప్రియపై బీఆర్ఎస్ అవిశ్వాస నోటీసుకు సిద్ధమవుతోంది. కరీంనగర్లో జమ్మికుంట మునిసిపల్ చైర్‌పర్సన్‌పై ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పొన్నగంటి మల్లయ్య అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. అయితే రామగుండం కార్పొరేషన్లో అవిశ్వాసం ఆలోచన తమ సభ్యులకు లేదని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అసమ్మతి సభ్యుల నుంచే.. సుమారు నాలుగేళ్ల క్రితం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 128 మునిసిపాలిటీలు, 13 కార్పొరేషన్లకుగాను మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగా నాలుగైదు పాలక మండళ్లనే కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. పురపాలక చట్టం ప్రకారం పాలకమండలి మూడేళ్ల పదవీకాలం పూర్తయ్యాక అవిశ్వాస లేదా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉండగా ఈ తీర్మానాల గడువును నాలుగేళ్లకు పెంచుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మునిసిపల్ చట్టంలో మార్పులు చేసింది. అయితే అది గవర్నర్ ఆమోదం పొందలేదు. దీంతో గతేడాది జనవరి 27 తరువాత 36 మునిసిపాలిటీలు, పలు కార్పొరేషన్లలో బీఆర్ఎస్ అసమ్మతి సభ్యులు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. వారికి కాంగ్రెస్, బీజేపీ సభ్యులు తోడై చైర్పర్సన్లు, మేయర్లను గద్దె దించాలని ప్రయత్నించారు. అయితే గత ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు పాలకమండళ్లను సమావేశపరచకపోవడం, ఈలోగా మునిసిపల్ చైర్పర్సన్లు, మేయర్లు కోర్టుకెక్కి స్టే తెచ్చుకోవడంతో అప్పట్లో అవిశ్వాసాలకు బ్రేక్ పడింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అవిశ్వాస తీర్మానాల్లో మళ్లీ కదలిక మొదలైంది. ‘ఆర్మూర్’చైర్‌పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం పదవి కోల్పోయిన వినీత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె భర్త బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేశారనే..! ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మునిసిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆమె తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మునిసిపల్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో వినోద్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్‌కు చెందిన 24 మంది కౌన్సిలర్లు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. మరో 12 మంది కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. 2020 జనవరిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా 33వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పండిత్ వినీత గెలిచారు. అప్పట్లో చైర్పర్సన్ పదవికి బీసీ మహిళా రిజర్వేషన్ కలిసి రావడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో చైర్పర్సన్ భర్త పండిత్ పవన్ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపిస్తూ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్ కౌన్సిలర్లు సంప్రదించగా ఆయన సూచన మేరకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నూతన మునిసిపల్ చైర్పర్సన్ ఎంపికపై కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు త్వరలో ఆదేశాలు జారీ చేయనున్నారు. -
ఎమ్మెల్సీలు చెరొకటి.. 29న పోలింగ్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా స్థానాల్లో ఒకటి అధికార కాంగ్రెస్ పార్టీకి, మరో స్థానం బీఆర్ఎస్కు దక్కనుంది. రెండు స్థానాలకు రెండు పార్టీల తరఫున ఇద్దరు అభ్యర్థులే నామినేషన్ వేసే పక్షంలో ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డిలు.. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వాస్తవానికి వారి పదవీకాలం 2027 నవంబర్ 30 వరకు ఉంది. అయితే వారి రాజీనామా అనివార్యం కావడంతో మండలిలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. కాంగ్రెస్ టికెట్ మైనారిటీ వర్గానికేనా? ఈ రెండు స్థానాల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఆయా పార్టీల అగ్ర నాయకులు పలువురికి ఎమ్మెల్సీ హామీలిచ్చారు. ఇప్పుడు అదే వారికి తలనొప్పిగా మారనుంది. కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఒక్క మైనారిటీ కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడంతో ఆ వర్గానికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సామాజిక సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం కూడా మైనారిటీల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. అయితే రాష్ట్రంలో పార్టీ ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో తమ అసెంబ్లీ స్థానాలను త్యాగం చేసిన పలువురు నేతలు కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దీనిపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ స్థానం ఆశిస్తున్న వారిలో ఇటీవల ఎన్నికల్లో ఓటమి చెందిన షబ్బీర్ అలీ, ఫిరోజ్‌ఖాన్, అజారుద్దీన్, అలీ మస్కతి, అద్దంకి దయాకర్, అందెశ్రీ, సంపత్, మధుయాష్కీ గౌడ్లు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికల పొత్తులో భాగంగా సీపీఐకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఒకే స్థానం లభించే అవకాశమున్నందున సీపీఐకి కేటాయించే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. ఎవరి త్యాగానికి ఫలితం దక్కుతుందో? బీఆర్ఎస్ విషయానికొస్తే..అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీ నుంచి తప్పించిన పలువురు నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని అధినేత కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చారు. స్టేషన్ఘనపూర్ స్థానాన్ని కడియం శ్రీహరి కోసం త్యాగం చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, జనగాం స్థానాన్ని పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోసం వదులుకున్న ముత్తిరెడ్డి యాదగిరి, నర్సాపూర్ స్థానాన్ని సునీతా లక్ష్మారెడ్డి కోసం త్యాగం చేసిన మదన్‌రెడ్డి, కామారెడ్డిలో పార్టీ అధినేత కేసీఆర్ కోసం త్యాగం చేసిన గంపా గోవర్దన్ ఎమ్మెల్సీ స్థానం ఆశిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే అధినేత ఎవరివైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. 119 మంది సభ్యులున్న రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ 65 (సీపీఐ 1 కలిపి), బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం ఏడుగురు ఎమ్మెల్యేల బలం కలిగి ఉన్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 29న పోలింగ్ – షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ – ఈ నెల 11న వెలువడనున్న నోటిఫికేషన్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డిల రాజీనామాతో శాసనమండలిలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. 18న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా, 19న నామినేషన్లను పరిశీలిస్తారు. 22న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. -
కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల
సాక్షి, న్యూఢిల్లీ: యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ఈ సందర్భంగా షర్మిల ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు, ఏఐసీసీ సీనియర్ నేత కొప్పుల రాజుతోపాటు షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్, పలువురు వైఎస్సార్టీపీ నేతలు పాల్గొన్నారు. కాగా, షర్మిలకు కండువా కప్పిన అనంతరం బ్రదర్ అనిల్‌కు సైతం ఖర్గే కండువా కప్పేందుకు ప్రయత్నించగా ఆయన సున్నితంగా నిరాకరించారు. షర్మిల సైతం తాను ఒక్కదానినే చేరుతున్నట్లు పేర్కొనగా మరి వేదికపైకి మీరెందుకు వచ్చారని ఖర్గే నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం అనంతరం పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీతో షర్మిల దంపతులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యున్నతికి పనిచేస్తా... కాంగ్రెస్‌లో చేరడంపట్ల తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆత్మ సంతోషిస్తుందని షర్మిల పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేది తన తండ్రి కల అని.. ఆ కల నెరవేర్చేందుకు, పార్టీ అభ్యున్నతి కోసం పనిచేస్తా నని చెప్పారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతోనే తెలంగాణలో కాంగ్రెస్‌కు తాను మద్దతు ప్రకటించి పోటీ చేయలేదని వెల్లడించారు. కడప ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తారా లేక ఏదైనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నించగా పార్టీ ఆదేశిస్తే అండమాన్ నుంచైనా పోటీకి సిద్ధమని షర్మిల ప్రకటించారు. మరో రెండ్రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. మరోవైపు ఏపీలో షర్మిలకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. -
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటూ రాదు
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశం లేదని పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తరువాత కారు పార్టీ కనుమరుగయ్యే అవ కాశం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించినా బీఆర్ఎస్ నాయకుల్లో అహంకారం తగ్గ లేదన్నారు. గురువారం గాంధీభవన్‌లో మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. 2018 ఎన్ని కల్లో గెలిచిన తరువాత 36 రోజుల వరకు కనీసం అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేయని బీఆ ర్ఎస్కు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెలరోజులు కూడా కాకముందే రెండు హామీలను అమలు చేయడమే కాక, ప్రజల నుంచి అభయహ స్తం అమలు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న విష యం తెలియదా అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 3న ఫలితాలు వచ్చిన నాలుగు రోజుల్లోనే మంత్రివర్గం ఏర్పడటం, మంత్రివర్గం ఏర్పాటైన రెండురోజుల్లోనే శాసన సభ సమావేశాలు ప్రారంభించడమేకాక, మహిళ లకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ వ్యయ పరిమితిని పెంచిన విషయాన్ని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఆరున్నర కోట్ల మంది మహిళలు బస్సులో ఉచిత ప్రయాణం చేశారన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తరువా త రెండునెలల వరకు మంత్రివర్గం కూడా ఏర్పాటు చేయకపోవడం బాధ్యతారాహిత్యం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ విడుదల చేసిన బుక్లెట్పై మంత్రి మండిపడ్డారు. నెల కాకుండానే ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కడం దారుణమన్నారు. తొందరపాటు ఎందుకు.. ముందు పార్టీని చక్కదిద్దుకోండి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్కు ఎందుకంత తొందరపాటు అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేస్తున్నామన్నారు. మీరేమై నా సూచనలు చేస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మీ పార్టీ కార్యా లయంలో మీడియా సమావేశాలు పెట్టడం కాదు క్షేత్రస్థాయికి వెళ్లి చూడండని హితవు పలికారు.. విభజన హామీలపై ఏమాత్రం పోరాటం చేయని బీఆర్ఎస్ 420నో కాదో ప్రజలకు తెలుసు నని అన్నారు. అధికారం పోయిందనే అక్క సుతో ఆరోపణలు చేయడం సరికాదని, ముందు పార్టీని చక్కదిద్దుకో వాలని సూచించారు. కొంతమంది ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని శ్రీధర్‌బాబు విమర్శించారు. -
కమీషన్ తీసుకుంటే విచారణ చేయించండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో తాను కమీషన్ తీసుకున్నట్టు కొందరు ఆరోపిస్తున్నందున దానిపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదాయం ఎంతో, తన ఆదాయం ఎంతో విచారణకు సిద్ధమని ప్రకటించారు. బీజేపీలో తన ›ప్రస్థానం ఎలా మొదలైందో, రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైందో ఎవరు ఏ రకంగా డబ్బు సంపాదించారో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. ఎవరిపై ఎలాంటి ఆరోపణలు వచ్చాయో మొత్తం తెలంగాణ సమాజం ఎదుటే ఉందని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కుటుంబంతో వ్యాపార భాగస్వామ్యం ఉన్నది కూడా ఎవరికో అందరికీ తెలుసునన్నారు. ’తాను కేసీఆర్‌కు బినామీ కాదు..తనపై ఆరోపణలు చేస్తున్న వారే కేసీఆర్‌కు బినామీలు’ అని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిరర్థకంగా మారడంతో అందరూ బాధ పడుతున్నారని, దీనిపై న్యాయ విచారణతో పాటు సీబీఐ విచారణ జరిపించాలని తాను కోరితే కాంగ్రెస్ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు విషయం పక్కన పెట్టి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సీఎం గతంలో ఎంపీగా కాళేశ్వరం అవినీతిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని సీబీఐకి లేఖ రాస్తున్నట్లు చెప్పారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి ఎంపీగా ఉన్నపుడు సీబీఐ విచారణకు లేని అభ్యంతరం సీఎం అయ్యాక ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరిట కాలయాపన చేసి కేసీఆర్‌ను కాపాడాలనుకుంటే తాను చేసేదేమీ లేదన్నారు. లంకె బిందెల కోసం వచ్చారా రేవంత్ లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఇక్కడ ఖాళీ బిందెలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, ఆయన లంకె బిందెల కోసం వచ్చారా అని కిషన్‌రెడ్డి నిలదీశారు. ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి మళ్ళీ ఫార్మా సిటీ ఉంటుందని చెప్పారని 15 రోజుల్లోనే ప్రభుత్వం ఎందుకు యూటర్న్ తీసుకుందనీ, అందులో మతలబు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఫార్మా కంపెనీల లాబీయింగ్‌కు లొంగిపోయారా అని నిలదీశారు. మోదీ మెడిసిన్ ప్రపంచానికే సంజీవని.. మోదీ మెడిసిన్‌కు కాలం తీరిపోయిందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు... ఆయన ఎప్పుడు ఆ మందు వేసుకున్నార’ని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘మీ రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు ఆ మెడిసిన్ రిజెక్ట్ కాదు.. మోదీ మెడిసిన్ ప్రపంచానికే సంజీవని’’ అని వ్యాఖ్యానించారు. ‘బీఆర్ఎస్ ఔట్ డేటెడ్ పార్టీ. ఆ పార్టీ అవసరం తెలంగాణకు లేదు, లోక్‌సభ ఎన్నికల్లో చిచాణా ఎత్తేయడం ఖాయం’’ అని అన్నారు. అభయ హస్తం పేరుతో ప్రజల్లో గందరగోళం ‘అభయ హస్తం పేరుతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఆ ఫారం నింపడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.. కాలయాపన కోసమే ఇదంతా. ఇందులో రాజకీయం తప్ప చిత్తశుద్ధి లేదు. ఫార్మ్స్ బ్లాక్‌లో కొనుక్కోవాల్సి వస్తుంది. దరఖాస్తు అవసరం లేకుండానే ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి ఇవ్వలేదు... ఆ విషయం తెలిసి కూడా దరఖాస్తులకు రేషన్ కార్డ్ జత చేయమనడం ఎందుకు? లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధికోసమే ప్రజలను తమచుట్టూ తిప్పుకుని ఇబ్బందిపెడుతున్నారు’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారాన్ని ఖండించే క్రమంలో తెలంగాణ మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఒకరిని తీసుకెళ్తే.. బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ వాళ్లు పది మంది వస్తారని అన్నారాయన. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కానీ, కేసీఆర్ మాకు దైవ సమానులు. ఆయననుగానీ, బీఆర్ఎస్నుగానీ ఎవరూ వీడరు. అందరూ ఆయన వెంటే ఉంటారు. ఎవరూ కాంగ్రెస్‌లో చేరరు. కాంగ్రెస్ వాళ్లు ఒక్కరిని తీసుకెళ్తే.. బీఆర్ఎస్లోకి పది మంది వస్తారు. మేం గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్లోకి వచ్చే పరిస్థితి ఉంది. పదేళ్లు అధికారంలో ఉన్నాం. మాకు అధికారం ముఖ్యం కాదు. ప్రభుత్వాన్ని కూలదోసే ఉద్దేశం లేదూ అని గంగుల వ్యాఖ్యానించారు. కరీంనగర్ ప్రజలకు మేలు చేయడంలోఎంపీగా బండి సంజయ్ విఫలమయ్యారని.. మళ్లీ వినోద్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని.. ఇందుకోసం కృషి చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపు ఇచ్చారు. -
పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభకు పోటీ చేస్తా: మల్లారెడ్డి
సాక్షి, మేడ్చల్: బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మల్లారెడ్డి.గురువారం తెలంగాణ భవన్లో కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో మల్కాజిగిరి ఎంపీ గా పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలైన మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఇటివల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇదే తరహలో ప్రజలు బీఆర్ఎస్ను ఆదరిస్తారన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంతో పాటు రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని దీమాను వ్యక్తం చేశారు. లోక్‌సభ స్థానాల వారీగా సమీక్షలు నిర్వహించి గెలుపే లక్ష్యంగా పనిచేయనున్నట్లు వెల్లడించారు. తాను పోటీ చేసే విషయమై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుదని పేర్కొన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ సమీక్షా సమావేశం ఈ నెల 21 తెలంగాణ భవన్లో పార్లమెంట్పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో అదిష్టానం నిర్వహిస్తుందని మల్లారెడ్డి తెలిపారు. చదవండి: CM Revanth: అమిత్‌షాతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ -
బీఆర్ఎస్ తన పరువు తానే తీసుకుంది: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: తమ మేనిఫెస్టోపై విష ప్రచారం చేస్తున్నారని.. బీఆర్ఎస్ వేసిన ‘420 పుస్తకాన్ని ఖండిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 420 పుస్తకం వేసి బీఆర్ఎస్ తన పరువు తానే తీసుకుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేరన్నారు. ‘‘ఆర్థిక క్రమశిక్షణతో మా ప్రభుత్వం ప్రజలకు అవసరయ్యే నిర్ణయాలు తీసుకుంటాం. ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవం ఇవ్వరా?. బీఆర్ఎస్ నాయకులు మహిళలకు ఉచిత బస్సు వద్దని చెప్పదలచుకున్నారా?. ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే 2 పథకాలు అమలు చేశాం. 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 36 రోజుల తర్వాత గానీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేయలేదు. 2018లో ప్రజలిచ్చిన తీర్పును బాధ్యత లేకుండా అలుసుగా తీసుకున్నారు. నవ్విపోదురు గాక నాకేమీ సిగ్గు అనేలాగా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారు’’ అంటూ మంత్రి మండిపడ్డారు. పది సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలపై వేలాది మంది ప్రజావాణికి వస్తున్నారు. కనీసం సంవత్సరం తర్వాత మా పాలనపై విమర్శిస్తే బాగుండేది. 2014, 2018లో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతుంది’’ అంటూ మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. గడిల పాలన కాదు.. గల్లీ బిడ్డల పాలన: సీతక్క అధికారం పోయిందనే అక్కసుతో బీఆర్ఎస్ దుర్మార్గానికి ఒడి గట్టిందని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. గడిల పాలన కాదు గల్లీ బిడ్డల పాలన కావాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఒక్కసారి బీఆర్ఎస్ నాయకులు, కుటుంబ పాలన పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవాలంటూ హితవు పలికారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అన్నట్లు వ్యవహరించి పాలన చేశారు. అధికారం లేకుండా బతకలేని పార్టీగా తయారయ్యారు. ప్రజా స్పందన చూసి ఓర్వలేక పోతున్నారు. పదేళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. కానీ ముప్పై రోజులు కాక ముందే విమర్శలు చేస్తున్నారు’’ అంటూ సీతక్క మండిపడ్డారు. -
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల కానుంది. 29న పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా రాజీనామాతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరిద్దరూ ఎమ్మెల్యే కోటా కిందనే ఎన్నికయ్యారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. ►జనవరి 11న నోటిఫికేషన్ ►నామినేషన్ల దాఖలుకు చివరితేదీ జనవరి 18 ►జనవరి 19న నామినేషన్ల స్క్రూట్నీ ►నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ జనవరి 22 ►జనవరి 29న ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్, కౌంటింగ్ -
కాంగ్రెస్‌లో చేరిన షర్మిల
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు షర్మిల. న్యూఢిల్లీలోని AICC కార్యాలయానికి భర్త అనిల్‌తో వచ్చిన వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల.. కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు. షర్మిల ఏమన్నారంటే.. వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉంది ఈరోజు నుంచి కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ ఒక భాగం దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణలో పోటీ చేయలేదు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడం మా నాన్న కల కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తా రాహుల్ జోడో యాత్ర వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ యాత్రతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రాహుల్ జోడో యాత్ర ప్రజలతో పాటు నాలో కూడా విశ్వాసం నింపింది సెక్యులర్ పార్టీ కేంద్రంలో లేనందువల్లే మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్‌లో చేరినందుకు గర్వపడుతున్నాను. ఇక, వైఎస్సార్టీపీని 2021 జులై 8వ తేదీన ప్రారంభించారు షర్మిల. 2021 అక్టోబర్‌లో చేవెళ్ల నుంచి పాదయాత్ర చేశారు షర్మిల. ఈరోజు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. షర్మిల చేరిక కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి కొందరు నేతలు హాజరయ్యారు. Senior leader from Andhra Pradesh YS Sharmila ji joins the INC in the presence of Congress President Shri @kharge, Shri @RahulGandhi and General Secy (Org.) Shri @kcvenugopalmp at the AICC HQ in New Delhi. pic.twitter.com/LqMvqqqwCm — Congress (@INCIndia) January 4, 2024 AICC కార్యాలయంలో చేరిక అనంతరం సోనియా నివాసానికి వెళ్లారు షర్మిల, అనిల్. సోనియాను కలిసి పార్టీలో స్వాగతించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ బలోపేతం కోసం పని చేయమని సోనియా చెప్పారని, దేశమంతా రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా.. పార్టీ కోసం పని చేస్తానని, మీడియా అడిగే అన్ని ప్రశ్నలకు ఒకటి రెండు రోజుల్లో అన్నిటికీ సమాధానం చెప్తానని, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ బరిలో దిగుతానని చెప్పారు. -
CM Revanth: అమిత్‌షాతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. విభజన సమస్యలపై ప్రధానంగా భేటీ సాగింది. విభజన సమస్యలపై త్వరలోనే ఇద్దరు సీఎస్‌లను పిలిచి మాట్లాడతానని అమిత్‌షా హామీ ఇచ్చారు. నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బ్యూరోల కోసం పెరిగిన జిల్లాలకు అనుగుణంగా ఐపీఎస్‌ల సంఖ్య పెంచాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి ఉన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ, సాంకేతిక అనుమతులు ఇవ్వాలని వినతించారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్.. ఈ పర్యటనలో భాగంగా ఫైనాన్స్, హెల్త్, ఇరిగేషన్, పరిశ్రమలతో పాటు పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. -
రేవంత్ సర్కార్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అబద్ధాలను అస్త్రంగా మార్చుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో హామీలను నెరవేర్చకుంటే ప్రజలను చైతన్యవంతులను చేసి ఆ ప్రభుత్వాన్ని బొంద పెడతాం అని వార్నింగ్ ఇచ్చారు. కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని ఎగవేసేందుకు చేస్తున్న సిల్లీ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ విజయాలను వైఫల్యాలుగా చూపేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. అబద్ధాలను అస్త్రంగా మార్చుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో హామీలను నెరవేర్చకుంటే ప్రజలను చైతన్యవంతులను చేసి ఆ ప్రభుత్వాన్ని బొంద పెడతాం. రాబోయే రోజుల్లో మండల, నియోజకవర్గ స్థాయిలోనూ సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని రకాల ఎన్నికలకు కేడర్‌ను సన్నద్ధం చేస్తాం. కేడర్‌కు అండగా ఉంటూ కాంగ్రెస్ దుర్మార్గాలను ప్రజాస్వామికంగా ఎండగడతాం’. అధికారం కోసం అలవికాని హామీలిచ్చి తెలంగాణ ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చిన వెంటనే మాటమార్చి ఒక్కో హామీని తుంగలో తొక్కుతున్నది కాంగ్రెస్. కొత్తగా ఇచ్చేవి దేవుడెరుగు.. ఉన్న పథకాలనే ఊడగొడుతున్నది.. ఈ కాంగ్రెస్ సర్కార్..! ప్రజలను లైన్లలో నిలబెట్టి.. ప్రతి రోజు గోస పెడుతున్నది.. ఈ కాంగ్రెస్ సర్కార్..!! అందుకే... ఇచ్చిన 420 హామీల అమలుకోసం తెలంగాణ ప్రజల తరఫున.. ఒక గొంతుకగా నిలబడి ప్రశ్నిస్తాం..! కాంగ్రెస్ ను నిలదీస్తాం..!! ప్రజల పక్షాన ప్రతినిత్యం పోరాడుతాం..!!! అని కామెంట్స్ చేశారు. అధికారం కోసం అలవికాని హామీలిచ్చి తెలంగాణ ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చిన వెంటనే మాటమార్చి ఒక్కో హామీని తుంగలో తొక్కుతున్నది కాంగ్రెస్. కొత్తగా ఇచ్చేవి దేవుడెరుగు.. ఉన్న పథకాలనే ఊడగొడుతున్నది.. ఈ కాంగ్రెస్ సర్కార్..! ప్రజలను లైన్లలో నిలబెట్టి.. ప్రతి రోజు గోస పెడుతున్నది..… pic.twitter.com/kq9OiYeB4z — KTR (@KTRBRS) January 3, 2024 -
ఏకపక్ష నిర్ణయాలు ఉండవు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం కేవలం బీఆర్ఎస్ ఎంపీలతోనే సాధ్యమవుతుంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు గులాబీ దళాన్ని గెలిపించి తెలంగాణకు బలం ఇవ్వమని ప్రజలను కోరుతున్నాం. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకపక్ష నిర్ణయాలుండవు. అందరి అభిప్రాయాలూ తీసుకుంటాం..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. లోక్ సభ సన్నాహక సమావేశాల తొలిరోజు బుధవారం తెలంగాణ భవన్లో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పేగులు తెగేదాకా పోరాడేది బీఆరెస్సే ‘బీఆర్ఎస్ దళం, గళం పార్లమెంటులో ఉండాలి. బీఆర్ఎస్ వల్లే పార్లమెంటులో తెలంగాణ మాట ప్రతిధ్వనిస్తుంది. రాష్ట్ర హక్కుల కోసం పేగులు తెగేదాకా కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే. బెంగాల్‌కు మమతా బెనర్జీ, తమిళనాడుకు డీఎంకే స్టాలిన్, ఏపీకి జగన్, చంద్రబాబు, ఒడిశాకు నవీన్ పట్నాయక్, బీహార్‌కు నితీశ్‌కుమార్, మహారాష్ట్రకు శరద్ పవార్ తరహాలో తెలంగాణ రాజకీయ అస్తిత్వానికి ప్రతీక, పర్యాయపదం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ఆ తర్వాత విభజన హామీల అమలు, రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై కొట్లాడింది కూడా కేసీఆర్ మాత్రమే. మోదీ, రాహుల్ ఎన్నడూ తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంటులో మాట్లాడరు. తెలంగాణ గళానికి బలం లేకపోతే పార్లమెంటులో తెలంగాణ పదం వినపడకుండాపోయే చాన్స్ ఉంది..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు కార్యాచరణ ‘ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణాలను సమీక్షించుకుంటున్నాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ, గతంలో జరిగిన పొరపాట్లను సవరించుకుంటాం. చిన్న చిన్న లోటు పాట్లను సరిదిద్దుకునే దిశగా అంతర్గతంగా కార్యాచరణ ప్రారంభించాం. కేసీఆర్ కోలుకునేందుకు మరో ఐదారు వారాలు పడుతుంది. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా కేసీఆర్ కూడా తెలంగాణ భవన్‌కు వచ్చి అందరితోనూ మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదిలాబాద్ లోక్‌సభ సమీక్ష సందర్భంగా సుమారు 26 మంది నేతలు మాట్లాడిన అంశాలను క్రోడీకరించి కేసీఆర్‌కు వివరిస్తాం. స్థానిక వ్యతిరేకతతో కొందరు ఎమ్మెల్యేలు ఓడినా సీఎంగా కేసీఆర్ ఉంటారని ప్రజలు భావించినట్లు మా నేతలు చెప్తున్నారు. అభివృద్ధి విషయాల్లో ఎక్కడా బీఆర్ఎస్ పనితీరుపై ఫిర్యాదులు లేవు. కాంగ్రెస్ ఫేక్ ప్రాపగాండాతో యువత, ఉద్యోగులు కొంత దూరమయ్యారు. పార్టీ, పాలనలో కొన్ని లోటుపాట్లు సవరించక పోవడం వల్ల ఓటమి పాలయ్యామనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. దానికనుగుణంగా పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తాం..’ అని చెప్పారు. కాంగ్రెస్ దుర్మార్గాలను ఎండగడతాం ‘రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని ఎగవేసేందుకు చేస్తున్న సిల్లీ రాజకీయాలను ప్రజలు గమని స్తున్నారు. తెలంగాణ విజయాలను వైఫల్యా లుగా చూపేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్ని స్తున్నాయి. అబద్ధాలను అస్త్రంగా మార్చుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో హామీలను నెరవేర్చకుంటే ప్రజలను చైతన్యవంతులను చేసి ఆ ప్రభుత్వాన్ని బొంద పెడతాం. రాబోయే రోజుల్లో మండల, నియోజకవర్గ స్థాయిలోనూ సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని రకాల ఎన్నికలకు కేడర్‌ను సన్నద్ధం చేస్తాం. కేడర్‌కు అండగా ఉంటూ కాంగ్రెస్ దుర్మార్గాలను ప్రజాస్వామికంగా ఎండగడతాం..’ అని కేటీఆర్ అన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు. -
TS BJP: మొత్తం అంతా వాళ్లే చేశారు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు దాటినా బీజేపీలో ఒకరిపై ఒకరు ఫిర్యాదుల పర్వం మాత్రం ఆగడం లేదు. బుధవారం ఒక్క రోజే పార్టీ కార్యాలయానికి వందల సంఖ్యలో ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. గత నెల 3న అసెంబ్లీ ఫలితాలు ప్రకటించిన దరిమిలా మొదలైన పితూరీల పరంపర నేటికీ ఆగలేదని అంటున్నారు. దాదాపుగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఫిర్యాదులు రావడం, చిన్న కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కంప్లెయింట్స్ సమర్పించిన వారిలో ఉండడం చూసి పార్టీ పెద్దలు ఆశ్చర్యపోతున్నారట. నెలాఖరులోగా ఫిర్యాదుల పరిష్కారం? ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, ప్రత్యర్థి పార్టీకి, అభ్యర్థులకు సహకరించారని, పార్టీ అభ్యర్థి ఓటమికి కారణం అయ్యారని, ఇలా వివిధ స్థాయిల్లో నాయకులపై ఫిర్యాదులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక కొద్దిమంది నేతలు తమకు పార్టీలో ఇతరులతో ఉన్న వ్యక్తిగత కక్షలు, ద్వేషాల నేపథ్యంలో కూడా ఫిర్యాదులు పంపినట్టు చెబుతున్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర క్రమశిక్షణా కమిటీకి చైర్మన్ ఎం.ధర్మారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయా అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ కమిటీ గతనెల 30 తొలి సారి భేటీ కాగా, ఫిర్యాదులపై విచారణను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. భారీగా ఫిర్యా దులు వెల్లువెత్తుతుండడంతో కమిటీ ప్రతీవారం భేటీ అయి వీలైనంత వేగంగా వాటిని పరిష్కరించాలని భావిస్తోంది. ఇప్పటికే కొందరికి షోకాజ్‌లు జారీ... క్రమశిక్షణా కమిటీ మొదటి సమావేశంలో...ఎన్నికల్లో పా ర్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి, ఎన్నికల బాధ్యతలు సరిగా నిర్వహించ ని వారికి, నిర్లక్ష్యం వహించి పార్టీకి నష్టం చేసిన పలువురికి షోకాజ్ నోటీసులు జారీచేసింది. వారం, పదిరోజుల్లో వివరణ ఇవ్వాలంటూ శ్రీముఖాలు అందుకున్న వారిలో ఇద్దరు ముగ్గు రు జిల్లా అధ్యక్షులు, పదిమంది వరకు రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారని తెలిసింది. వీరిపై ఆరోపణల తీవ్రతను బట్టి చర్యలకు దిగనున్నట్టు తెలుస్తోంది. ఇక మరికొన్ని ఫిర్యాదులపై అదనపు సమాచారాన్ని కోరినట్టు తెలిసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు సహకరించారనే తీవ్రమైన ఆరోపణలు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్న దానిపై కచ్చితమైన ఆధారాలు, సమాచారం ఇస్తే సస్పెన్షన్లు, బహిష్కరణలు వంటి తీవ్ర నిర్ణయాలు కమిటీ తీసుకునే అవకాశాలున్నాయని పార్టీనేతలు చెబుతున్నారు. -
ఎవరికీ భయపడం.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
హైదరాబాద్, సాక్షి: దేశంలో దివాలా తీసిన పార్టీకి తెలంగాణలో అనుకోకుండా అవకాశం వచ్చిందని.. అయితే మోసపూరిత హామీలతోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. అలాంటి వాళ్ల బెదిరింపులకు భయపడేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల నేపథ్యంలో బుధవారం సాయంత్రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్పై జరిగిన దుష్రచారాన్ని సరిగ్గా ఎదుర్కొ లేకపోయాం. ఎన్నికల్లో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. చిన్నచిన్న లోపాలతోనే మేం ఓడిపోయాం. అయినా.. తెలంగాణ అభివృద్ధి విషయంలో కట్టుబడి ఉన్నాం. బీఆర్ఎస్ ఓడిపోతుందని అనుకోలేదన్న చర్చ గ్రామస్థాయిలో ఇంకా నడుస్తోంది. నేటి నుంచి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలోనూ ఈ ప్రస్తావన వచ్చింది. పార్టీ కేడర్‌ను పట్టించుకోలేదని నేతలు ఈ సమావేశంలో చెప్పారు. కొన్ని ఇబ్బందులను మేం కూడా గుర్తించాం’’ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ. ప్రజల కోసం బీఆర్ఎస్ ఎన్నో పోరాటాలు చేసింది. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుంది బీఆర్ఎస్సే. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. అవన్నీ బుక్‌లెట్‌గా ప్రచురించాం. ఇంటింటికి పంచి ప్రజల్లోకి తీసుకెళ్తాం. బీఆర్ఎస్ నేతలపై దాడులు జరుగుతున్న విషయం అధిష్టానం దృష్టికి వచ్చింది. తుంగతుర్తిలో తాజాగా ఇద్దరు కార్యకర్తలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్ని సహించం. ఇప్పటి నుంచి ఎవరి మీద దాడులు జరిగినా.. మేం వెళ్లి పరామర్శిస్తాం. బీఆర్ఎస్ లేకపోతే పార్లమెంట్లో తెలంగాణ ఉనికి లేకుండా పోతుంది. పార్లమెంట్ లో తెలంగాణ గళం వినిపించాలంటే.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలి. తెలంగాణ బలం-తెలంగాణ గళం బీఆర్ఎస్. కాంగ్రెస్‌వి చిల్లర రాజకీయాలు ప్రభుత్వంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సింది పోయి.. దివాలాకోరు రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. ల్యాండ్ క్రూజర్ వాహనాల విషయంలో కాంగ్రెస్ నాయకులు చిల్లరగా మాట్లాడుతున్నారు. అవి సొంతానికి వాడుకునే వాహనాలు కాదు. కేవలం హామీల అమలు పక్కనపెట్టడానికే కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారాయన. కాళేశ్వరంపై విచారణకు సిద్ధమన్న కేటీఆర్.. తప్పు చేయని తాము ఎవరికీ భయపడబోమని అన్నారు. దేశంలో దివాలా తీసిన పార్టీకి తెలంగాణలో అనుకోకుండా అవకాశం వచ్చింది. రైతు బంధుపై ఇప్పటిదాకా అతీగతీ లేదు. సొంత రాష్ట్రం పరపతిని తగ్గించే విధంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్‌ను బండి సంజయ్ పొగుడుతున్నారు. వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు ఉంది. బీజేపీలో బలమైన అభ్యర్థుల్ని బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించింది. అయితే.. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే. అందుకే 2019 ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. -
బోర్లాపడి బొక్కలు విరిగినా బీఆర్ఎస్కు బుద్ది రాలేదు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి పీసీసీ విస్తృతస్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరుగిన ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, ప్రదేశ్ ఎన్నికల, రాజకీయ వ్యవహారాల కమిటీల సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు ఎకరం స్థలం కేటాయించనున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. 6 గ్యారంటీల అమలుకు త్వరలో గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జోనల్ వ్యవస్థను సమీక్షించేందుకు ఇదిరమ్మ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఎస్సీ కమిషన్ రద్దు చేసి, త్వరలో కొత్త కమిషన్ నియమించనున్నారు. చదవండి: కేడర్ వివాదం కేసు.. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేత రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను ఖరారు కార్యవర్గ భేటీలో పార్టీ నేతలు 3 తీర్మానాలు ప్రవేశపెట్టారు. జనవరి 8,9 తేదీల్లొ పార్లమెంట్ ఎన్నికలపై ఉమ్మడి జిల్లా నేతలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. 11,12,13 తేదీల్లొ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మంత్రులు, నేతలతో ఎన్నికలపై సమావేశం కానున్నారు. అనంతరం ముఖ్యమంత్రి 14వ తేదీ నుంచి 4 రోజుల పాటు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎంతోపాటు మంత్రి శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. ఈ పర్యటన అనంతరం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు సీఎం రేవంత్. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి.. వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తమదని అన్నారు. బోర్లపడి బొక్కలు విరిగినా బీఆర్ఎస్కు బుద్ది రాలేదని విమర్శించారు. నెల రోజులు గడవకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుందని ధ్వజమెత్తారు రేవంత్. బీఆర్ఎస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సూచించారు. టార్గెట్ 17 పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పనిచేయాలని..12కు తగ్గకుండా సీట్లను గెలిపించుకోవాలని తెలిపారు. ఈ నెల 8న 5 జిల్లాలు.. 9న 5 జిల్లాల నేతలతో సమీక్షించనున్నట్లు చెప్పారు . 20 తరువాత క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంటానని తెలిపారు. ‘బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గినట్టుంది. అందుకే కిషన్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నారు. ఆనాడు స్వయంగా నేను సీబీఐ ఎంక్వయిరీ కోరినపుడు ఏం చేశారు. దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నాడు. కాళేశ్వరం అవినీతిపై మేం జ్యుడీషియల్ విచారణ చేసి తీరుతాం. బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలు. ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు. పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారు’ అని రేవంత్ మండిపడ్డారు. కార్యవర్గ భేటీ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దశాబ్ద కాలం తర్వాత మనకు వచ్చిన గొప్ప అవకాశమని తెలిపారు. అనేక కష్టనష్టాలను భరించి అధికారంలోకి వచ్చామన్నారు. యువత ఎన్నో కలలు కని తెలంగాణ కోసం పోరాటం చేశారని చెప్పారు. ప్రజలకు మనం ఇచ్చిన హామీలపై విశ్వాసంతో కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన పని చేస్తున్న వారంతా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పిచేశారని భట్టి మండిపడ్డారు. ఒకవైపు రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం కావాలని, మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినట్టు ప్రజలు ఫీల్ అవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఇస్తామన్నారు. ఇతర మంత్రులు మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. తలతాకట్టు పెట్టైనా 6 గ్యారంటీలు అమలు చేస్తాం తెలిపారు. -
ఈ నెల 6,7,8 తేదీల్లో బీజేపీ భేటీ
సాక్షి, హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కీలకభేటీకి బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 6, 7, 8 తేదీల్లో జాతీయ నేతలు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్‌లు రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కొత్త ఎన్నికల కమిటీ నియామకంపై దృష్టి పెట్టనున్నారు.90 రోజుల ఎన్నికల కార్యాచరణ ప్రణాళికపై చర్చించి ఖరారు చేయనున్నట్టు రాష్ట్రపార్టీవర్గాల సమాచారం. లోక్‌సభ ఎన్నికల ముందు వరకు పార్టీపరంగా ఏయే కార్యక్రమాలు చేపట్టాలి ? ఏయే అంశాలపై దృష్టి పెట్టాలి ? అనే అంశంపై ఐదారు కమిటీలను నియమించనున్నట్టు తెలుస్తోంది. పనిలోపనిగా జాతీయ నేతలు అభిప్రాయసేకరణ జరిపాక బీజేఎల్పీనేతను ఎన్నుకోవాల్సి ఉన్నందున, ఈ భేటీల సందర్భంగా ఈ ఎన్నిక జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని పార్టీనేతలు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి మహిళలు, బీసీలకు ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. ముందుగానే లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన : కిషన్‌రెడ్డి ఎంపీ టికెట్లకు సంబంధించి దరఖాస్తులేవీ స్వీకరించడం లేదని మంగళవారం మీడియా చిట్‌చాట్‌లో కిషన్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థుల ఖరారు అనేది జాతీయ నాయకత్వం పరిధిలోనే ఉంటుందన్నారు. గతంతో పోల్చితే ముందుగానే 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను నాయకత్వం ప్రకటిస్తుందని చెప్పారు. ఇప్పటికైతే నాలుగు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ గ్యారంటీపై చర్చ జరగలేదన్నారు. వరంగల్ నుంచి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ పోటీచేస్తారనే దానిపై ఎలాంటి చర్చ కానీ, నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. -
కేసీఆర్‌ను రక్షించేందుకే సీబీఐ విచారణా?
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును రక్షించడానికే మీరెప్పుడూ సీబీఐ విచారణ కోరుతుంటారని, సీబీఐ మీ పెంపుడు సంస్థ అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. కేంద్రమంత్రి కిషన్రెడ్డినుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై జ్యుడీషియల్ విచా రణ చేయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ఇందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించాలని వ్యాఖ్యానించారు. మంగళవారం సచివాలయ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ను రక్షించడానికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చిలుక పలుకులు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉన్నా ఇప్పటివరకు కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదని, అప్పుడే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్య క్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని, గోషామహ ల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదని, జూబ్లీహిల్స్‌లో మాత్రం బీఆర్ఎస్ పోటీ చేసిన తీరు తీస్తుంటే వీళ్ల స్నేహం అర్థం అవుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ నేతలు లేనిపోని అపోహలు స్పష్టిస్తున్నారని, ఆటో డ్రైవర్లతో ధర్నాలు చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై మాట్లాడేందుకు ఎవరు వచ్చినా తాను రెడీగా ఉంటానని, సచివాలయంలోనైనా మాట్లాడేందుకు సిద్ధమన్నారు. ప్రజాపాలన దరఖాస్తులకు ఈనెల 6 వరకే గడువు అని, పొడిగింపు ఉండదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. కేంద్రం స్పందించాలి లారీ డ్రైవర్ల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. లేకపోతే నిత్యవసరాల ధరలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను పిలిచి తెలంగాణ భవన్లో కేటీఆర్ భోజనాలు పెట్టడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఇంకా మంత్రి అనుకుంటున్నారే మోనని ఎద్దేవా చేశారు. కార్మికులకు భోజనాలు కాదు... వాళ్లకు బట్టలు కుట్టించాలని హితవు పలికారు. -
కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రా యాలని, 48 గంటల్లో తాను కేంద్రం నుంచి అను మతి తెస్తానని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సవాల్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధి చాటుకోవాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య దోస్తీ లేదని నిరూపించుకోవాలని అన్నారు. న్యాయ విచారణతో పాటు సీబీఐ దర్యాప్తుతో ఫలితాలు వేగంగా వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. విపక్షంలో ఉన్నపుడు సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు కేవలం న్యాయవిచారణ జరిపిస్తామనడం అనేక అనుమానాలకు తావిస్తోందని మంగళవారం మీడి యాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకు తాత్సారం? బీఆర్ఎస్ సర్కార్ అతిపెద్ద అవినీతి స్కాం కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తునకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదని, ఎందుకు తాత్సారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరం విషయంలో కేంద్రంతో పాటు ప్రధాని మోదీపై, తనపై కాంగ్రెస్ నేతలు ఇష్టం వచి్చనట్టుగా విమర్శలు గుప్పించారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తు జరిపి దోషులను శిక్షించే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? లేదా? స్పష్టం చేయాలన్నారు. అవగాహన నేపథ్యంలో సానుభూతి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి బొటాబోటీ మెజారిటీతో తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరిగా ఉండడంతో ప్రస్తుత సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్‌ల మధ్య ఎంఐఎం మధ్యవర్తిత్వంతో అవగాహన ఏర్పడిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్‌కు సాను భూతి ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. తామిద్దరం చే సేది దోపిడీయేనని, తమ డీఎన్ఏ ఒకటేననే అభి ప్రాయంతో కాంగ్రెస్ ఉందని వ్యాఖ్యానించారు. మే డిగడ్డ సందర్శన సందర్భంగా రాష్ట్ర మంత్రులు పవ ర్ పాయింట్ ప్రజెంటేషన్లకే పరిమితమయ్యారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజాధనాన్ని గోదాట్లో కలిపారని, దీని కోసం ఖర్చు చేసిన రూ.లక్ష కోట్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 17 ఎంపీ స్థానాలకు పోటీ ఫిబ్రవరి 28న లేదా మార్చి మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయని కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలోని 17 స్థానాలకు బీజేపీ పోటీ చేస్తుందని, జనసేనతో పొత్తు ఉండకపోవచ్చునని అన్నా రు. జనసేన ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామిగా ఉందని, ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు విషయమై చర్చ జరగలేదని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి కేంద్రం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ నెల 17న సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానుందని, ఆ లోగానే కేంద్రం అఫిడవిట్‌ను సమర్పిస్తుందని చెప్పారు. -
కాళేశ్వరంలో కేంద్రానికి వాటాలు!
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్టుకు, ప్రాజెక్టులో జరిగిన అవినీతికి మద్దతిచ్చిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ‘మీరు దోచుకోండి.. మా వాటా మాకు ఇవ్వండి’ అనే ధోరణిలో గత పదేళ్లుగా కేంద్రం వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర శాసనసభలో ప్రకటించినట్టుగా వారంలోగా కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని వెల్లడించారు. మంగళవారం ఆయన రాష్ట్ర సచివాలయం మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. ‘రూ.లక్ష కోట్లు మింగారని మీరే అంటున్నారు. మనీ ల్యాండరింగ్ తప్పకుండా జరిగి ఉంటుంది. అలాంటప్పుడు గత 10 ఏళ్లలో సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో విచారణ ఎందుకు జరిపించలేదు’ అని ప్రశ్నించారు. నిబంధనలను మార్చి కాళేశ్వరానికి రుణాలు.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పీఎఫ్సీ, ఆర్ఈసీలు గతంలో కేవలం విద్యుత్ రంగ ప్రాజెక్టులకే రుణాలు ఇచ్చేవని, కానీ ఈ సంస్థలు మెమోరాండం ఆఫ్ ఆర్టికల్స్( రాజ్యాంగాల)ను సవరించి కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు ఇచ్చాయని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పీఎఫ్సీ రూ.1.27లక్షల కోట్ల రుణాలను మంజూరు చేసి సింహభాగం విడుదల చేసిందన్నారు. ఆర్ఈసీ సైతం మరో రూ.60వేల కోట్ల రుణాలను నీటిపారుదల ప్రాజెక్టులకు ఇచ్చిందన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఆర్ఈసీ, పీఎఫ్సీలు అంతకు ముందు నీటిపారుదల ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వలేదన్నారు. ఇంత అవినీతి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం రుణాలకు ఎలా అనుమతిచ్చిందని ప్రశ్నించారు. రూ.80వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతిచ్చిందని, ఆ తర్వాత ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1.27లక్షల కోట్లకు పెంచేందుకు ఎలా అనుమతి ఇచ్చారని నిలదీశారు. కేసీఆర్ మౌనాన్ని ఎందుకు ప్రశ్నించరు? కేంద్ర సంస్థలు రుణ సహాయం చేసిన మేడిగడ్డ బ్యారేజీ గత అక్టోబర్ 21న కుంగిపోగా, ఇప్పటి వరకు కిషన్ రెడ్డి ఎందుకు సందర్శించలేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటనపై గత సీఎం కేసీఆర్ మౌనాన్ని బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. గత ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీకి విలేకరులను అనుమతించకపోతే ఎందుకు మాట్లాడలేదు అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం గత ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించలేదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోని సమస్యలు పరిష్కారమయ్యే వరకు బిల్లుల చెల్లింపులు ఉండవని మంత్రి ఉత్తమ్ తేల్చి చెప్పారు. కేసీఆర్‌పై ఎందుకు కేసులు పెట్టలేదు కేసీఆర్, నీటిపారుదల శాఖపై ఎందుకు కేసులు పెట్టలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎం వంటిదని..రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపిస్తున్నారని, కానీ విచారణ ఎందుకు జరిపించలేదని నిలదీశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత పాత్రపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై తన వద్ద సమాచారం లేదన్నారు. -
ఒక ఎంపీ సీటివ్వండి
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఒక స్థానం కేటాయించాలని సీపీఐ బృందం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీఎంతో సీపీఐ ప్రతినిధి బృందం మంగళవారం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. సచివాలయంలో సుమారు గంట పాటు జరిగిన భేటీలో వర్తమాన అంశాలపై చర్చ జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, పశ్యపద్మ తదితరులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ అవగాహన సత్ఫలితాలను ఇచ్చిందని ఈ సందర్భంగా సీపీఐ నేతలు పేర్కొన్నారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐలు తెలంగాణలో అవగాహనతో పోటీ చేసేందుకు పరస్పరం సహకరించుకోవాలన్నారు. కాగా, ఖమ్మం లేదా నల్లగొండ స్థానాల్లో ఏదో ఒకటి ఇవ్వాలని రేవంత్‌ను కోరినట్లు సమాచారం. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు తమ నిర్ణయం ఉంటుందని సీఎం అన్నట్లు తెలిసింది. కాగా, గత ఎన్నికల సందర్భంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండు ఎమ్మెల్సీ స్థానాలు తమకు కేటాయించాలని కూడా సీపీఐ నేతలు సీఎంకు గుర్తుచేశారని సమాచారం. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నట్లు తెలిసింది. న్యాయవిచారణ పరిధిలో సింగరేణిని చేర్చాలి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడంతో పాటు, పటిష్టపరచాలని సీఎంకు సీపీఐ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. సింగరేణి కాలరీస్‌లో జరిగిన అవినీతి, అక్రమాలను న్యాయవిచారణ పరిధిలోకి తీసుకురావాలని కూనంనేని సాంబశివరావు కోరారు. అలాగే సమ్మె నోటీసు ఇచ్చిన జెన్ కో కార్మికులు, ఇతర ఉద్యోగులపై గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని, సుమారు 400 మంది ఫోర్ మెన్ ఆర్టిజన్లను వివిధ కారణాలతో పనిచేసిన చోటు నుంచి బైటకు పంపడమో, తొలగించడమో జరిగిందని, ఎస్ఈలను డీఈలు, డీఈ, ఏడీఈలుగా డిమోట్ చేయడం వంటి చర్యలకు పాల్పడిందని, వీటిని సరిచేయాలని సీఎంను కోరారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు అందుబాటులో ఉంటా: సీఎం కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందు బాటులో ఉన్నట్లుగా ప్రజలలో భావన నెలకొందని, సీఎం, మంత్రులు కూడా అందుబా టులో ఉంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్న దని సీపీఐ నేతలు తెలిపారు. వివిధ ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు, ప్రజా సంఘాలు, పార్టీల నేతల ను కలిసేందుకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు తాను అందుబాటులో ఉంటానని సీఎం చెప్పినట్లు సీపీఐ నేతలు వెల్లడించారు. ఈ సచివాలయం మీ కోసమే కేసీఆర్ కట్టించారు: నారాయణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాల యాన్ని రేవంత్‌రెడ్డి కోసమే కట్టించారని నారా యణ సరదాగా వ్యాఖ్యానించారు. గత ప్రభు త్వం వివిధ సంస్థలు, శాఖల్లో రిటైర్డ్ అధికా రులను నియమించి ఏళ్ళ తరబడి కొనసాగించిందని, కొత్త ప్రభుత్వంలో ఆ సంప్రదాయా నికి స్వస్తి పలకాలని నారాయ ణ సూచించారు. రిటైర్డ్ ఐఏఎస్‌లను ప్రభుత్వంలోకి తీసుకో వద్దని కోరారు. -
నేటి నుంచి బీఆర్ఎస్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా బుధవారం నుంచి సన్నాహక సమావేశా లు నిర్వహించేందుకు భారత్ రాష్ట్ర సమితి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండు విడతలుగా రోజుకో లోక్‌సభ నియో జకవర్గం చొప్పున భేటీలు జరుగుతాయి. తొలి రోజు బుధవారం ఆదిలాబాద్ లోక్‌సభ నియోజక వర్గం పరిధిలోని పార్టీ నేతలతో సమావేశం ఏర్పా టు చేశారు. తెలంగాణ భవన్లో ఉదయం 10.30 కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అధ్య క్షతన ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఆదిలా బాద్ మాజీ ఎంపీ గోడెం నగేశ్‌తో పాటు ఎమ్మెల్యే లు అనిల్ జాధవ్, కోవా లక్ష్మి, ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజక వర్గాల ఇన్చార్జిలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సుమారు 500 మంది పాల్గొంటారు. సీనియర్ నేతలకు సమన్వయ బాధ్యతలు సన్నాహక సమావేశాలను కేటీఆర్‌తో పాటు పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మాజీ స్పీకర్లు పోచా రం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు సమన్వ యం చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో లోక్‌సభ నియోజ కవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించే అవకాశా లు ఉన్నాయి. కాగా ఈ సన్నాహక సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచర ణపై దిశానిర్దేశం చేస్తారు. కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ లోక్‌సభ సన్నాహక సమావేశాల ప్రారంభం నేపథ్యంలో కేటీఆర్ మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేయాల్సిన అంశాలను కేసీఆర్ వివరించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో తొలిసారిగా పార్టీ కీలక నేతలందరూ హాజరవుతుండటంతో ఈ సన్నాహక సమావేశాలపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. -
కాళేశ్వరం అవినీతికి బీజేపీ మద్ధతు: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, సాక్షి: బాధ్యతలు తీసుకుని నెలైనా గడవక ముందే తమ ప్రభుత్వంపై కొందరు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం అవినీతి విషయంలో సీబీఐ విచారణ డిమాండ్ చేసే క్రమంలో కేంద్ర మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన రాజకీయ విమర్శలకు మంత్రి ఉత్తమ్ మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ కౌంటర్ ఇచ్చారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు సత్యదూరంగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రంలో ఉన్న బీజేపీ మద్దతు ఇచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రూల్స్ మార్చారు. స్వాతంత్రం తరువాత సాగునీటి ప్రాజెక్టులకు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు. బ్యాంక్ లు, రూరల్ ఎలాక్ట్రిఫిషల్ ద్వారా లోన్స్ కాళేశ్వరం ప్రాజెక్టు కు కేంద్రం ఇప్పించింది. పవర్, ఇరిగేషన్ కార్పొరేషన్‌కు నిబంధనలు మార్చేసి మరీ లోన్ ఇచ్చింది. ప్రాజెక్టు కోసం ఏకంగా రూ. లక్షా 27 వేల కోట్లు మంజూరు చేశారు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకే రూ. 60వేల కోట్ల లోన్ బీజేపీ ఇప్పించింది. ‘‘దోచుకుందాం’’ అని లక్షల కోట్లు ఇచ్చారా?.. మేడిగడ్డ 5 పిట్లు కుంగితే కనీసం కిషన్ రెడ్డి పరిశీలన చెయ్యలేదు. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేసిన కాళేశ్వరం కుంగితె ఎందుకు విజిట్ చెయ్యలేదు?. మేడిగడ్డ పై కేసీఆర్ స్పందించకపోతే కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు?. 80వేల కోట్ల ప్రాజెక్ట్ ను 1లక్ష 27వేల కోట్లకు పెంచితే కేంద్రం ఎందుకు అనుమతి ఇచ్చింది?. సీబీఐ-ఈడీ అంటూ ఇప్పుడు కిషన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకుల పై తప్పు చేయకున్నా ఈడీ కేసులు వేసిన బీజేపీ.. కేసీఆర్ పై ఎందుకు వెయ్యలేదు?. కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం అనే అమిత్ షా, మోడీ, జేపీ నడ్డా పదే పదే అన్నారు కదా.. మరి ఎందుకు విచారణకు అదేశించలేదు? .. లిక్కర్ కేసులో కవిత పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. పదేళ్ల పాటు లక్షల కోట్లు బీఆర్ఎస్ వాళ్ళు తిన్నారు అని బీజేపీ ఆరోపణ చేసింది మరి సీబీఐ విచారణ ఎందుకు కోరలేదు. మేడిగడ్డ డ్యామేజ్ పై ఖర్చు అంతా పూర్తిగా సంస్థనే భరిస్తుంది. ఇరిగేషన్ పై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తాం. .. కాళేశ్వరం ప్రాజెక్టు పై మేము ఇచ్చిన మాట ప్రకారం జ్యుడీషియల్ విచారణ ఈ వారంలోనే మొదలు పెట్టాం. పదేళ్లపాటు అవినీతి కోసం బీజేపీ-బీఆర్ఎస్లు కలిసి పని చేశాయి. బాధ్యతలు తీసుకుని 20 రోజలైనా గడవక ముందే మాపై విమర్శలా?. కేసీఆర్ మాట్లాడకపోవడాన్ని బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదు. ఎవరు తప్పు చేసినా మేం వదిలిపెట్టం అని మంత్రి ఉత్తమ్ చెప్పారు. అంతకు ముందు.. కాళేశ్వరం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్పందించారు. ‘‘కాళేశ్వరం పై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించాం. కేసీఆర్‌ను రక్షించేందుకే బీజేపీ సీబీఐ విచారణ అడుగుతోంది. జ్యుడీషియల్ విచారణకు కేంద్రం ఉన్న బీజేపీ న్యాయ శాఖ సుప్రీం, లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జీని నియమించాలి. జ్యుడీషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని నియమించకుంటే.. కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి’’ అని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘కాళేశ్వరం అవినీతి.. బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య సయోధ్యనా?’ -
తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండదు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండకపోవచ్చని కేంద్రమంత్రి, ఆ పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. జనసేన ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని.. ఏపీలో జనసేనతో పొత్తు అంశం చర్చకు రాలేదని తెలిపారు. ఈ మేరకు నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 7,8 తేదీల్లో బీజేపీ నేతల సమావేశం ఉందని అన్నారు. కొత్త ఎన్నికల కమిటీ ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారంటీ అని ఎక్కడా చర్చ జరగలేదని చెప్పారు. బీజేపీ నుంచి మందకృష్ణ మాదిగ ఎంపీగా పోటీ చేసే అంశం చర్చకు రాలేదని స్పష్టం చేశారు. ఆయన మాదిగ రిజర్వేషన్ల కోసం పనిచేస్తున్నారన్నారు.ఎల్పీ నేత ప్రకటన అమిత్ షా వచ్చిన రోజే ప్రకటించాల్సిందని.. ఢిల్లీ నుంచి వచ్చే పరిశీలకులు ఎల్పీ నేతపై ప్రకటన చేస్తారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. మహిళలకు, బీసీలకు ఎంపీ టికెట్లలో పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోసం 90 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి చివరన లేదా మార్చి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచినా ఎవరికి ప్రయోజనం లేదన్నారు. కాంగ్రెస్‌లో లీడర్ ఎవరో తెలియదని.. బీజేపీకి ఓటేసేందుకు జనాలు సిద్దంగా ఉన్నారని అన్నారు.